Royal Enfield : రాయల్ ఎన్​ఫీల్డ్ లవర్స్​కు షాకింగ్​ న్యూస్​.. పెరిగిన బైక్​ల ధరలు

వాహన తయారీ కంపెనీలు తన వాహన శ్రేణిలోని పలు మోడళ్ల ధరలను పెంచేస్తున్నాయి. రవాణా చార్జీలు, ముడిపదార్ధాల ధర పెరిగిపోవడంతో వాహన తయారీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచగా, ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్ మెటార్ సిరీస్‌లోని వివిధ మోడల్ బైకుల ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఇక పెరిగిన ధరలు జులై 1 నుంచే అమలవుతున్నాయని ఎన్‌ఫీల్డ్ సంస్థ పేర్కొంది.

Royal Enfield : రాయల్ ఎన్​ఫీల్డ్ లవర్స్​కు షాకింగ్​ న్యూస్​.. పెరిగిన బైక్​ల ధరలు

Royal Enfield

Updated On : July 12, 2021 / 10:03 PM IST

Royal Enfield : వాహన తయారీ కంపెనీలు తన వాహన శ్రేణిలోని పలు మోడళ్ల ధరలను పెంచేస్తున్నాయి. రవాణా చార్జీలు, ముడిపదార్ధాల ధర పెరిగిపోవడంతో వాహన తయారీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచగా, ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్ మెటార్ సిరీస్‌లోని వివిధ మోడల్ బైకుల ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఇక పెరిగిన ధరలు జులై 1 నుంచే అమలవుతున్నాయని ఎన్‌ఫీల్డ్ సంస్థ పేర్కొంది.

Royal Enfield Classic 350 Price(BS6), Mileage, Classic 350 Colours

ఇక ఏ మోడల్ ధర ఎంత పెరిగిందనే వివరాలను పరిశీలిస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటార్ 350పై రూ. 7,790 పెరిగింది. గతంలో ఈ బైక్ ధర రూ.1,84,319 ఉండగా, ధర పెరిగిన తర్వాత రూ.1,92,109 చేరింది. ఇక, స్టెల్లార్ అని పిలిచే మిడ్-వేరియంట్‌ బైక్ పై రూ .8,020 పెరిగింది. గతంలో దీని ధర రూ. 1,90,079 గా ఉండేది. అయితే, తాజా ధరల పెంపుతో రూ. 1,98,099 చేరింది.

Royal Enfield Meteor 350 motorcycle launched in India – Check out price,  specs and more | Automobiles News | Zee News

 

టాప్ ఆఫ్ ది లైన్ సూపర్​నోవా వేరియంట్ పై రూ .8,405 పెంచారు. గతంలో రూ. 1,99,679 ధర వద్ద లభించేది. ధర పెంపు తర్వాత రూ .2,08,084కు చేరింది. రాయల్​ ఎన్​ఫీల్డ్​ మీటియర్​​ 350 బైక్​ రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే మొదటిసారి.