వాట్సాప్‌లో కొత్త బగ్ : యూజర్ల ఫొటోలు డిలీట్ చేస్తోంది

మీ వాట్సాప్ ను అప్ డేట్ చేస్తున్నారా? వాట్సాప్ యూజర్లు జర జాగ్రత్త. మీకు తెలియకుండానే మీ వాట్సాప్ లోని అన్ని ఫొటోలు డిలీట్ అవుతున్నాయి.

  • Published By: sreehari ,Published On : March 12, 2019 / 08:17 AM IST
వాట్సాప్‌లో కొత్త బగ్ : యూజర్ల ఫొటోలు డిలీట్ చేస్తోంది

మీ వాట్సాప్ ను అప్ డేట్ చేస్తున్నారా? వాట్సాప్ యూజర్లు జర జాగ్రత్త. మీకు తెలియకుండానే మీ వాట్సాప్ లోని అన్ని ఫొటోలు డిలీట్ అవుతున్నాయి.

మీ వాట్సాప్ ను అప్ డేట్ చేస్తున్నారా? వాట్సాప్ యూజర్లు జర జాగ్రత్త. మీకు తెలియకుండానే మీ వాట్సాప్ లోని అన్ని ఫొటోలు డిలీట్ అవుతున్నాయి. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం కొత్త కొత్త అప్ డేట్స్ రిలీజ్ చేస్తుంటుంది. కొత్త అప్ డేట్  వచ్చిందని వెంటనే యూజర్లు తమ వాట్సాప్ ను అప్ డేట్ చేస్తుంటారు. అప్ డేట్ చేస్తే.. కొత్త ఫీచర్లు యాడ్ అవుతాయని అనుకుంటారు. నిజమే. కాస్త ఆగండి.. వాట్సాప్ కొత్త అప్ డేట్ వర్షన్ లో బగ్ ఉందట. అది.. యూజర్ల వాట్సాప్ ఫొటోలను ఆటోమాటిక్ గా డిలీట్ చేస్తుందట. వాట్సాప్ కొత్త అప్ డేట్ వర్షన్ 2.19.66. ఈ అప్ డేట్ ను యూజర్లు తమ వాట్సాప్ లో అప్ డేట్ చేసుకుంటే.. వెంటనే వారి అకౌంట్ లోని ఫొటోలు చాట్ సడన్ గా మాయమైపోతున్నాయి. 

ఆగండి.. Update డౌన్‌లోడ్‌ చేయ‌కండి 
ఇందుకు కొత్త అప్ డేట్ లోని బగ్ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్ బీటా వర్షన్ యూజర్లు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. యూజర్లంతా తమ సమస్యను ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు  చేశారు. అంతేకాదు.. వాట్సాప్ యూజర్లు ఎవరూ కొత్త అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. సంతోషించాల్సి విషయం ఏమిటంటే.. బగ్ కారణంగా వాట్సాప్ యాప్ నుంచి మాత్రమే ఫొటోలు చాట్ డిలీట్ అవుతున్నాయట. ఫోన్ గ్యాలరీ నుంచి కాదు. వాట్సాప్ లో పెట్టిన ఫొటోలు ఆటోమాటిక్ గా ఫోన్లో క్రియేట్ అయ్యే ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. 
Read Also : హిస్టరీలో మిస్టరీ : 5వేల ఏళ్ల నాటి అస్థిపంజరం.. ఎవరిదంటే?

ట్విట్టర్ లో తమ ఫిర్యాదుతో వాట్సాప్ లో బగ్ ను ఫిక్స్ చేశారని యూజర్లు భావిస్తున్నారు. కొంతమందికి మాత్రం ఇంకా బగ్ సమస్య అలానే ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ స్టేటస్ దగ్గర వైట్ స్పేస్ కనిపిస్తోందని చాలామంది యూజర్లు కంప్లయింట్ చేస్తున్నారు. బగ్ కారణంగానే స్టేటస్ దగ్గర వైట్ స్పేస్ తో గ్రే కలర్ లో కనిపిస్తోందని అంటున్నారు. స్టేటస్ గ్రే కలర్ లో కనిపించే సరికి యూజర్ల అంతా తమను ఎవరో బ్లాక్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు వాట్సాప్ సంస్థ ఇటీవల తమ ప్లాట్ ఫాంపై బెదిరింపులు, అసభ్యకరమైన మెసేజ్ లు పంప కూడదని హెచ్చరించింది. ఎవరైనా ఇలాంటి వల్గర్ మెసేజ్ లు పంపినట్టు మీ దృష్టికి వస్తే నేరుగా ccaddn-dot@nic.in ఫిర్యాదు చేయాలని, వెంటనే సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 
Read Also : పైలట్లకు DGCA స్ట్రిక్ రూల్స్: ఇకపై ‘బోయింగ్’ విమానం నడపాలంటే?