Motorola Edge 50 Pro : ఏప్రిల్ 3న మోటోరోలా ఎడ్జ్ 50ప్రో వచ్చేస్తోంది.. భారత్‌లో ఈ కొత్త 5జీ ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Motorola Edge 50 Pro : ఏప్రిల్ 1న భారత మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో లాంచ్ కానుంది. రాబోయే 5జీ ఫోన్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ ధర రూ. 35వేల లోపు ఉండవచ్చు. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Motorola Edge 50 Pro : ఏప్రిల్ 3న మోటోరోలా ఎడ్జ్ 50ప్రో వచ్చేస్తోంది.. భారత్‌లో ఈ కొత్త 5జీ ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Motorola Edge 50 Pro India launch on April 3

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఏప్రిల్ 1న భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. రాబోయే 5జీ ఫోన్ చాలా స్పెసిఫికేషన్‌లను కూడా కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ కూడా మోటో ఎడ్జ్ 50ప్రో అన్ని ముఖ్యమైన ఫీచర్లను రివీల్ చేసింది. అదే మోటోరోలా డివైజ్ జాబితాను ప్రచురించింది. ఈ డివైజ్ ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కాకుండా ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనుంది.

ఏప్రిల్ 3న మోటో ఎడ్జ్ 50ప్రో లాంచ్, ధర అంచనా :
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ధర రూ. 35వేల లోపు ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 40ని రూ. 26,999కి లాంచ్ చేసింది. మోటో ఎడ్జ్ 40 నియో ఆన్‌లైన్‌లో రూ.22,999కి విక్రయిస్తోంది. ప్రాథమికంగా బ్రాండ్ ఇప్పటికే రూ. 25వేలు, రూ. 30వేల విభాగాలలో ఫోన్‌లను కలిగి ఉంది. ఈ మోటరోలా ఇప్పుడు రూ. 35వేల సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది.

Read Also : iPhone 15 Pro : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ప్రస్తుతానికి, మోటోరోలా ఎడ్జ్ 50 భారత్ ధర లీక్ కాలేదు. కానీ, మోటోరోలా మిడ్-రేంజ్ ఫోన్‌ సరసమైన ధరలో మంచి ఫీచర్లను అందించనుంది. రాబోయే మోటో ఫోన్‌లో కూడా అదే ఫీచర్లు, ధరతో వస్తుందని భావిస్తున్నారు. లాంచ్ ఈవెంట్ కూడా దగ్గరలోనే ఉంది. ఈ డివైజ్ భారత్ కచ్చితమైన ధర వివరాల తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఫోన్ 1.5కె రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 డివైజ్‌కు ఇదే చిప్‌సెట్ పవర్ అందిస్తుంది.

మోటో ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌పై రన్ అవుతుంది. మిడ్-రేంజ్ 5జీ ఫోన్ 3 ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్ అందిస్తుంది. బ్యాక్ సైడ్ లెదర్ ఎండ్, ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. సెటప్‌లో 50ఎంపీ ప్రధాన సెన్సార్, 13ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, మరో సెన్సార్ ఉన్నాయి.

మోటోరోలా కూడా ఐపీ68 రేటింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టు ప్రకారం.. ఫ్రంట్ సైడ్ 50ఎంపీ సెన్సార్ ఉంది. హుడ్ కింద 125డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. అయితే, కంపెనీ బాక్స్‌లో 68డబ్ల్యూ అడాప్టర్‌ను మాత్రమే అందిస్తుంది. 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందిస్తుంది.

Read Also : Apple iPhone 14 Plus : రూ.50వేల లోపు ధరకే ఐఫోన్ 14 ప్లస్ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ పొందాలంటే?