Phone Screen : మీ ఫోన్‌ స్క్రీన్‌ ఇక పగలదు.. సరికొత్త స్ర్కీన్ గ్లాసు వస్తోందిగా!

స్మార్ట్ ఫోన్ కిందపడి స్ర్కీన్ పగిలితే ఎవరికైనా బాధేస్తుంది. అది కామన్.. ఇకపై అలాంటి ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. సరికొత్త స్మార్ట్ ఫోన్ గ్లాసు ఒకటి వస్తోంది.

Phone Screen : మీ ఫోన్‌ స్క్రీన్‌ ఇక పగలదు.. సరికొత్త స్ర్కీన్ గ్లాసు వస్తోందిగా!

New Unbreakable Glass Was Inspired By The Inside Of Mollusk Shells

Updated On : October 1, 2021 / 2:10 PM IST

New unbreakable glass inside of mollusk shells  : స్మార్ట్ ఫోన్ అంటే క్రేజ్ అంతాఇంతా కాదు.. ఎన్నో వేలు పోసి స్మార్ట్ ఫోన్ కొనేస్తుంటారు. ఫీచర్లు చూసి ముచ్చటపడతారు. ఫోన్ స్ర్కీన్ పై కొంచెం గీటు పడిన ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి స్మార్ట్ ఫోన్ కిందపడి స్ర్కీన్ పగిలితే ఎవరికైనా బాధేస్తుంది. అది కామన్.. ఇకపై అలాంటి ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. సరికొత్త స్మార్ట్ ఫోన్ గ్లాసు ఒకటి వస్తోంది. అన్ని ఫోన్ స్ర్కీన్లకాదు.. చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. కిందపడినా పగలదు.
Siri Hanumanth : పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను అని చెప్పిన బిగ్ బాస్ కంటెస్టెంట్

కెనాడాకు చెందిన మెక్ గిల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్ స్ర్కీన్ డిజైన్ చేశారు. సాధారణ గాజు ఆక్రిలిక్‌ కలిపి ఈ సరికొత్త గాజును రూపొందించారట.. మామూలు గాజుతో పోలిస్తే.. ఈ స్మార్ట్ గ్లాసు ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదని పరిశోధకులు తేల్చేశారు. ఆల్ చిప్పల్లోని ముత్యాలు రూపొందే పదార్థంతో ఈ గాజు గ్లాసును తయారుచేశారట. ఈ సరికొత్త గ్లాసు ముత్యాల పదార్థంతోనే తయారుచేసినట్టు పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే.. ఈ ఆల్ చిప్పల్లో లోపల వైపు నెక్ర్ అనే పదార్థం ఉంటుంది.

ఇది పెళుసుగా ఉంటుంది. కాల్షియం కార్పొనేట్ పదార్థంతో నిండి ఉంటుంది. సాగే గుణముంటుంది. ఆర్గానిక్ పదార్థంతో కలిసి నెక్ర్ మాదిరిగా మారుతాయి. తద్వారా ఆల్ చిప్పలు, ముత్యాలు చాలా గట్టిగా ఉండటానికి కారణం ఇదేనని పరిశోధకులు వెల్లడించారు. పెళుసుగా ఉండే గాజుతో సాగే గుణం కలిగిన ఈ అక్రిలిన్ కలపడం ద్వారా ఈ స్మార్ట్ గ్లాసును తయారుచేసినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ సరికొత్త గ్లాసు తయారీ విధానం చాలా సులభంగా ఉంటుందని, ధర చాలా తక్కువగానే ఉంటుందని అంటున్నారు.

రానున్న రోజుల్లో ఈ స్మార్ట్ గ్లాసుతో స్మార్ట్ ఫోన్ల స్ర్కీన్లు, మానిటర్లు, టీవీలకు వినియోగించవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్మార్ట్ గ్లాసు అందుబాటులోకి వస్తే.. ఫోన్ కిందపడితే స్ర్కీన్ పగిలిపోతుందనే ఆందోళన చెందనక్కర్లేదు.
Smart Watch Saves Man Life : గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన స్మార్ట్‌వాచ్‌..చావుబతుకుల్లో ఉన్న అతని ప్రాణం కాపాడింది