Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్.. హిందూ పేరు ‘కమల’గా నామకరణం..!

Maha Kumbh Mela 2025 : దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ మహా కుంభ్‌లో పాల్గొనేందుకు వచ్చారు.

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్.. హిందూ పేరు ‘కమల’గా నామకరణం..!

Maha Kumbh Mela 2025 : Laurene Powell Jobs

Updated On : January 13, 2025 / 5:40 PM IST

Maha Kumbh Mela 2025 : భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ మహాకుంభంమేళాపై పెద్దచర్చ జరుగుతోంది. ప్రముఖ ఐఫోన్‌ తయారీ అమెరికన్ కంపెనీ ఆపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ (Laurene Powell Jobs) కూడా మహాకుంభ్‌లో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. కుంకుమ వస్త్రం ధరించి రుద్రాక్ష జపమాలతో పాటు సన్యాసి వేషధారణలో మహాకుంభానికి చేరుకున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని నిరంజినీ అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి ఆశ్రమానికి ఆమె చేరుకున్నారు. జనవరి 29 వరకు జరిగే అనేక మహాకుంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Read Also : Mahakumbh 2025 : మహాకుంభమేళాలో మొదటి రోజు 60 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు.. ఏరియల్ ఫుటేజీలో భారీ జనసందోహం!

జనవరి 15 వరకు శిబిరంలోనే ఉండి.. ఆ తర్వాత అమెరికాకు తిరిగివచ్చిన ఆమె అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. లారెన్ తన 40 మంది సభ్యుల బృందంతో శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని తన గురువైన స్వామి కైలాసానంద మహారాజ్‌ వద్దకు లారెన్ పావెల్ చేరుకున్నారు. ఋషుల సహవాసంలో సాదాసీదా జీవితాన్ని ఆమె గడుపుతారు.

Maha Kumbh Mela 2025

Maha Kumbh Mela 2025

లారెన్ జాబ్స్‌కు ‘కమల’గా నామకరణం :
స్వామి కైలాసానంద తన గురువు గోత్రం పొందిన తర్వాత తనకు కొత్త పేరు పెట్టినట్లు చెప్పారు. లారెన్‌కు సనాతన్ ధర్మంపై లోతైన ఆసక్తి ఉందని, ఆమె ఆయన్ను తండ్రిలా భావిస్తుందని ఆయన అన్నారు. నేను కూడా ఆమెను నా కూతురిలాగే భావిస్తాను అని చెప్పారు. లారెన్ పావెల్‌కు అచ్యుత-గోత్రం అందించారు. లారెన్ పావెల్ కుంభ సందర్శన గురించి స్వామి కైలాశానంద మాట్లాడుతూ.. ఆమె తన గురువును కలవడానికి ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా లారెన్స్ జాబ్స్‌కు కమల అని పేరు పెట్టుకున్నాం. ఆమె మాకు కూతురు లాంటిది. ఆమె భారత్‌కు రావడం ఇది రెండోసారి. స్వామి కైలాసానందను పీష్వాయి ఆచారంలో చేర్చుకుంటామని, లారెన్ ధ్యానం చేసేందుకు భారత్‌కు వచ్చారని చెప్పారు.

ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటైన లారెన్ మహాకుంభ సమయంలో సన్యాసిలా జీవించనున్నారు. ఆమె షాహి స్నాన్ (జనవరి 14) మౌని అమావాస్య (జనవరి 29) సమయంలో రాజ స్నానం చేయనున్నారు.

కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేసిన లారెన్ శనివారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో తన గురువుతో కలిసి పూజలు చేస్తూ కనిపించింది. లారెన్ కాశీ విశ్వనాథ్ ఆలయ గర్భగుడి వెలుపల నుంచి ప్రార్థనలు చేశారు. మహా కుంభమేళా జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగుస్తుంది.

Read Also : Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ ఫోన్ మోడళ్లపై బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు పొందాలంటే?