Poco C61 Launch : భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో పోకో C61 ఫోన్ లాంచ్.. భారత్‌లో ధర కేవలం రూ.6,999 మాత్రమే!

Poco C61 Launch : బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల విస్తరణలో భాగంగా పోకో ఇండియా సరికొత్త పోకో C61 ఫోన్ లాంచ్ చేసింది. ఈ డివైజ్ 6.71-అంగుళాల డిస్‌ప్లే, 5000ఎంఎహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ G36 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.

Poco C61 Launch : భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో పోకో C61 ఫోన్ లాంచ్.. భారత్‌లో ధర కేవలం రూ.6,999 మాత్రమే!

Poco launches Poco C61 in India, offering 6.71-inch display and 5000 mAh battery at Rs 6,999

Poco C61 Launch : భారత మార్కెట్లోకి పోకో నుంచి సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ పోకో C61 వచ్చేసింది. ఈ కొత్త పోకో ఫోన్ అద్భుతమైన పర్పార్మెన్స్, మంచి డిజైన్, డిస్‌ప్లేతో బడ్జెట్ ఫోన్‌ మాదిరిగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ కొత్త పోకో C61 ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000ఎంఎహెచ్ బ్యాటరీతో 6.71-అంగుళాల డాట్ డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Read Also : Pavan Davuluri : మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి, భారతీయ దిగ్గజాల జాబితాలో చోటు

ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. పోకో C61 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా మార్కెట్లోకి తీసుకొచ్చామని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ పేర్కొన్నారు. కొత్తగా లాంచ్ అయిన పోకో C61 ఫోన్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

పోకో సి61 భారత్ ధర ఎంతంటే? :
పోకో సి61 మార్చి 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మిస్టికల్ గ్రీన్, ఎథెరియల్ బ్లూ, డైమండ్ డస్ట్ బ్లాక్ ధర రూ. 6,999 ధరకు పొందవచ్చు. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీని రూ.7,999కు పొందవచ్చు. ముఖ్యంగా, ఈ ధరలలో ఒక రోజుకి రూ. 500 కూపన్ సేల్ డే ఆఫర్ కూడా అందిస్తుంది.

పోకో సి61 స్పెసిఫికేషన్లు :
పోకో సి61 ఫోన్ 6.71-అంగుళాల ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 180హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా డిస్‌ప్లేను అందిస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గించే డీసీ డిమ్మింగ్‌ను కలిగి ఉంది. కేవలం 1.15ఎమ్ఎమ్ స్లిమ్ సైడ్ బెజెల్‌తో 89.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ అందమైన గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

పోకో C61 ఫోన్ 5000ఎమ్ఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ప్యాకేజీలో 10డబ్ల్యూ ఛార్జర్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో యూఎస్‌బీ టైప్-సితో వస్తుంది. ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ రెండింటినీ అందిస్తుంది. ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు డ్యూయల్-కెమెరా సెటప్‌ కూడా ఉంది. ఆటో ఫోకస్‌తో కూడిన 8ఎంపీ బ్యాక్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అదనపు కెమెరాలో ఏఐ పోర్ట్రెయిట్ మోడ్, ఫిల్మ్ ఫిల్టర్‌లు, టైమ్డ్ బర్స్ట్, హెచ్‌డీఆర్ సామర్థ్యాలు ఉన్నాయి.

మీడియాటెక్ జీ36 ప్రాసెసర్ 2.2జీహెచ్‌జెడ్ వరకు సపోర్టు చేస్తుంది. స్టోరేజీ ఆప్షన్లలో 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌లతో 1టీబీ వరకు విస్తరించవచ్చు. పోకో సి61 ఫోన్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 రన్ అవుతుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తుంది. కనెక్టివిటీపరంగా జీఎస్ఎమ్, ఎల్టీఈ బ్యాండ్‌లకు సపోర్టుతో పాటు ఆడియో ఫీచర్లలో సింగిల్ స్పీకర్, మల్టీఫేస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం 3.5ఎమ్ఎమ్ జాక్ ఉన్నాయి.

Read Also : Flipkart Month-End Sale : ఫ్లిప్‌కార్ట్‌ సేల్ ఆఫర్లు : ఈ ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఐఫోన్ ధర ఎంత తగ్గిందంటే?