కరోనాను అరికట్టే ఫ్యాన్….ఆవిష్కరించిన మంత్రి ఈటల

  • Published By: nagamani ,Published On : October 2, 2020 / 11:11 AM IST
కరోనాను అరికట్టే ఫ్యాన్….ఆవిష్కరించిన మంత్రి ఈటల

Updated On : October 2, 2020 / 11:31 AM IST

new device to combat covid-19 : కరోనా. ఈ మాట వింటేనే జనాలు హడలిపోతున్నారు. గబుక్కుని ముక్కూ నోరు మూసేసుకుంటున్నారు. దూరంగా జరిగిపోతున్నారు. మనుషులకు మనుషులకు మధ్య దూరాన్ని పెంచేసింది కరోనా మహమ్మారి. దీన్ని అరికట్టేందుకు..ప్రస్తుత ప్రమాదకర పరస్థితుల్లో నియంత్రించేందు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.


ఈ క్రమంలో కరోనా వైరస్ రాకుండా అడ్డుకునే శైకోక్యాన్‌ (స్కాలీన్ హైపర్ చార్జ్ కరోనా కెనాన్)అనే అధునాతన యంత్రం మార్కెట్లోకి వచ్చింది. బెంగుళూరుకు చెందిన స్కాలెన్ సైబర్నెటికస్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ అధునాతన యంత్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో గురువారం (అక్టోబర్ 1,2020) పరిశీలించారు.




ఏసీ రూమ్స్..లివింగ్ రూమ్స్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ ఫ్యాన్ లాంటి పరికరం అడ్డుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. యాభై మంది నుంచి వంద మంది వరకు సమావేశమయ్యే రూముల్లోను లేద 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సంస్థ ప్రతినిథులు మంత్రికి వివరించారు. ఫ్యాన్ లాంటి ఈ యంత్రం ఖరీదు రూ.19,999లు ఉంటుందని అరవ్‌ అసోసియేట్స్‌ సంస్థ చైర్మన్ అండ్ సీఈవో డాక్టర్ రాజా విజయ్ కుమార్..అసోసియేట్ డాక్టర్ డాక్టర్ శివన్ తెలిపారు.



కరోనా వైరస్ చుట్టూ ఉండే స్పైక్ ప్రొటీన్ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా ఉంది. ఊపిరి తిత్తుల్లోకి ఈ వైరస్ చేరినప్పుడు వైరస్ చుట్టూ ఉన్న ప్రొటీన్ కీలకంగా మారి ఊపిరి తిత్తుల గోడలకు అంటుకుని పట్టుకుని వాటిని దెబ్దతీసి శ్వాసక్రియను దెబ్బతీస్తుంది. వైరస్ ను అంటిపెట్టుకున్న ఈ ప్రొటీన్ ను నిర్వీర్యం చేయటం ద్వారా వైరస్ పోతుంది.


ఈ షైకోకాన్ గాలి వైరస్ వ్యాప్తి చేయటం ద్వారా ఈ స్పైక్ ప్రొటీన్ ను నిర్వీర్యం చేస్తుందని డాక్టర్ శివన్ తెలిపారు.ఈ పరికరాన్ని కింగ్‌ కోఠి దవాఖానలో ప్రయోగాత్మకంగా అమర్చడానికి మంత్రి ఈటల అనుమతించినట్టు తెలిపారు.