Realme GT 6 Price : ఈ నెల 20నే రియల్‌మి జీటీ 6 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర లీక్!

Realme GT 6 Price Launch : ఈ ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు. లాంచ్‌కు ముందు రియల్‌మి జీటీ 6 భారతీయ వేరియంట్ ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

Realme GT 6 Price : ఈ నెల 20నే రియల్‌మి జీటీ 6 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర లీక్!

Realme GT 6 Price in India Leaked ( Image Source : Google )

Realme GT 6 Price Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఈ నెల 20న రియల్‌మి జీటీ 6 లాంచ్ కానుంది. ఈ నెల (జూన్ 20న) భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ ఏడాది మేలో ఆవిష్కరించిన దేశంలోని రియల్‌మి జీటీ 6T సిరీస్‌‌లో జీటీ 6 స్మార్ట్‌ఫోన్ చేరనుంది.

Read Also : Airports Bomb Threat : దేశంలోని 40 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు.. భద్రత పెంపు!

రాబోయే రియల్‌మి GT 6 డిజైన్, కలర్ ఆప్షన్, లభ్యత వివరాలతో సహా పలు కీలక వివరాలను కంపెనీ వెల్లడించింది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా ధృవీకరించింది. అయితే, ఈ ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు. లాంచ్‌కు ముందు రియల్‌మి జీటీ 6 భారతీయ వేరియంట్ ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

భారత్‌‌లో రియల్‌మి జీటీ 6 ధర (అంచనా) :
రియల్‌మి జీటీ 6 భారత్‌లో స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం.. ఎలాంటి లాంచ్ ఆఫర్‌లు లేకుండా 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ధర రూ. 39,999. ఈ హ్యాండ్‌సెట్ హై వేరియంట్లలో 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 42,999కు ఎలాంటి ఆఫర్‌లు లేదా డిస్కౌంట్‌లు లేకుండా పొందవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధరను గుర్తించింది. రియల్‌మి ఇండియా మైక్రోసైట్ రాబోయే హ్యాండ్‌సెట్ ధరలను ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ వివరాలను రివీల్ చేయలేదు.

రియల్‌మి జీటీ 6 స్పెసిఫికేషన్స్ :
రియల్‌మి జీటీ 6 భారత్‌లో జూన్ 20న మధ్యాహ్నం 1:30 గంటలకు లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్, 10,014ఎమ్ఎమ్ చదరపు డ్యూయల్ వీసీ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

రియల్‌మి జీటీ 6 120డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్‌ను 28 నిమిషాల్లో సున్నా నుంచి 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. కెమెరా విభాగంలో రియల్‌మి జీటీ 6 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-808 ప్రైమరీ రియర్ సెన్సార్, 50ఎంపీ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్‌కు అనేక ఏఐ సపోర్టు టూల్స్ ఫీచర్ కలిగి ఉంటుంది.

Read Also : OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ వచ్చేస్తోంది.. ఈ నెల 24నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!