OnePlus 13 Price : కొత్త ఫోన్ కావాలా? వన్‌ప్లస్ 13 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

OnePlus 13 Price : లాంచ్‌కు ముందు, భారత మార్కెట్లో బేస్ వన్‌ప్లస్ 13 ధర రేంజ్ ముందుగానే రివీల్ చేసింది. రాబోయే రెండు హ్యాండ్‌సెట్‌ల ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

OnePlus 13 Price : కొత్త ఫోన్ కావాలా? వన్‌ప్లస్ 13 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

OnePlus 13 And 13R Series Price Range in India

Updated On : December 27, 2024 / 10:01 PM IST

OnePlus 13 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ నుంచి వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ జనవరి 7న లాంచ్ కానున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ డిజైన్, కలర్ ఆప్షన్లు, లభ్యత వివరాలు, స్మార్ట్‌ఫోన్‌ల అనేక ముఖ్య ఫీచర్లను వెల్లడించింది.

Read Also : RBI UPI Rule for Wallets : ఆర్బీఐ కొత్త రూల్.. పీపీఐ యూజర్లు ఏదైనా యూపీఐ ద్వారా వ్యాలెట్లలో నగదుతో పేమెంట్లు చేయొచ్చు!

లాంచ్‌కు ముందు, భారత మార్కెట్లో బేస్ వన్‌ప్లస్ 13 ధర రేంజ్ ముందుగానే రివీల్ చేసింది. రాబోయే రెండు హ్యాండ్‌సెట్‌ల ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ 13ఆర్ ఇటీవల చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 5 రీబ్యాడ్జ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 అక్టోబర్‌లో చైనా మార్కెట్లో లాంచ్ అయింది.

భారత్‌లో వన్‌ప్లస్ 13 ధర, వన్‌ప్లస్ 13ఆర్ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ (అంచనా) :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 ధర రూ.67వేల నుంచి రూ. 70వేల మధ్య ఉండవచ్చు. ఈ ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా, గత వన్‌ప్లస్ 12 12జీబీ+ 256జీబీ, 16జీబీ + 512జీబీ ఆప్షన్లలో వరుసగా రూ. 64,999, రూ. 69,999 ధరకు అందుబాటులో ఉండనుంది.

టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ 13ఆర్ ఒకే ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుందని భావిస్తున్నారు. అయితే, వన్‌ప్లస్ 12ఆర్, 8జీబీ+ 128జీబీ, 16జీబీ+ 256జీబీ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఫోన్ ధర వరుసగా రూ. 39,999, రూ. 45,999కు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ 13ఆర్ 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 42,999కు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఇండియా వేరియంట్ ఫీచర్లు :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 ఫోన్ ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. అయితే, వన్‌ప్లస్ 13ఆర్ ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ షేడ్స్‌లో వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ద్వారా దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ వరుసగా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీల ద్వారా పవర్ పొందుతాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 6,000mAh బ్యాటరీలు, ఏఐ-బ్యాక్డ్ ఫోటో ఎడిటింగ్, నోట్-టేకింగ్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. వన్‌ప్లస్ 13 కూడా దుమ్ము, నీటి ప్రవేశాన్ని నిరోధించే ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంటుంది.

Read Also : Lava Yuva 2 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా యువ 2 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర ఎంతంటే?