Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్ ఇలా..!

ప్రముఖ టూ వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ మళ్లీ మొదలైంది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త వేరియంట్లలో S1, S1pro ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ కోసం రిజర్వేషన్ విండోను ఓపెన్ చేసింది.

Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్ ఇలా..!

Ola Electric Re Opens Electric Scooter Bookings

Updated On : October 5, 2021 / 10:22 PM IST

Ola Electric Bookings : ప్రముఖ టూ వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ మళ్లీ మొదలైంది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త వేరియంట్లలో S1, S1pro ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ కోసం రిజర్వేషన్ విండోను ఓపెన్ చేసింది. రూ.499 ప్రారంభ ధరతో స్కూటర్లను వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గత నెలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు రోజుల్లో రూ.1,100 కోట్ల విలువైన సేల్స్ జరిపింది. రెండు రోజుల అమ్మకాల్లో కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. అనంతరం స్టాక్ ఖాళీ కావడంతో బుకింగ్స్ నిలిపివేసింది.
YouTube Music : గూగుల్ గుడ్ న్యూస్.. ఇక నుంచి ఉచితం

ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను 1000కి పైగా నగరాలు, పట్టణాల నుంచి బుకింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెల చివరి నుంచి కంపెనీ వినియోగదారులకు స్కూటర్లను డెలివరీ చేయడం ప్రారంభించనుంది. ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 1న మళ్లీ బుకింగ్స్ ఓపెన్ చేయాలని భావించింది. మరోసారి బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ-స్కూటర్‌ను ఓలా యాప్, వెబ్ సైటు ద్వారా సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా బుకింగ్ చేసుకున్నారు. ప్రపంచంలో భారీగా బుక్ చేసిన ఎలక్టరీ స్కూటర్ గా ఓలా కంపెనీ జూలైలో రికార్డు నెలకొల్పింది. ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగస్టు 15న ఓలా S1, S1 pro రెండు వేరియెంట్లలో లాంచ్ చేసింది.


ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను S1, S1ప్రో రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. 8.5 కిలోవాట్‌ మోటార్‌, 3.97 కిలోవాట్‌ పర్‌ అవర్‌ ‍బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లు వరకు అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.  మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. S1 ఎలక్ట్రిక్ మోడల్ ధర రూ. 99,999లుగా ఉంది. అలాగే S1 ప్రో ధర రూ.1,29,000లుగా ఉన్నాయి. ఓలా స్కూటర్‌ పది కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Old Car Renewal : మీకు 15ఏళ్లు దాటిన పాత కారు ఉందా? 8 రెట్లు ఫీజు చెల్లించాల్సిందే!