ఇండియాలో వాట్సాప్‌లో UPI పేమెంట్లకు అనుమతి!

  • Published By: sreehari ,Published On : November 6, 2020 / 10:34 AM IST
ఇండియాలో వాట్సాప్‌లో UPI పేమెంట్లకు అనుమతి!

Updated On : November 6, 2020 / 11:19 AM IST

WhatsApp UPI Payments : రెండున్నర ఏళ్లుగా బీటా మోడ్‌కే పరిమితమైన పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ను ‘గ్రేడెడ్ పద్ధతిలో’ ప్రారంభించటానికి రెగ్యులేటరీ అనుమతి లభించింది. ప్రారంభంలో మిలియన్ల వినియోగదారులకు మాత్రమే అనుమతి ఉండేది.

ఫిబ్రవరి 2018 నుంచి 1 మిలియన్ యూజర్లకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటివరకూ ఇండియాలో Whatsapp Pay పైలట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతి ఉండేది. ఇప్పుడు యుపిఐని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మొత్తం చెల్లింపు వాల్యూమ్‌లపై 30శాతం పరిమితిని అమలు చేస్తామని వెల్లడించింది.



ఆ తర్వాతి రోజున రెగ్యులేటరీ నుంచి వాట్సాప్ పే సర్వీసులకు అనుమతి లభించింది. అతిపెద్ద డిజిటల్ పేమెంట్ దిగ్గజాలు UPI పేమెంట్ నెట్ వర్క్ ద్వారా తమ సర్వీసులను అందిస్తున్నాయి. గూగుల్ పే, పోన్ పే, పేటీఎంతోపాటు తాజాగా వాట్సాప్ పే కూడా యూపీఐలో చేరుతోంది.



వ్యక్తిగత బ్యాంకుల అప్లికేషన్లు మాత్రమే కాకుండా యూపీఐ పేమెంట్లపైనే ఎక్కువగా యూజర్లు ఆధారపడుతున్నారు. వాట్సాప్ పే యూపీఐ సర్వీసులకు అనుమతి లభించిన రోజునే NPCI కూడా 30 శాతం పరిమితితో మార్కెట్ షేర్‌ను ప్రవేశపెట్టింది. ఇతర థర్డ్ పార్టీ యాప్ ల యూపీఐ పేమెంట్లకు జనవరి 1, 2021 నుంచి వర్తిస్తుంది.

NPCI డేటా ప్రకారం.. భారతదేశంలో 400 మిలియన్ల నెలవారీ యాక్టివ్ వాట్సాప్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ యూపీఐ పేమెంట్లు చేసుకునేందుకు అనుమతి లభించింది. తొలి దశలో వాట్సాప్ యూజర్ల సంఖ్య 20 మిలియన్లకు విస్తరించనుంది. ప్రస్తుతం వాట్సాప్ పే సర్వీసులు బీటా దశలో ఉన్నాయి.



పైలెట్ ఆపరేషన్లలో భాగంగా 1 మిలియన్ మంది కస్టమర్లకు మాత్రమే అనుమతి ఉంది. వాట్పాప్ పే సర్వీసును ఇండియాలో లాంచ్ చేసినప్పుడు యూపీఐ పేమెంట్ సర్వీసు మరింత ఆలస్యమవుతోంది. స్థానికంగా డేటాను భద్రపరుచుకోవాలంటూ ఆర్బీఐ నిబంధనలు తీసుకొచ్చింది.
https://10tv.in/whatsapp-launches-new-disappearing-messages-option/
ఈ ఏడాదిలోనే దీనికి సంబంధించి వాట్సాప్ పే సర్వీసు సుప్రీంకోర్టులో సవాల్ విసిరింది. గత ఏప్రిల్ నెలలోనే రిలయన్స్ జియో ముఖేశ్ అంబానీ.. వాట్సాప్ సొంత కంపెనీ ఫేస్ బుక్ తో డీల్ కుదిరింది. ఇందులో భాగంగా 5.7 బిలియన్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది.