Foldable iPhones : ఆపిల్ అభిమానులకు కిక్కించే న్యూస్.. ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈ కొత్త లీక్‌తో హింట్ ఇచ్చిందిగా..!

Foldable iPhones : అందిన లీక్ డేటా ప్రకారం.. వచ్చే 2026 సెప్టెంబర్ నెలలో ఫోల్డబుల్ ఐఫోన్లు లాంచ్ కానున్నాయి. ఐఫోన్ ఫోల్డ్ తర్వాత 2027లో ఫోల్డబుల్ మ్యాక్‌బుక్ రావచ్చు.

Foldable iPhones : ఆపిల్ అభిమానులకు కిక్కించే న్యూస్.. ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈ కొత్త లీక్‌తో హింట్ ఇచ్చిందిగా..!

New leak suggests Apple might launch a foldable iPhone

Updated On : February 8, 2025 / 5:02 PM IST

Foldable iPhones : ఆపిల్ ఐఫోన్ అభిమానులకు కిక్కించే న్యూస్.. ఆపిల్ త్వరలో ఫోల్డబుల్ ఫోన్లను ప్రవేశపెట్టబోతోంది. ఈ ఐఫోన్ బ్రాండ్ ఇప్పటికే, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను తయారు చేయడంలో దిట్ట. కానీ, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఫోల్డబుల్ రంగంలోకి కూడా ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. అయితే, కంపెనీ ప్రస్తుతం పలు ఫోల్డబుల్ ఫోన్లపై పనిచేస్తున్నట్లుగా సమాచారం. అది త్వరలో దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.

Read Also : CIBIL Score : ఇదెక్కడి రిజెక్షన్ రా మావా.. పెళ్లికొడుకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ప్రముఖ టిప్‌స్టర్ జుకున్‌లోస్రేవ్ ప్రకారం.. టెక్ దిగ్గజం వచ్చే ఏడాది 2026లో ఎప్పుడైనా ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఆవిష్కరించవచ్చు. ఆ తర్వాత 2027లో ఫోల్డబుల్ ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్ రావచ్చు. రాబోయే ఫోల్డబుల్ ఐఫోన్ గురించి వివరాలను ‘zwz’ అనే కంపెనీకి తెలుసనని తెలిపింది. ఈ కంపెనీ బాల్ బేరింగ్‌లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన చైనీస్ కంపెనీగా చెప్పవచ్చు.

ఆపిల్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 వంటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్‌పై దృష్టి సారించిందని, ఇది “లెఫ్ట్ రియర్ సైడ్ బిగ్ ఫోల్డబుల్ మేకానిజం” కలిగి ఉంటుందని, ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. ఈ ఐఫోన్ 4.6 మిమీ మందంగా ఉంటుందని, సగానికి మడిచినప్పుడు 9.2 పరిమాణం ఉంటుందని అంచనా.

ఈ ఫోన్ ఇంటర్నల్ స్క్రీన్ “రెండు 6.1-అంగుళాల ఫోన్‌లను కలిపే ఫోల్డబుల్ ఫోన్లుగా” ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొంది. అంటే.. ఈ ఫోన్ 12-అంగుళాల స్క్రీన్‌లో రావచ్చు. అయితే, టెక్ దిగ్గజం ప్రస్తుతానికి ఫ్లిప్ ఫోన్‌లలో పెద్దగా పురోగతి లేదని చెప్పాలి. ఈ లీక్ డిస్‌ప్లేను శాంసంగ్ అభివృద్ధి చేస్తుందని కూడా పేర్కొంది.

ఫ్రేమ్ విషయానికొస్తే.. ఆపిల్ టైటానియం సమ్మేళనం, స్టెయిన్‌లెస్ స్టీల్, కార్బన్ ఫైబర్ వంటి వివిధ మేటేరియల్స్ కోసం అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఫోల్డబుల్ ఫోన్ ఆపిల్ డిజైన్ సొల్యూషన్‌ను ఉపయోగిస్తుందని అంచనా. దీని ధర దాదాపు 110 డాలర్లు ఉంటుంది. అలాగే, స్పేర్ పార్టులను ఆంఫెనాల్, తైవాన్‌కు చెందిన జినిహెంగ్ కొనుగోలు చేస్తాయి.

Read Also : Lifetime Toll Pass : బైబై ఫాస్టాగ్.. ఇక లైఫ్ టైమ్ టోల్ పాస్.. మీరు కట్టాల్సిందల్లా జస్ట్..!

ఫోల్డబుల్ ఐఫోన్ ఫ్రంట్ సైడ్ “అల్ట్రా-థిన్ టెక్నాలజీ”తో కూడిన కెమెరా లెన్స్ ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. అయితే, బ్యాక్ ప్రైమరీ, అల్ట్రావైడ్ సెన్సార్ “హైబ్రిడ్ గ్లాస్-ప్లాస్టిక్ స్ట్రక్చర్”ను ఉపయోగించవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఆపిల్ 5,000mAh సామర్థ్యం కలిగిన రెండు స్టెయిన్‌లెస్ స్టీల్-కేస్డ్ బ్యాటరీలను కలిగి ఉండవచ్చు. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ, ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.