Lenovo Tab M11 Launch : భారీ బ్యాటరీతో లెనోవో ట్యాబ్ ఎం11 వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Lenovo Tab M11 Launch : కొత్త ట్యాబ్ కొంటున్నారా? లెనోవో నుంచి సరికొత్త మోడల్ టాబ్లెట్ లాంచ్ అయింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్యాబ్ ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.

Lenovo Tab M11 Launch : భారీ బ్యాటరీతో లెనోవో ట్యాబ్ ఎం11 వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Lenovo Tab M11 With MediaTek Helio G88 SoC, 7,040mAh Battery Launched

Updated On : January 10, 2024 / 4:25 PM IST

Lenovo Tab M11 Launch : 2024 కొత్త ఏడాదిలో లెనోవో సరికొత్త ట్యాబ్ వచ్చేసింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2024 ఈవెంట్లో లెనోవో ట్యాబ్ ఎం11 లాంచ్ అయింది. ఈ టాబ్లెట్ లెనోవో ట్యాబ్ ఎం10కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ డివైజ్ స్టైలస్ సపోర్టును కూడా అందిస్తుంది. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను అందుకోనుంది.

Read Also : Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్ డిజైన్, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్.. పూర్తి వివరాలు మీకోసం..!

ఆండ్రాయిడ్ 13తో మీడియాటెక్ హీలియో జీ88 చిప్‌సెట్, 7,040ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ టాబ్లెట్‌లో 13ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో అమెరికాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తుంది. భారత్‌తో సహా ఇతర ప్రాంతాలలో ఈ టాబ్లెట్‌ను రిలీజ్ చేస్తారో లేదో కంపెనీ ప్రకటించలేదు.

లెనోవో ట్యాబ్ ఎం11 ధర, లభ్యత :
లూనా గ్రే, సీఫోమ్ గ్రీన్, కలర్ వేస్‌లో లెనోవో ఎం11 ట్యాబ్ 4జీబీ+ 64జీబీ ఆప్షన్ 179 డాలర్లు (సుమారు రూ. 14,900) నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏప్రిల్ నుంచి అమెరికాలో కొనుగోలుకు టాబ్లెట్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. 4జీబీ + 128జీబీ 8జీబీ + 128జీబీ కాన్ఫిగరేషన్లలో కూడా అందించనుంది.

లెనోవో ట్యాబ్ ఎం11 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
కొత్తగా లాంచ్ అయిన లెనోవో టాబ్లెట్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల ఫుల్-హెచ్‌డీ (1,920 x 1,200 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. లెనోవో ట్యాబ్ ఎం11 మల్టీ-టాస్కింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు ఒకే సమయంలో సినిమాలు చూస్తున్నప్పుడు నోట్స్ లేదా డూడుల్ తీసుకోవచ్చు. క్రోమాటిక్, మోనో రీడింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

Lenovo Tab M11 With MediaTek Helio G88 SoC, 7,040mAh Battery Launched

Lenovo Tab M11 Launched

లెనోవో ట్యాబ్ ఎం11 మాలి-జీ52 ఎంపీ2 జీపీయూతో మీడియాటెక్ హెలియో జీ88 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. 6జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సి 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

హ్యాండ్‌రైటింగ్ కూడా టెక్స్ట్‌గా మార్చడంలో సాయపడే (Nebo) సాఫ్ట్‌వేర్‌ ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. రియల్ టైమ్ ఫంక్షన్‌లను పరిష్కరించడానికి (MyScript) కాలిక్యులేటర్ 2, డాక్యుమెంట్‌లను వీక్షించడానికి, ఎడిట్ చేయడానికి (WPS) ఆఫీస్ కూడా ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఓఎస్ రన్ అవుతుంది.

ఈ మోడల్ రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లకు సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 వరకు నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లకు సపోర్టు ఇస్తుందని లెనోవా ప్రకటించింది. లెనోవో ట్యాబ్ ఎం11 మోడల్ 13ఎంపీ ప్రధాన బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.

యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 15డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,040ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. సపరేటుగా విక్రయించే లెనోవో ట్యాబ్ పెన్ కూడా సపోర్టు ఇస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌తో క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. లెనోవో ట్యాబ్ ఎం11 మోడల్ వై-ఫై 802.11, బ్లూటూత్ వి5.1 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. కొన్ని ప్రాంతాలలో టాబ్లెట్ ఎల్టీఈకి కూడా సపోర్టు ఇస్తుంది. 465గ్రాముల బరువు, టాబ్లెట్ పరిమాణం 55.26ఎమ్ఎమ్ x 166.31ఎమ్ఎమ్x 7.15ఎమ్ఎమ్ ఉంటుంది.

Read Also : Apple iPhone 14 Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?