200MP camera phone: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 200 మెగాపిక్సల్ కెమెరాతో మోటో ఎక్స్30 ప్రొ
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 200 మెగాపిక్సల్ కెమెరాతో మోటో ఎక్స్30 ప్రొ వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదట ఆగస్టు 2న చైనాలో విడుదల చేయనున్నారు. 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుందని మోటోరోలా సంస్థ కూడా నిర్ధారించింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో, అంతేగాక, 125W GaN ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ మొబైల్ రానుంది.

Moto Pro
200MP camera phone: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 200 మెగాపిక్సల్ కెమెరాతో మోటో ఎక్స్30 ప్రొ వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదట ఆగస్టు 2న చైనాలో విడుదల చేయనున్నారు. 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుందని మోటోరోలా సంస్థ కూడా నిర్ధారించింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో, అంతేగాక, 125W GaN ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ మొబైల్ రానుంది.
మోటో ఎక్స్30 ప్రొలో 35ఎంఎం, 50ఎంఎం, 85ఎంఎం ఫోకల్ లెంగ్త్ సెన్సర్లు ఉంటాయని వివరించింది. 85ఎంఎం లెన్స్ వల్ల క్లోజ్-అప్ పోర్ట్రెయిట్ షాట్లు అద్భుతంగా వస్తాయని, 50ఎంఎం లెన్స్ ద్వారా అత్యుత్తమ ప్రామాణిక కోణంలో షాట్లు తీసుకోవచ్చని తెలిపింది. 35 ఎంఎం లెన్స్‌తో క్లోజస్ట్ వ్యూయింగ్ యాంగిల్లో షాట్లు తీసుకోవచ్చిన ఆ సంస్థ పేర్కొంది.
మోటో ఎక్స్30 ప్రొ 6.67-inch OLED డిస్ప్లేతో పాటు HD+ స్పష్టతతో 144Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. సెల్ఫీ కెమెరా 60 మెగాపిక్సల్ ఉంటుంది. మోటో ఎక్స్30 ప్రొ 8జీబీ రామ్,128 అంతర్గత స్టోరేజీ మోడల్ ధర రూ.59,990గా ఉండొచ్చని అంచనా.