Maruti Suzuki : న్యూ ఏజ్ బాలెనో కారు.. లుక్ అదిరిందిగా.. టెక్ ఫీచర్లు కిరాక్..!

భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా లిమిటెడ్ (MSI) ఫిబ్రవరి 23న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో కారును లాంచ్ చేసింది.

Maruti Suzuki : న్యూ ఏజ్ బాలెనో కారు.. లుక్ అదిరిందిగా.. టెక్ ఫీచర్లు కిరాక్..!

Maruti Suzuki Launches The New Age Baleno 2022 Here’s Price, Specifications And More Details

Updated On : February 23, 2022 / 7:56 PM IST

Maruti Suzuki New Age Baleno 2022 : భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా లిమిటెడ్ (MSI) ఫిబ్రవరి 23న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో కారును లాంచ్ చేసింది. ‘న్యూ ఏజ్ బాలెనో’ (New Age Baleno)గా పిలిచే ఈ కొత్త కారు చాలా టెక్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ సరికొత్త 2022 బాలెనోను రూ. 6.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. న్యూ ఏజ్ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ డిజిటల్ హెడ్ అప్ డిస్‌ప్లే (HUD), 22.86 cm (9-అంగుళాలు) స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ARKAMYS, 360 వ్యూ కెమెరాతో పాటు సరౌండ్ సెన్స్ వంటి అనేక టెక్నికల్ ఫీచర్లతో వస్తోంది. MSI మేనేజింగ్ డైరెక్టర్, CEO కెనిచి అయుకవా మాట్లాడుతూ.. బాలెనో గత ఆరు ఏళ్లుగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా దూసుకెళ్తోందని అన్నారు. భారత్‌లోనే మొదటి ఐదు కార్లలో ఇది ఒకటిగా పేర్కొన్నారు. బాలెనో హ్యాచ్‌బ్యాక్ మొదటిసారి అక్టోబర్ 2015లో లాంచ్ అయింది. MSI ఆరేళ్లలో ఒక మిలియన్ బాలెనో కార్లను విక్రయించింది.

MSI చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సివి రామన్ మాట్లాడుతూ.. కొత్త బాలెనోలో 1.2 లీటర్ ఇంజన్‌తో పాటు ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ ఉందని తెలిపారు. హైడ్రోలిక్ క్లచ్ సిస్టమ్‌తో వచ్చిందన్నారు. డ్యుయల్ ఫాస్ట్ ఛార్జింగ్ USB పోర్ట్‌లతో వస్తుంది. న్యూ ఏజ్ బాలెనో మాన్యువల్ ఆటోమేటిక్ ట్రిమ్‌లలో వస్తోంది. మారుతి సుజుకి సబ్ స్క్రిప్షన్ కింద ఈ కొత్త కారును అద్దెకు అందిస్తోంది. కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో సహా నెలవారీ రుసుము రూ. 13,999తో మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త బాలెనో కారు ధర సుమారు రూ.6.35 లక్షల నుంచి రూ.9.49 లక్షల(ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉండనుంది. ఈ కొత్త కారు బుకింగ్స్ ఫిబ్రవరి 7, 2022 నుంచి మొదలయ్యాయి. మారుతీ సుజుకీ 2022 బాలెనో లాంచ్ ముందే 25వేల బుకింగ్స్ పూర్తి అయ్యాయి. ఈ కొత్త బాలెనో హ్యుందాయ్ I20, టాటా ఆల్ట్రోజ్, VW పోలో, హోండా జాజ్ వంటి వాటితో పోటీ పడనుంది. మారుతి సుజుకి 2022లో 7 కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ప్రారంభించాలని యోచిస్తోంది.

Maruti Suzuki Launches The New Age Baleno 2022 Here’s Price, Specifications And More Details (1)

Maruti Suzuki Launches The New Age Baleno 2022 Here’s Price, Specifications And More Details

New Age Baleno 2022 ఫీచర్లు ఇవే :
బాలెనో మోడల్లో ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసివ్ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది. అల్టిమేట్ అర్బన్ క్రూజింగ్ ఎక్స్​పీరియన్స్​ క్లాస్ లీడింగ్ సేఫ్టీ ఫీచర్​ కూడా ఉంది. మారుతీ సుజుకీ 2022 బాలెనో ఐదు కలర్ ఆప్షన్లలో వచ్చింది. ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ హిల్ కంట్రోల్, సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. 2022 బాలెనో కారు ఫ్రంట్ గ్రిల్ వెడల్పుగా ఇచ్చారు. సుజుకీ లోగో, DRL టెయిల్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ వాయిస్ అసిస్ట్, హెడ్ అప్ డిస్‌ప్లే 360 డిగ్రీ వ్యూ కెమెరా, ARKAMYS సరౌండ్ సెన్స్‌తో 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

అలెక్సా వాయిస్‌తో సుజుకీ కనెక్ట్ లాంటి ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 2022 మారుతి సుజుకి బాలెనోలో 1.2-లీటర్ డ్యూయల్ జెట్ K12N పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. 6,000 RPM వద్ద 90 HP పవర్, 4,400 RPM వద్ద 113 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2 గేర్ బాక్సులు, 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ అందించింది. మారుతి సుజుకి న్యూ ఏజ్ లీటర్‌కు 22.94 కి.మీ/లీ (ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్), 22.35 కి.మీ/లీ(మాన్యువల్) మైలేజ్ అందిస్తుంది.

Read Also : Flying Car: ఎగిరే కారు వచ్చేస్తోంది.. సర్టిఫికేట్‌ వచ్చేసింది.. గాల్లో ప్రయాణించొచ్చు