Ola Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ ఆదివారమే..
ఓలా ఎలక్ట్రిక్ లాంచింగ్ కు రెడీ అయింది. ఆగష్టు 15.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆదివారమే దీనిని లాంచ్ చేయనున్నారు. భారీ స్టోరేజ్‌తో పాటు ఎల్ఈడీ డీఆర్ఎల్ రింగ్‌తో ట్విన్ పాడ్ హెడ్‌లైట్, కర్వీ డిజైన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్, వెనుక భాగంలో చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లతో అలరించనుంది.

Ola Launching
Ola Scooter: ఒకవైపు పెట్రోల్ ధరల మంటలు.. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్. ఈ సమయంలో కంఫర్ట్ కోరుకుంటున్న వినియోగదారులంతా ఎలక్ట్రిక్ బైక్ లకే మొగ్గు చూపుతున్నారు. ఇండియన్ మార్కెట్ లోకి ఇప్పటికే పలు మోడళ్లు లాంచ్ కాగా, రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ లాంచింగ్ కు రెడీ అయింది. ఆగష్టు 15.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆదివారమే దీనిని లాంచ్ చేయనున్నారు.
కొద్ది వారాల క్రితమే ఈ బైక్ ఆన్ లైన్ బుకింగ్స్ స్టార్ట్ అవగా.. దాదాపు లక్ష మందికి పైగా వీటిపై కర్చీఫ్ వేసేశారు. వీరందరూ ఆశగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ వాహనం లాంచ్ ఆదివారం వచ్చేస్తుందని సహ వ్యవస్ధాపకుడు, సీఈఓ భవీష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ వివరాలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని పది రంగుల్లో లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే టీజర్ల ద్వారా కొన్ని ఫీచర్లను వెల్లడించగా సీటు కింద భారీ స్టోరేజ్‌తో పాటు ఎల్ఈడీ డీఆర్ఎల్ రింగ్‌తో ట్విన్ పాడ్ హెడ్‌లైట్, కర్వీ డిజైన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్, వెనుక భాగంలో చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లతో అలరించనుంది.
లాంఛ్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తన బైక్ గురించి పూర్తి స్సెసిఫికేషన్స్, వేరియంట్స్, రేట్స్, ఇతర వివరాలను వెల్లడించనుంది. ఈ ఓలా స్కూటర్‌కి ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్ల మైలేజ్ రానుంది. ఈ స్కూటర్‌ను 0 నుండి 50% వరకు ఛార్జ్ంగ్‌ని జస్ట్ 18 నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చు.