Oppo F29 Series : దిమ్మతిరిగే ఫీచర్లతో ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఏకంగా రెండు ఫోన్లు.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F29 Series : ఒప్పో F29 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో F29, F29 ప్రో అనే రెండు మోడళ్లను రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Oppo F29 Series : దిమ్మతిరిగే ఫీచర్లతో ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఏకంగా రెండు ఫోన్లు.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F29 Series

Updated On : March 20, 2025 / 1:18 PM IST

Oppo F29 Series Launch : ఒప్పో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి ఒప్పో నుంచి రెండు నెక్స్ట్ జనరేషన్లు ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఒప్పో F29 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. ఒప్పో F29, ఒప్పో F29 ప్రో మోడల్స్. కంపెనీ రాబోయే F29 సిరీస్‌ను ‘అల్టిమేట్ ఛాంపియన్’గా ప్రమోట్ చేస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు వాటర్, డస్ట్ నిరోధకతకు IP69, IP68, IP66 రేటింగ్‌లతో వస్తున్నాయి. అదనంగా, మెరుగైన ప్రొటెక్షన్ కోసం 360-డిగ్రీల డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీని కలిగి ఉన్నాయి. ఈ సిరీస్‌‌లో కొత్తగా హంటర్ యాంటెన్నా ఆర్కిటెక్చర్‌ను తీసుకొస్తోంది.

Read Also : Google Pixel 9a : కొత్త ఫోన్ భలే ఉందిగా.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

సిగ్నల్ స్ట్రెన్త్ 300 శాతం వరకు గణనీయంగా పెరుగుతుంది. కంపెనీ F29, F29 ప్రో సిరీస్ లాంచ్‌కు ఒప్పో అనేక వివరాలను వెల్లడించింది. ఇంతకీ ఈ ఒప్పో F29 సిరీస్ ఫీచర్లు, ధరల వివరాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఒప్పో F29, F29 ప్రో భారత్ ధర (అంచనా)
ఒప్పో F29 సిరీస్ ఈరోజు భారత మార్కెట్లో లాంచ్ అవుతోంది. లాంచ్ తర్వాత ఒప్పో F29 5G, ఒప్పో F29 Pro 5G రెండూ అమెజాన్, ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఒప్పో F29 5G ధర రూ.25వేల కన్నా తక్కువగా ఉంటుందని అంచనా. ఒప్పో F29 ప్రో 5G ధర రూ.30 కన్నా కంటే తక్కువగా ఉండవచ్చు.

ఒప్పో F29, F29 ప్రో కీలక ఫీచర్లు :
ఒప్పో F29 5G సిరీస్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీతో సహా అనేక రకాల ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంటుంది. ఒప్పో F29 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. AnTuTu V10 స్కోరును 6,50,000 అందిస్తుంది.

ఇంతలో, ఒప్పో F29 ప్రో 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. AnTuTu V10లో 7,40,000 కన్నా ఎక్కువ స్కోర్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 8GB + 128GB, 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో రానున్నాయి. ఇందులో ఒప్పో F29 ప్రో మోడల్ కూడా హై స్టోరేజీ 12GB + 256GB ఆప్షన్ అందిస్తుంది.

బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. :
ఒప్పో F29 5G ఫోన్ బ్యాటరీ పరంగా 45W (SUPERVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మరోవైపు, ఒప్పో F29 Pro 5G కొంచెం చిన్న 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కానీ, వేగవంతమైన 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ స్పీడ్ కలిగి ఉంది.

ఈ రెండు మోడళ్లు అల్ట్రా-డ్యూరబుల్ 360-డిగ్రీల డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీతో రూపొందాయి. వాటర్, డస్ట్ నిరోధకతకు IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తాయి. అంతేకాదు.. నీటి అడుగున కూడా అద్భుతమైన ఫొటోల కోసం ఫోటోగ్రఫీ మోడ్‌ కూడా ఉంది.

Read Also : Pixel 9a vs iPhone 16e : పిక్సెల్ 9a ఫోన్ కొనాలా? ఐఫోన్ 16e కొనాలా? ఇందులో ఏది కొంటే బెటర్? ఫీచర్లు, ధర ఎంతంటే?

కనెక్టివిటీ పరంగా పరిశీలిస్తే.. ఒప్పో F29 5G సిరీస్ ఒప్పో సరికొత్త హంటర్ యాంటెన్నా ఆర్కిటెక్చర్‌ను తీసుకొచ్చింది. కంపెనీ ప్రకారం.. సిగ్నల్ స్ట్రెన్త్ 300 శాతం పెరిగేలా రూపొందించింది. ఇంకా, ఏఐ లింక్‌బూస్ట్ టెక్నాలజీ రియల్ టైమ్ నెట్‌వర్క్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. సిగ్నల్ డ్రాప్‌లను గుర్తించి బ్రౌజింగ్, గేమింగ్‌ కనెక్టివిటీని ఆప్టిమైజ్ చేస్తుంది.

డిజైన్ విషయానికొస్తే.. ఒప్పో F29 5G ఫోన్ సాలిడ్ పర్పుల్, గ్లేసియర్ బ్లూ అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, ఒప్పో F29 ప్రో 5G అడ్వాన్స్‌డ్ గ్రానైట్ బ్లాక్, మార్బుల్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అత్యాధునిక సాంకేతికత, స్టైలిష్ డిజైన్‌తో ఒప్పో F29 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీనివ్వనుంది.