Nokia : జియో ఫోన్‌కు పోటీగా నోకియా 01… ఫీచర్స్ ఇవే!

మొబైల్ రంగంలో రాణిస్తున్న జియోకు ధీటుగా ఎదుర్కొనేందుకు నోకియా రెడీ అవుతోంది. జియో కంపెనీకి పోటీగా ఫోన్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Nokia : జియో ఫోన్‌కు పోటీగా నోకియా 01… ఫీచర్స్ ఇవే!

Nokiya

Nokia c01 Plus : నోకియా..కంపెనీ గుర్తు ఉంది కదా. ఈ కంపెనీ విడుదల చేసిన ఫోన్లు గతంలో మార్కెట్ లో ఓ వెలుగు వెలిగాయి. కానీ..కొన్ని కంపెనీలు అత్యాధునికి ఫీచర్లు..వివిధ రంగులతో ముందుకు రావడంతో నోకియాను ఆదరించడం తక్కవ పెట్టారు. దీంతో ఆ కంపెనీలకు ధీటుగా పోటీనివ్వలేకపోయింది. తాజాగా…మొబైల్ రంగంలో రాణిస్తున్న జియోకు ధీటుగా ఎదుర్కొనేందుకు నోకియా రెడీ అవుతోంది. జియో కంపెనీకి పోటీగా ఫోన్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అతి తక్కువ ధరలో ఇది ఉండనుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనే వీలుగా..దీనిని మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read More : JioBook Laptop : జియో నుంచి మరో అద్భుతం‌.. స్పెసిఫికేషన్లు ఇవే..!

 

Nokiya Phones

నోకియా సీ01 పేరిట 4జీ ఎంట్రీలెవల్ బడ్జెట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే..జియో…4జి స్మార్ట్ ఫోన్ ‘జియో నెక్ట్స్’ ను వినాయక చవితికి విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ.. చిప్స్ కొరత కారణంగా..దీపావళికి వాయిద పడింది. అదే సమయంలో…జియోకి పోటీగా నోకియా బడ్జెట్ ఫోన ను విడుదల చేయడంతో ఆసక్తికరంగా మారింది.

Read More : JioPhone Next.. ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ దీపావళికి లాంచ్!

నోకియా కూడా దివాళీని టార్గెట్ చేసింది. నోకియా సీ01లో ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) వెర్షన్ తో అందుబాటులోకి రానుంది. తక్కువ ర్యామ్, యూ ట్యూబ్, జీమెయిల్,    గూగుల్ వంటి లైట్ యాస్ప్ వినియోగించేందుకు ఉపయోగపడుతుంది. ఫోన్ 5.45 అంగుళాలు ఉంది. హెచ్ డీ స్క్రీన్, హై డైనమిక్ రేంజ్ లో LED ప్లాష్ వచ్చేలా రెండు 5 మెగా ఫిక్సెల్ కెమెరాలున్నాయి. ఆక్టాకోర్ 1.6ghz యునిసోక్ SC 9863A, ప్రాసెసర్, 2GB Ram, 16gb ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తోంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకోవచ్చు.

 

ఫుల్ ఛార్జింగ్ పెడితే 3000 mah సామర్థ్యం ఉన్న బ్యాటరీతో ఒకరోజు వినియోగించుకోవచ్చు. ఇక దీని కలర్స్, ధర విషయానికి వస్తే…రెండు కలర్స్ (బ్లూ, పర్పుల్ కలర్) వేరియంట్లలో లభ్యం కానుంది. నోకియా సీ01 ధర ఇండియాలో రూ. 5,999 ఉండగా…10శాతం డిస్కౌంట్ తో మై జియో యాప్ లో ఈ ఫోన్ ను కేవలం రూ. 5,399 సొంతం చేసుకొనే ఛాన్స్ ఉంది.