రూ.23 వేలలోపే ఈ 2 స్మార్ట్‌ఫోన్లు.. ఏది కొంటే బెటర్? వారెవ్వా.. ఫీచర్లు ఏంటి భయ్యా ఇంత బాగున్నాయ్‌..

బడ్జెట్ ధరకు ఎక్కువ కెమెరా ఆప్షన్లు, ఎక్కువ స్టోరేజ్ అవసరమైతే ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కోండి.

రూ.23 వేలలోపే ఈ 2 స్మార్ట్‌ఫోన్లు.. ఏది కొంటే బెటర్? వారెవ్వా.. ఫీచర్లు ఏంటి భయ్యా ఇంత బాగున్నాయ్‌..

motorola

Updated On : June 18, 2025 / 3:25 PM IST

మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో అందుబాటులో ఉన్నాయి. మంచి ఫీచర్లలో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. మీరు ఈ రెండింట్లో ఏదో ఒక స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని అనుకుంటుంటే వాటి మధ్య తేడాలను పరిశీలించండి. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో ఏది మీకు సరిపోతుందో దీని ద్వారా గుర్తించవచ్చు.

ప్రాసెసర్
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ MediaTek Dimensity 7400 చిప్‌సెట్‌తో, 2.5GHz ఆక్టా-కోర్ కంఫిగరేషన్‌పై నడుస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బాగుంటుంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో Dimensity 7300 Pro ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. క్లాక్ స్పీడ్ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ సమానం (2.5GHz). అయితే, Edge 60 Fusion బ్లూటూత్ 5.4 వర్షన్ ద్వారా మెరుగైన కనెక్టివిటీతో పాటు మంచి ఆప్టిమైజేషన్‌ను చూపుతోంది. రెండు ఫోన్లలోనూ RAM (8GB)తో పాటు అదనంగా 8GB వర్చువల్ మెమరీ సమానంగా ఉంది.

Also Read: భారత్‌కు ఒప్పో రెనో సిరీస్ నెక్స్ట్‌ జనరేషన్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌.. కేక పెట్టించే ఫీచర్లు..

డిస్‌ప్లే, బ్యాటరీ
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 6.7 అంగుళాల pOLED స్క్రీన్, HDR మోడ్‌లో గరిష్ఠంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. Pantone కలర్ ట్యూనింగ్‌ ఉంటుంది. Gorilla Glass 7i స్క్రీన్ ఉంది. 5500mAh బ్యాటరీ, 68W TurboPower చార్జింగ్ సపోర్ట్ ఉంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Panda Glassతో అందుబాటులో ఉంది. పిక్సెల్ డెన్సిటీ తక్కువగా (388ppi) ఉండటంతో స్క్రీన్ స్పష్టతలో కొద్దిపాటి లోపం ఉంటుంది. 5000mAh బ్యాటరీతో వచ్చింది. 33W చార్జింగ్ సపోర్ట్, 5W రివర్స్ చార్జింగ్ తో అందుబాటులో ఉంది.

కెమెరా
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లో..
50MP మెయిన్ కెమెరా (OIS), 13MP అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్.
Sony LYT700 సెన్సార్ ఉంది.
4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉంటుంది.
32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకు బాగా పనికి వస్తుంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో..
50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెటప్ వెనుక భాగంలో ఉంటుంది.
వైడ్‌అంగిల్, జూమ్ ఫొటోగ్రఫీ కోసం ఇది మంచి ఆప్షన్.
అయితే 16MP ఫ్రంట్ కెమెరా మోటోరోలా ఫోన్‌తో పోలిస్తే తక్కువగా ఉంటుంది.

ధర వివరాలు
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌: ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్‌తో రూ.22,538
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో: రూ.18,493

ఏది కొనాలి?
డిస్‌ప్లే బ్రైట్‌నెస్, కెమెరా పనితీరు, బ్యాటరీ సామర్థ్యంలో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ ఫీచర్లు బాగున్నాయి. ఫొటోలు, వీడియోలు, బ్రైట్ డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్ బాగుండాలనుకుంటే మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ కొనండి.

తక్కువ ధరలో ఎక్కువ కెమెరాలు, స్టోరేజ్ (2TB వరకు)కు సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో బాగుంటుంది. బడ్జెట్ ధరకు ఎక్కువ కెమెరా ఆప్షన్లు, ఎక్కువ స్టోరేజ్ అవసరమైతే ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కోండి.