మొబైల్ రంగంలో కొత్త విప్లవం..రెండు స్క్రీన్లు LG Dual Screen

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 12:05 PM IST
మొబైల్ రంగంలో కొత్త విప్లవం..రెండు స్క్రీన్లు LG Dual Screen

Updated On : September 3, 2020 / 12:49 PM IST

మొబైల్‌ రంగంలో మరో సరికొత్త విప్లవం రాబోతోంది. రెండు స్క్రీన్ల ఫోన్లు త్వరలో మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఈ దిశగా LG Company మందడుగు వేసింది. టీ ఆకారంలో ఉండే ఫోన్‌ను త్వరలో లాంఛ్‌ చేయబోతోంది. ఇందుకు సంబంధించి ట్రైలర్‌ వీడియోను విడుదల చేసింది.



రెండు స్క్రీన్లున్న ఈ ఫోన్‌ను ఈనెల 14న అధికారికంగా రిలీజ్ చేయనుంది. నూతన టెక్నాలజీతో రూపొందిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు సరికొత్త
అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
https://10tv.in/tamil-actress-meera-mitun-says-she-wants-to-visit-nithyanandas-kailasa-country/
ఇంగ్లీషు భాషలోని T షేపులో ఉన్న డబుల్ స్క్రీన్ ఫోన్ అందర్నీ ఆకర్షిస్తోంది.
దీనిని వింగ్ ఫోన్ అంటున్నారు. రెండు రెక్కల ఆకారంలో ఉంది. ఎల్జీ వింగ్ 6.8 అంగుళాల ప్రధాన స్క్రీన్ ఉంది. 4 అంగుళాల చిన్న స్క్రీన్ ఉంది. 5 జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.