Realme 9 Pro 5G : రియల్‌మి 9 ప్రో సిరీస్ 5G వచ్చేసింది.. ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే?
రియల్‌మి నుంచి 9ప్రో సిరీస్ లాంచ్ అయింది. ఫిబ్రవరి 16న గ్లోబల్ మార్కెట్లో రెండు వేరియంట్లతో లాంచ్ అయింది. ఫిబ్రవరి 16న గ్లోబల్ మార్కెట్లో రెండు వేరియంట్లతో లాంచ్ అయింది.

Realme 9 Pro 5g Realme 9 Pro 5g, Realme 9 Pro+ 5g India Launch Today
Realme 9 Pro 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి 9ప్రో సిరీస్ లాంచ్ అయింది. ఫిబ్రవరి 16న గ్లోబల్ మార్కెట్లో రెండు వేరియంట్లతో లాంచ్ అయింది. రియల్‌మి నుంచి లైట్ షిఫ్ట్ డిజైన్‌తో ఈ రెండు రియల్‌మి ఫోన్లలో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. బ్యాక్ కలర్ ప్యానెల్స్‌లో లైట్ బ్లూ నుంచి రెడ్ కలర్ల వరకు మారిపోతుంటాయి. ఇందులో కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సన్ రైజ్ బ్లూ కలర్ ఆప్షన్ లిమిటెడ్ గా అందించారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరాలు, డైనమిక్ RAM ఎక్స్‌ప్యాన్షన్ 5GB వరకు పెంచుకోవచ్చు.
బుల్ట్ ఇన్ స్టోరేజీతో వచ్చిన ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్లో ప్రీలోడెడ్ స్ట్రీట్ ఫొటోగ్రఫీ మోడ్ 2.0 కలిగి ఉంది. ఫిల్టర్లలలో నియోన్ ట్రైల్, లైట్ ట్రైల్ ప్రొట్రాయిట్, రష్ అవర్, లైట్ పెయింటింగ్ కూడా ఉన్నాయి. Realme 9pro 5G ఫోన్ 120Hz డిస్‌ప్లేతో Qualcomm Snapdragon 695 SoC ప్రాసెసర్‌తో వచ్చింది. Realme 9 Pro+ 5G ఫోన్ 90Hz సూపర్ AMOLED డిస్ ప్లేతో వచ్చింది. MediaTek Dimensity 920 SoC తో వచ్చిన ఈ Realme 9 pro సిరీస్ మార్కెట్లో లాంచ్ అయిన ఇతర 5G స్మార్ట్ ఫోన్ Infinix Zero 5G, Vivo T1 5G, Moto G71 5G ఫోన్లతో పోటీగా లాంచ్ అయింది.
ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో Realme 9 Pro 5G ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. 6GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ అందుబాటులో ఉంది. అలాగే 8GB + 128GB మోడల్ ఫోన్ ప్రారంభ ధర రూ. 20,999గా ఉంది. Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 (6GB+128GB వేరియంట్)గా ఉంది. 8GB + 128GB ఆప్షన్ ప్రారంభ ధర రూ.26,999గా ఉంది. టాప్ మోడల్ స్టోరేజీ 8GB + 256GB మోడల్ ధర రూ.28,999గా ఉంది. Realme 9 Pro 5G, Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్లు Aurora Green, Midnight Black, Sunrise Blue కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు స్మార్ట్ ఫోన్ల సేల్ Realme 9 Pro సేల్ ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. Realme 9 Pro+ 5G సేల్ ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు Realme 9 స్మార్ట్ ఫోన్ సిరీస్ లు ఈకామర్స్ దిగ్గజమైన Flipkart, Realme.com, mainline channels ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. లాంచ్ ఆఫర్ల కింద Realme 9 Pro, Realme 9 Pro+ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై HDFC Bank Cards, EMI ద్వారా ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.2వేలు వరకు పొందవచ్చు.
Realme 9 Pro 5G specifications :
– ఆండ్రాయిడ్ 12
– Realme UI 3.0
6.6 అంగుళాల Full HD+ LCD ప్యానెల్
120Hz (రీఫ్రెష్ రేట్)
– ఆక్టో కోర్ క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 695 SoC
– అడ్రినో 619 GPU, 8GB RAM
– ట్రిపుల్ కెమెరా సెటప్, 64MP ప్రైమరీ సెన్సార్ (f1.79 లెన్స్)
– వైడ్ యాంగిల్ షూటర్, 2MP మ్యాక్రో షూటర్
– 16 MP సెల్ఫీ కెమెరా సెన్సార్ (ఫ్రంట్)
– 128GB ఆన్ బోర్డ్ స్టోరేజీ
– 5G, 4G LTE, Wi-Fi, Bluetooth v5.2, GPS/ A-GPS, USB Type-C
– 3.5mm హెడ్ ఫోన్ జాక్
– 5,000mAh బ్యాటరీ, 33W Dart ఛార్జ్ ఫాస్ట్
– 8.5mm మందంగా.. 195 గ్రాముల బరువు
Realme 9 Pro+ 5G specifications
– Realme UI 3.0 ఆధారిత Android 12
– ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50MP Sony IMX766 ప్రైమరీ సెన్సార్
– 6.4-అంగుళాల full-HD+ (1,080×2,400 pixels) Super AMOLED డిస్‌ప్లే
– 20:9 aspect రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్
– 2.5D Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్
– టచ్ శాంపిలింగ్ రేట్ 180Hz
– MediaTek Dimensity 920 SoC
– Mali-G68 MC4 GPU
– 8GB of LPDDR4X RAM
– 8MP Sony IMX355 సెన్సార్ (f/2.2 ultra-wide lens)
– 2MP మాక్రో సెన్సార్ షూటర్
– 16-megapixel Sony IMX471 selfie camera sensor (ఫ్రంట్)
– 256GB UFS 2.2 ఇన్ బుల్ట్ స్టోరేజీ
– 5G, 4G LTE, Wi-Fi, Bluetooth v5.2, GPS/ A-GPS, USB-Type-C
– 3.5mm headphone jack
– accelerometer, ambient light sensor, gyroscope, magnetometer, proximity sensor
– in-display fingerprint Sensor
– heart rate sensor ( హార్ట్ రేట్ డిటెక్ట్ చేస్తుంది)
– Dolby Atmos and Hi-Res audio
– 4,500mAh battery (60W SuperDart fast charging)
– 160.2×73.3×7.99mm, బరువు 182 grams
Read Also : Realme 9 Series Leak : లాంచింగ్ ముందే లీకైన రియల్‌మి 9 సీరిస్ ఫీచర్లు.. మరో 5G ఫోన్ ఫీచర్లు కూడా లీక్..!