అన్ని రకాల ఫీచర్లు ఉన్న OnePlus స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్.. కొన్ని రోజులు మాత్రమే
మంచి పర్ఫార్మన్స్, అద్భుతమైన డిజైన్‌తో వచ్చిన OnePlus 12 అందరికీ నచ్చుతుంది.

OnePlus తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 12 ధరను తగ్గించింది. మంచి పర్ఫార్మన్స్, అద్భుతమైన డిజైన్‌తో వచ్చిన OnePlus 12 అందరికీ నచ్చుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌ను ఇప్పుడు అమెజాన్ ఇండియాలో రూ.51,998కే కొనుగోలు చేయవచ్చు. 16GB RAM, 512GB స్టోరేజ్ టాప్-ఆఫ్-ది-లైన్ వెర్షన్ ధర రూ.56,998గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు లాంచ్ తర్వాత 12GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ.64,999గా, 16GB RAM, 512GB స్టోరేజ్ ధర రూ.69,999గా ఉండేవి. ఇప్పుడు ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు. కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
డిస్ప్లే, డిజైన్
వన్‌ప్లస్ 12లో QHD+ రిజల్యూషన్ (1440×3168 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.82-అంగుళాల ProXDR LTPO కర్వ్డ్ స్క్రీన్ ఉంది. టాప్-ఆఫ్-ది-లైన్ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, బెజెల్-లెస్, పంచ్-హోల్ డిజైన్‌తో వచ్చింది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది.
పనితీరు, సాఫ్ట్‌వేర్
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v14 ద్వారా రన్ అవుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇందులో ఆక్టా-కోర్ CPU ఉంది. కస్టమర్లు రెండు మెమరీ కాన్ఫిగరేషన్‌లలో ఏదైనా ఒకదాన్ని కొనుక్కోవచ్చు. 12GB RAM, 256GB స్టోరేజ్ లేదా 16GB RAM, 512GB స్టోరేజ్‌లో ఏదైనా ఒకటి మీ అవసరాన్ని బట్టి కొనుగోలు చేయవచ్చు.
కెమెరా ఫీచర్లు
వన్‌ప్లస్ 12 బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇది 50MP వైడ్-యాంగిల్ ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో 64MP పెరిస్కోప్ లెన్స్‌తో వచ్చింది. ఈ ఫోన్ 24fps 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్, డ్యూయల్ LED ఫ్లాష్‌తో అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 4K రికార్డింగ్‌కు సపోర్టు చేసే 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్
OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 5400mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. ఫోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా రోజంతా వాడుకోవచ్చు.