Nubia Z50 Ultra Launch : మార్చి 7న నుబియా Z50 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఈవెంట్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!
Nubia Z50 Ultra Launch : ప్రముఖ (ZTE) యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుబియా (Nubia) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. అదే.. Nubia Z50 Ultra ఫోన్ .. ఈ కొత్త మోడల్ మార్చి 7న చైనాలో లాంచ్ కానుంది.

Nubia Z50 Ultra With Snapdragon 8 Gen 2 SoC Spotted on Geekbench Ahead of March 7 Launch
Nubia Z50 Ultra Launch : ప్రముఖ (ZTE) యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుబియా (Nubia) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. అదే.. Nubia Z50 Ultra ఫోన్ .. ఈ కొత్త మోడల్ మార్చి 7న చైనాలో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. రాబోయే Nubia Z50 Ultra మోడల్ నంబర్ Nubia NX712Jతో కనిపించింది.
నుబియా ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా ఆధారితం కావచ్చు. గీక్‌బెంచ్ లిస్టింగ్ (Nubia Z50 Ultra)లో 12GB వరకు RAMని కూడా సూచిస్తుంది. మోడల్ నంబర్ నుబియా NX712Jతో ముఖ్య స్పెసిఫికేషన్‌లతో రానుంది. నుబియా Z50 Ultra మోడల్ 11.01GB RAMని కలిగి ఉంటుందని సూచిస్తుంది. గరిష్టంగా 3.19GHz క్లాక్ స్పీడ్‌తో ప్రైమ్ CPU కోర్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తుంది. మూడు కోర్స్ 2.02GHz వద్ద ఉండనుంది. నాలుగు కోర్‌లు గరిష్ట వేగం 2.80GHz ఉండనుంది.
ఈ వివరాలన్నీ రాబోయే Nubia Z50 Ultraలో Snapdragon 8 Gen 2 SoCతో రానుంది. Nubia Z50 Ultra సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 1,494 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 5,121 పాయింట్లు కలిగి ఉంది. Nubia Z50 Ultra మోడల్ మార్చి 7న చైనాలో అధికారికంగా అందుబాుటలోకి రానుందని నివేదిక వెల్లడించింది.

Nubia Z50 Ultra Launch : Nubia Z50 Ultra With Snapdragon 8 Gen 2 SoC Spotted on Geekbench
ఈ లాంచ్ ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:00 గంటలకు (11:30 am IST) ప్రారంభమవుతుంది. ZTE-యాజమాన్య బ్రాండ్ Weibo ద్వారా హ్యాండ్‌సెట్ డిజైన్, స్పెసిఫికేషన్‌లను రివీల్ చేయనుంది. 1,440Hz పల్స్ వెడల్పు మాడ్యులేషన్ (PWM) ఫ్రీక్వెన్సీతో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది.
f/2.0 ఎపర్చర్‌తో అండర్-డిస్ప్లే 16-MP సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్-ఫోకస్డ్ డివైజ్‌లో థర్మల్ మేనేజ్‌మెంట్ 41442mm స్క్వేర్ కూలింగ్ ఏరియాతో బయోనిక్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. నుబియా కొత్త ఫోన్ కొత్త NeoVision కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీతో రానుంది.
Read Also : Itel Pad One Price : ఆపిల్ ఐప్యాడ్ ప్రో ఫీచర్లతో ఐటెల్ ప్యాడ్ వన్ వచ్చేసింది.. కేవలం రూ. 13వేలు మాత్రమే..!