Windows 11 Upgrade : విండోస్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ అలర్ట్.. మీ పీసీలో విండోస్ 7, 8.1 వాడుతున్నారా? వెంటనే విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోండి..!

Windows 11 Upgrade : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లకు అలర్ట్.. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వంటి ఇతర డివైజ్‌ల్లో విండోస్ పాత వెర్షన్లు వాడుతున్నారా? అంటే.. విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) అనే OS వెర్షన్లకు సెక్యూరిటీ అప్‌డేట్స్ నిలిచిపోయాయి.

Windows 11 Upgrade : విండోస్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ అలర్ట్.. మీ పీసీలో విండోస్ 7, 8.1 వాడుతున్నారా? వెంటనే విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోండి..!

Microsoft kills Windows 7 and 8.1_ how to upgrade your PC to Windows 11

Updated On : January 11, 2023 / 9:02 PM IST

Windows 11 Upgrade : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లకు అలర్ట్.. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వంటి ఇతర డివైజ్‌ల్లో విండోస్ పాత వెర్షన్లు వాడుతున్నారా? అంటే.. విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) అనే OS వెర్షన్లకు సెక్యూరిటీ అప్‌డేట్స్ నిలిచిపోయాయి. Windows 7 2009లో రిలీజ్ కాగా, భారీగా పాపులర్ అయింది. వినియోగదారులు అన్ని కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ వినియోగించుకున్నారు. మూడు ఏళ్ల తరువాత Windows 8 OS కూడా మార్కెట్లోకి వచ్చింది. 2013లో Windows 8.1 అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ, విండోస్ 8, 8.1 సరిగ్గా పెద్గగా వర్కౌట్ కాలేదు. చాలా మంది వినియోగదారులు విండోస్ 7 వినియోగించేందుకు ఎక్కువ మక్కువ చూపించారు.

ఇప్పటికీ చాలా కంప్యూటర్లలో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువగా వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఒక దశాబ్దం కాలం తర్వాత, Microsoft కంపెనీ Windows 7, 8.1 రెండింటికి సాఫ్ట్‌వేర్ సపోర్టు ఇవ్వడం ఆపివేసింది. కంపెనీ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు కనీసం 10 ఏళ్ల పాటు పొడిగించిన సపోర్టును అందించే విధానాన్ని కలిగి ఉంది. అందువల్ల, Windows 7కు సపోర్టు 2020లో ముగిసింది. ఆ తర్వాత Windows 8.1కి సపోర్టు 2022 చివరిలో ముగిసింది. ఈ ఏడాదిలో ఈ రెండు OS వెర్షన్లకు పూర్తిగా Updates నిలిచిపోయాయి. ఇప్పటికీ చాలా PCలు, ల్యాప్‌టాప్‌లను రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రన్ అవుతున్నాయి. అందుకే ఈ Outdated OS సాఫ్ట్ వేర్‌లతో సెక్యూరిటీపరంగా రిస్క్ ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే, వైరస్‌లు ఎక్కువగా అటాక్ అయ్యే రిస్క్ ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది.

Microsoft kills Windows 7 and 8.1_ how to upgrade your PC to Windows 11

Microsoft kills Windows 7 and 8.1_ how to upgrade your PC to Windows 11

Read Also :  Windows WhatsApp Users : విండోస్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త వెర్షన్.. డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Windows 7 లేదా 8.1 యూజర్లు ఏమి చేయాలంటే? :
మీలో ఇప్పటికీ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లలో దేనినైనా ఉపయోగిస్తున్న యూజర్లు భయపడాల్సిన అవసరం లేదు. మీ సిస్టమ్‌ని Windows 11కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. మీ PCని ఉపయోగించడం కొనసాగించవచ్చు. మీరు Windows 10కి కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు. కానీ, ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్టు 2025లో ముగుస్తుంది. ప్రత్యామ్నాయంగా, మీరు కొత్త PC లేదా ల్యాప్‌టాప్‌తో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.

Windows 11కి ఎలా అప్‌గ్రేడ్ చేయాలంటే? :
విండోస్ (Windows 11) నిర్దిష్ట రిక్వైర్‌మెంట్స్ ఉన్న డివైజ్‌లలో మాత్రమే ఈ OS రన్ అవుతుంది. మీ డివైజ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రన్ చేయగలదో లేదో తెలుసుకోవడానికి మీరు ఈ Software Requirements చెక్ చేయడానికి Microsoft Support Page చూడవచ్చు. Windows 11తో మీ సిస్టమ్ కంప్యాటబులిటీని చెక్ చేయడానికి మీరు Microsoft వెబ్‌సైట్‌కి కూడా విజిట్ చేయవచ్చు. మీ సిస్టమ్ సపోర్టు చేస్తే.. Windows 11కి అప్‌గ్రేడ్ చేసేందుకు అనుసరించాల్సిన దశలు ఇలా ఉన్నాయి.

* Start Menu నుంచి Settings ఆప్షన్‌కు వెళ్లండి.
* Update & Security optionను గుర్తించి దానిపై Click చేయండి.
* Select check for updates, Windows 11 Upgrade ఆప్షన్ స్క్రీన్ కోసం వేచి ఉండండి.
* ‘Download and install’పై క్లిక్ చేసి, విండోస్ ఇన్‌స్టాల్ ఆప్షన్ కనిపించే వరకు వేచి ఉండండి.

Microsoft kills Windows 7 and 8.1_ how to upgrade your PC to Windows 11

Microsoft kills Windows 7 and 8.1_ how to upgrade your PC to Windows 11

Upgrade చేసే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలివే :

* మీరు మీ సిస్టమ్‌ని Windows 11కి అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
* మీ ఫైల్‌లను సేఫ్‌గా ఉంచడానికి ఏదైనా ఒక డ్రైవ్‌ని ఉపయోగించి ఆయా ఫైల్స్ మొత్తం బ్యాకప్ చేయండి.
* మీ PC లేదా ల్యాప్‌టాప్ కనీస హార్డ్‌వేర్ రిక్వైర్‌మెంట్స్ అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి.
* USB లేదా బూటబుల్ CD/DVD ద్వారా మీ PCలో Windows రికవరీ డ్రైవ్‌ని క్రియేట్ చేయాలని గుర్తుంచుకోండి.
* సేఫ్‌గా ఉండటానికి ఎక్స్‌ట్రనల్ స్టోరేజీ డివైజ్‌లో మీ డేటాను బ్యాకప్ చేయండి.
* Windows 11ని సక్సెస్‌ఫుల్‌గా Activate చేయడానికి మీ Microsoft Account ID, పాస్‌వర్డ్‌తో పాటు మీ Windows ప్రొడక్టు Keyతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 13, వన్‌ప్లస్ 10T ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బెనిఫిట్స్.. సేల్ ఎప్పటినుంచుంటే?