WhoFi Biometrics : AI ఆధారిత WhoFi టెక్నాలజీ.. కెమెరాలు, ఫోన్లు లేకుండానే Wi-Fi సిగ్నల్స్.. గోడల వెనుక ఏమి చేస్తున్నారో ట్రాక్ చేయగలదు..!
WhoFi Biometrics : ఏఐ టెక్నాలజీతో WhoFi సర్వీసు వచ్చేసింది. గోడల వెనుక దాగినా మనుషులను కూడా ఇట్టే పసిగట్టేయగలదు. మూవెంట్స్ ట్రాక్ చేయగలదు.
WhoFi Biometrics
WhoFi Biometrics : కొత్త ఏఐ Wi-Fi టెక్నాలజీ వచ్చేసింది. Wi-Fi సాయంతో మీరు గోడల లోపల గదిలో ఏమి చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు కూర్చున్నారా? నిలబడి ఉన్నారా లేదా నడుస్తున్నారా? ఇలా ఏదైనా మీ ప్రతి మూవెంట్ ఈజీగా ట్రాక్ చేయొచ్చు.
ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సీన్ మాదిరిగా అనిపించవచ్చు. కానీ, ఇదంతా రియల్‌గా సాధ్యమే. సాధారణ 2.4 GHz రౌటర్ Wi-Fi ద్వారా విడుదలయ్యే సిగ్నల్స్ గదిలో ఉన్న వ్యక్తిని సులభంగా గుర్తించగలవని రోమ్‌లోని లా సపియెంజా యూనివర్శిటీ రీసెర్చర్లు పేర్కొన్నారు.
ఇందుకోసం WhoFi అనే కొత్త ఏఐ టెక్నాలజీ సిస్టమ్ డెవలప్ చేశారు. Wi-Fi సిగ్నల్‌లను ఉపయోగించి వ్యక్తుల కదలికల ఆధారంగా ట్రాక్ చేయగలదు. ఆసక్తికరంగా వ్యక్తుల పరిమాణం, ఆకారం, కదలికల వల్ల కలిగే వైర్లెస్ సిగ్నల్‌లలో మార్పులను గుర్తిస్తుంది.
ఈ టెక్నాలజీ ప్రస్తుతం రీసెర్చ్ ల్యాబ్‌లలో మాత్రమే ఉంది. కమర్షియల్ పరంగా అందుబాటులో లేదు. ఈ టెక్నాలజీ విస్తరణపై ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. ఇది ఎలా పనిచేస్తుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కెమెరా, మైక్రోఫోన్లతో పనిలేదు :
ఈ టెక్నాలజీకి WhoFi అని పేరు పెట్టారు. ఇది ఎలాంటి కెమెరా, మైక్రోఫోన్ లేదా ఏ డివైజ్ లేకుండా పనిచేస్తుంది. ఇది గదిలో ఉన్న వ్యక్తి సైజు లేదా మూవెంట్ ఆధారంగా వైర్లెస్ సిగ్నల్‌లో మార్పులను సులభంగా గుర్తించగలదు.
ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? :
Wi-Fi సిగ్నల్స్ గది చుట్టూ బౌన్స్ అవుతాయి. ఈ సిగ్నల్స్‌లో కొన్ని వస్తువులు, మానవులను కూడా ట్రాక్ చేయగలవు. ప్రతి ఒక్కరి శరీరం ఈ సిగ్నల్‌లకు భిన్నంగా స్పందిస్తుంది. సిగ్నల్ ట్రాకింగ్‌తో పాటు డైరెక్షన్ ఎంతవరకు అనే కొత్త మార్పులను WhoFi టెక్నాలజీ సిస్టమ్ న్యూరల్ నెట్‌వర్క్‌లను వాడుతోంది. ప్రతి వ్యక్తి ప్రత్యేక సిగ్నల్ నమూనాను గుర్తించగలదు.
రీసెర్చర్ల ప్రకారం.. ఈ డేటాసెట్‌ను NTU-Fi అనే పేరుతో పిలుస్తారు. అంటే Wi-Fi సెన్సింగ్ టెక్నాలజీ స్టాండర్డ్ టెస్టింగ్‌లో ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి ఒక గది నుంచి మరొక గదికి మారినప్పుడు లేదా మరొక ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా గదిలోని వ్యక్తిని గుర్తించేందుకు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీకి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక వ్యక్తిని తిరిగి గుర్తించడంలో ఈ టెక్నాలజీ కచ్చితత్వం 95.5 శాతానికి చేరుకుంది.
కెమెరాలు లేదా మైక్రోఫోన్ల మాదిరిగా కాకుండా ఈ Wi-Fi ఆధారిత టెక్నాలజీ ఫొటోలు లేదా సౌండ్ ట్రాక్ చేయలేదు. ఒక విధంగా, ఇది ఒక వ్యక్తి ప్రైవేట్ కదలికలను రహస్యంగా ట్రాక్ చేయగలదు. కానీ, ఇది ప్రైవసీకి అంతే ప్రమాదకరం. దీని సాయంతో ఎవరినైనా ఈజీగా ట్రాక్ చేయొచ్చు.
WhoFi టెక్నాలజీ ఏ వ్యక్తి బయోమెట్రిక్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని నేరుగా సేకరించదని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే, దీని సాయంతో ఇల్లు, ఆఫీసులు లేదా బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ ఉన్నారో గుర్తించవచ్చునని పేర్కొన్నారు.
ఈ టెక్నాలజీ ఎప్పుడు, ఎలా వాడొచ్చంటే? :
ప్రస్తుతం ఈ టెక్నాలజీ రీసెర్చ్ ల్యాబరేటరికే మాత్రమే పరిమితం. కానీ, Wi-Fi నెట్వర్క్ ఇప్పుడు ప్రతి ఇంటికి చేరుకుంది. ఈ టెక్నాలజీని సేఫ్టీ, హెల్త్ మానిటరింగ్, మూవెంట్ లేదా బిహేవియర్ ట్రాకింగ్ సమయంలో వాడొచ్చు.
సైనిక కార్యకలాపాల సమయంలో దాగిన శత్రువులను కనుగొనేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. WhoFi ఇప్పటికీ టెస్టింగ్ స్టేజీలోనే ఉంది. భవిష్యత్తులో ఈ వై-ఫై టెక్నాలజీని మరిన్ని ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు.
