Nothing Ear Series Price : నథింగ్ ఇయర్ బడ్, ఇయర్ (ఎ) ధర, ఫొటోలు, డిజైన్‌ వివరాలు లీక్..!

Nothing Ear Series Price : ఏప్రిల్ 18 లాంచ్ ఈవెంట్‌కు ముందు, రాబోయే నథింగ్ ఇయర్ ఇయర్‌బడ్‌ల ఫొటోలు, ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అన్ని యాంగిల్స్ నుంచి నథింగ్ ఇయర్ సిరీస్ ఎలా ఉంటాయంటే?

Nothing Ear Series Price : నథింగ్ ఇయర్ బడ్, ఇయర్ (ఎ) ధర, ఫొటోలు, డిజైన్‌ వివరాలు లీక్..!

Nothing Ear and Ear a price and images leak, revealing design from all angles

Nothing Ear Series Price : కొత్త ఇయర్ బడ్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఇప్పటికే నథింగ్ కొన్ని వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. గత ఏడాది మార్చిలో లాంచ్ అయిన నథింగ్ ఇయర్ (2) ఇప్పటికీ అత్యుత్తమ ఇయర్‌బడ్‌లలో ఒకటి. ఇప్పుడు, బ్రాండ్ కొత్త ఇయర్‌ఫోన్‌ల సెట్‌ను ఏప్రిల్ 18న లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ లాంచ్ ఈవెంట్‌కు ముందు రాబోయే నథింగ్ ఇయర్‌బడ్‌ ఫొటోలు, ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అన్ని యాంగిల్స్ నుంచి నథింగ్ ఇయర్ బడ్స్ ఫీచర్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Automatic EPF Transfer : ఉద్యోగం మారుతున్నారా? పీఎఫ్ ఖాతాదారులు ఇకపై ఈపీఎఫ్ ఆటోమేటిక్ అకౌంట్ ట్రాన్స్‌‌ఫర్ చేయొచ్చు!

నథింగ్ ఇయర్ ఇయర్ (ఎ) డిజైన్‌ లీక్‌ :
టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ నథింగ్ ఇయర్ అండ్ ఇయర్ (ఎ) కొన్ని రెండర్‌లను లీక్ చేశారు. నథింగ్ ఇయర్ డిజైన్ నథింగ్ ఇయర్ (2) ఇయర్‌ఫోన్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. కాంపాక్ట్ స్టిక్ డిజైన్‌తో డిజైన్‌ను కలిగి ఉంది. నథింగ్ ఇయర్ (ఎ) లేటెస్ట్ డిజైన్‌ను పొందింది. మొదట ఆండ్రాయిడ్ పోలీస్ ద్వారా లీక్ అయింది. ఎల్లో కలర్ మోడల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గత జనరేషన్ మాదిరిగానే స్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

నథింగ్ ఇయర్ అండ్ ఇయర్ (ఎ) ఎందుకంటే? :
ఈ బ్రాండ్ నథింగ్ ఇయర్ 3 లాంచ్ చేయడం లేదు. దీని వెనుక కారణం తెలియదు. ఈసారి నథింగ్ ఇయర్ (ఎ), ఇయర్ అనే రెండు మోడళ్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ మరిన్ని ఆప్షన్లతో కస్టమర్లకు అందించాలని భావిస్తోంది. ఇయర్ (ఎ) సరసమైన వెర్షన్ కావచ్చు. నథింగ్ ఇయర్ ధర కొంచెం ఎక్కువ ఉండవచ్చు. అయితే, దీనిపై ఇంకా స్పష్టత లేదు. రానున్న రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది.

నథింగ్ ఇయర్ (ఎ) ధరలు లీక్ :
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ నివేదిక ప్రకారం.. నథింగ్ ఇయర్ ధర ఇయూఆర్ 150 (భారత కరెన్సీలో దాదాపు రూ. 13,500)గా ఉండవచ్చు. ఈ ప్రొడక్టు బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచవచ్చు. ఇయర్ (ఎ) ధర ఇయూఆర్ 100 (దాదాపు రూ. 9వేలు) ఉంటుంది. కానీ, భారత మార్కెట్లో ఇయర్‌ఫోన్‌ల ధర యూరోపియన్ మార్కెట్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుందని అంచనా. అధికారిక ధరలు కాదని గుర్తుంచుకోండి. ఏప్రిల్ 18న పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Read Also : Realme P1 5G Launch : రియల్‌మి P1 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 15నే ఎర్లీ బర్డ్ సేల్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?