NASA Astronauts Food Menu : నాసా వ్యోమగాముల స్పెషల్ ఫుడ్ మెనూ ఇదే.. అంతరిక్షంలో ఏం తింటారు? ఫుడ్ రుచి ఎలా ఉంటుంది?
NASA Moon Mission Food Menu: నాసా చంద్ర యాత్రలో భాగంగా 4 వ్యోమగాములు 10 రోజుల ప్రయాణంలో తమ ఇంటి రుచిని ఆస్వాదించనున్నారు. ఈ యాత్ర కోసం నాసా రూపొందించిన మెనూ ఇంటి ఫుడ్ మాదిరిగానే రుచికరంగా ఉంటుంది. ఈసారి నాసా వ్యోమగాముల కోసం ఎలాంటి ఫుడ్ మెనూను రెడీ చేసిందో ఇప్పుడు చూద్దాం..
NASA Astronauts Food Menu ( Image Credit : Gemini AI )
NASA Moon Mission Food Menu : అంతరిక్ష ప్రియులకు అద్భుతమైన న్యూస్.. నాసా అంతరిక్ష ఆర్టెమిస్ చంద్రుని యాత్రకు సిద్ధమవుతోంది. ఈసారి నాసా మొట్టమొదటి మానవసహిత చంద్రయాత్ర ఆర్టెమిస్ II మిషన్ మొదలుపెట్టనుంది.
ఈ యాత్రలో ఓరియన్ అంతరిక్ష నౌక, SLS రాకెట్‌ను ఉపయోగించి 10 రోజుల పాటు జరిగే పరీక్షలో నాసా నలుగురు వ్యోమగాముల (రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్)ను చంద్రునిపైకి పంపనుంది.
సాధారణంగా చంద్రుని యాత్ర అనగానే రాకెట్లు, అంతరిక్షం ఫొటోలే గుర్తుకువస్తాయి. కానీ, ఒక ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణంలో వ్యోమగాములు అసలు ఏం తింటారు? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెల్లడైంది.
ఆర్టెమిస్ IIలో చేరబోతున్న ఈ అంతరిక్ష యాత్రికులకు ఎలాంటి ఆహారం అందుబాటులో ఉంటుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే, నాసా ఇప్పటికే 109 రకాల వంటకాలతో పూర్తి మెనూను వెల్లడించింది. వ్యోమగాములతో పాటు వెళ్లే కాఫీ సైజుతో సహా పూర్తి వివరాలను షేర్ చేసింది. అంతరిక్షంలోని మొత్తం ఆహార ఏర్పాట్లను ఇంటిలో మాదిరిగానే ఉండనున్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
అంతరిక్షంలో ఫుడ్ రుచి ఎలా తెలుస్తుంది? :
అంతరిక్షంలో ఆహారం కేవలం చప్పగా, రుచిలేకుండా ఉండే రోజులు పోయాయి. ఈసారి మెనూలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. వ్యోమగాములు అంతరిక్షంలో కాఫీ తాగగలరు. రకరకాల పానీయాలను ఆస్వాదించగలరు. ఇంకా తీపి పదార్థాలను కూడా తినగలరు. ఈ మెనూలో రుచికరమైనవి. అవసరమైన పోషకాలను అందించే వంటకాలు ఉన్నాయి.
స్పైసీ ఫుడ్ ఎందుకు తింటారు? :
అంతరిక్షంలో ఆహారం రుచి కొద్దిగా తక్కువగా ఉంటుంది. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల శరీర ద్రవాలు తల వైపు కదులుతాయి. దాంతో ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. రుచి చూసే సామర్థ్యం తగ్గుతుంది.
కారంగా ఉండే ఆహారాలు ఈ సమస్యను తగ్గించి రుచిని పెంచుతాయి. వ్యోమగాములు సాధారణంగా కారంగా లేదా ఘాటుగా ఉండే ఆహారాలను ఇష్టపడతారు. ఈ కారణంగా ఆహారం రుచిని పెంచుతుంది. వారి మెనూలలో రకరకాల సాస్‌లు, మసాలాలు ఉంటాయి.
మెనూలో ప్రత్యేకత ఏంటి? :
శాస్త్రవేత్తలు వ్యోమగాములకు సొంత ఇంటి వాతావరణాన్ని కల్పిస్తారు. ఇందుకోసం వారికి ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలను జాబితాలో చేర్చారు. అంతే కాదు, వ్యోమగాములకు మిఠాయిలు, యాడ్-ఆన్లు మరిన్ని వస్తువులు కూడా లభిస్తాయి. ఫుడ్ విషయానికి వస్తే.. వ్యోమగాములు ప్రాథమిక ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలతో పాటు ఇంకా పెద్ద లిస్టును తమ వెంట తీసుకెళ్తారు.
ఆర్టెమిస్ II సిబ్బంది మెనూ ఇదే :
పానీయాల విషయానికి వస్తే.. వ్యోమగాములకు 10 కన్నా ఎక్కువ రకాల పానీయాలు అందుబాటులో ఉంటాయి. అందులో ఇవి కూడా ఉన్నాయి.
- కాఫీ
- గ్రీన్ టీ
- మామిడి-పీచ్ స్మూతీ
- చాక్లెట్ బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్
- వెనిలా బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్
- నిమ్మరసం
- ఆపిల్ సైడర్
- పైనాపిల్ పానీయం
- కోకో
- స్ట్రాబెర్రీ బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్
- టోర్టిల్లాలు
- గోధుమ పిండితో చేసిన రొట్టె
- కూరగాయల క్విచే
- బ్రేక్‌ఫాస్ట్ సాసేజ్
- నట్స్‌తో కూస్ కూస్
- మామిడి సలాడ్
- బ్లూబెర్రీలతో గ్రానోలా
- బాదంపప్పులు
- జీడిపప్పు
- బార్బెక్యూ బీఫ్ బ్రిస్కెట్
- బ్రోకలీ ఆ గ్రాటిన్
- స్పైసీ గ్రీన్ బీన్స్
- మాకరోనీ అండ్ చీజ్
- ట్రోపికల్ ఫ్రూట్ సలాడ్
- బటర్నట్ స్క్వాష్
- కాలీఫ్లవర్
- మేపుల్ సిరప్
- చాక్లెట్ స్ప్రెడ్
- వేరుశెనగ వెన్న
- హాట్ సాస్
- స్పైసీ మస్టర్డ్
- స్ట్రాబెర్రీ జామ్
- తేనె
- దాల్చినచెక్క
- బాదం వెన్న
- చాక్లెట్
- కుకీలు
- కేక్
- చక్కెర పూత పూసిన బాదం పప్పులు
- కాబ్లర్
- పుడ్డింగ్
ఫ్రీజ్ లేకుండా ఆహారం ఫ్రెష్ ఎలా? :
ఆర్టెమిస్ 2 ఓరియన్ క్యాప్సూల్‌లో రిఫ్రిజిరేటర్ లేదు. అందుకే నాసా ఒక స్పెషల్ నేచురల్ సైంటిఫిక్ ఇంజనీరింగ్ వాడింది. ఆహారంలో ఎక్కువ భాగం డీహైడ్రేట్ అయి ఉంటుంది. వ్యోమగాములు ఒక స్పెషల్ డిస్పెన్సర్‌ను వాడి వేడి వాటర్ కలుపుతారు.
ఆ తర్వాత అది తినేందుకు రెడీగా ఉంటుంది. ఆహారాన్ని వేడి చేసేందుకు వారి వద్ద ఒక చిన్న బ్రీఫ్‌కేస్ లాంటి “ఫుడ్ వార్మర్” ఉంటుంది. అంతరిక్షంలో రొట్టెకు బదులుగా టోర్టిల్లాస్ను వాడుతారు. ఎందుకంటే రొట్టె ముక్కలు గాలిలో తేలియాడి యంత్రాలను పాడు చేస్తాయి. కానీ, టోర్టిల్లాస్ అలా చేయవు అనమాట.
ఇంత ఆర్భాటం ఎందుకంటే? :
ఒక్క మాటలో చెప్పాలంటే.. అంతరిక్షంలో 10 రోజుల పాటు ఒక సీల్డ్ క్యాప్సూల్‌లో ఉండటం మానసికంగా ధృడంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో వ్యోమగాములు మంచి మానసిక స్థితి, ఆరోగ్యం ఉండేందుకు ఇష్టమైన ఆహారం తీసుకుంటారు.
అపోలో మిషన్ల సమయంలో వ్యోమగాములు కేవలం పొడి పదార్థాలు, ట్యూబ్లలో లభించే పేస్ట్లపై మాత్రమే ఆధారపడ్డారు. కానీ, నేటి అంతరిక్ష ఆహారం ఒక రెస్టారెంట్ మెనూకు ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి.
