OnePlus vs iQoo : వన్‌ప్లస్ నార్డ్ 3 vs ఐక్యూ నియో 7 ప్రో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?
OnePlus Nord 3 vs iQoo Neo 7 Pro : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ 3, ఐక్యూ నియో 7 ప్రో ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫోన్ల ఫీచర్లు, ధర ఎంతంటే?

OnePlus Nord 3 vs iQoo Neo 7 Pro _ Specifications and Price in India Compared
OnePlus Nord 3 vs iQoo Neo 7 Pro : కొత్త ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. (OnePlus Nord 3) ఫోన్ జూలై 5న దేశంలో లాంచ్ కాగా.. రెండు స్టోరేజ్ RAM వేరియంట్‌లతో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ. 33,999కు సొంతం చేసుకోవచ్చు. (iQoo Neo 7 Pro) ఐక్యూ నియో 7 ప్రో రెండు వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ జూలై 4న భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 34,999తో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ MediaTek డైమెన్సిటీ 9000SoC ద్వారా పవర్ అందిస్తుంది. iQoo హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 40వేల వరకు ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 3, ఐక్యూ నియో 7 ప్రో రెండింటి మధ్య తేడా ఏంటి? ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ నార్డ్ 3 vs ఐక్యూ నియో 7 ప్రో ధర :
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ Nord 3 ఫోన్ 16GB వరకు RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో తీసుకొచ్చింది. హ్యాండ్‌సెట్ 8GB RAM + 128GB స్టోరేజ్ బేస్ మోడల్‌లో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 33,999 ఉండగా, 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. మరోవైపు, iQoo Neo 7 Pro 5G ఫోన్ రూ. 8GB RAM + 128GB స్టోరేజీ ఆప్షన్ ధర 34,999కు అందిస్తుంది. అదే సమయంలో, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999, డార్క్ స్టార్మ్, ఫియర్‌లెస్ ఫ్లేమ్ కలర్‌వేస్‌లో వస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ 3 vs ఐక్యూ నియో 7 ప్రో స్పెసిఫికేషన్‌లు :
రెండు స్మార్ట్‌ఫోన్‌లు 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తాయి. వన్‌ప్లస్ నార్డ్ 3 గరిష్టంగా 16GB RAMతో ఐక్యూ నియో 7 ప్రో 12 GB RAM వరకు ఉంటుంది. OnePlus హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 9000 SoC ద్వారా శక్తిని పొందుతుంది, అయితే, ఐక్యూ నియో 7 ప్రో ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉంటుంది. కెమెరా ముందు వన్‌ప్లస్ నార్డ్ 3 ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16MP సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. ఐక్యూ నియో 7 ప్రో కూడా 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యూనిట్, 2MP మాక్రో యూనిట్‌ని ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కెమెరా ఫీచర్లను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు డ్యూయల్-సిమ్ (నానో)కి సపోర్టు ఇస్తాయి. ఆండ్రాయిడ్ 13-ఆధారిత OSలో రన్ అవుతాయి.

OnePlus Nord 3 vs iQoo Neo 7 Pro _ Specifications and Price in India Compared
డిస్ప్లే విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ 6.74-అంగుళాల AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. అయితే, ఐక్యూ నియో 7 ప్రో కొంచెం పెద్ద 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు హ్యాండ్‌సెట్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తాయి. బ్యాటరీ విభాగంలో, రెండు హ్యాండ్‌సెట్‌లు 5,000mAh సెల్‌ను ప్యాక్ చేస్తాయి. అయినప్పటికీ, OnePlus Nord 3 ఫోన్ 80W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.
అయితే, ఐక్యూ నియో 7 ప్రో చాలా వేగవంతమైన 120W ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ 3, ఐక్యూ నియో 7 Pro రెండూ ఫోన్లలో 5G, 4G LTE, Wi-Fi 6, GPSకి సపోర్టుతో పాటు USB టైప్-C పోర్ట్ కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేయండి.