Hyderabad Traffic Alert : హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
KBR Park Traffic Restrictions
- హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్
- కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు
Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. H-CITI ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
NFCL జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్, రోడ్ నెం.36, రోడ్ నెం.45 వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. NTR భవన్ – బసవతారకం ఆస్పత్రి – విద్యాభవన్ మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేశారు. ITC కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెం.60, రోడ్ నెం.67 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు చేరుకోవాలని సూచించారు.
ట్రయల్ రన్ సమయంలో ఎక్కడా యూ-టర్న్‌లకు అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు ఎడమ లేన్‌లోనే ప్రయాణించాలని, రియల్‌టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ కోసం నావిగేషన్ యాప్‌లను వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు కార్ పూలింగ్, ప్రజా రవాణా సేవలను ఉపయోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకుని సహకరించాలని కోరారు.
