Realme GT 7 Pro Specifications : 50ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో రియల్‌మి GT 7 ప్రో వచ్చేస్తోంది.. కీలక స్పెషిఫికేషన్లు లీక్..!

Realme GT 7 Pro Specifications : రియల్‌మి జీటీ 7ప్రో సెక్యూరిటీకి అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రానుందని గత నివేదిక సూచించింది. ఆప్టికల్ స్కానర్‌లతో పోలిస్తే.. మరింత కచ్చితమైన ఫింగర్‌ప్రింట్ రీడింగ్‌లను అందిస్తుందని పేర్కొంది.

Realme GT 7 Pro Specifications : 50ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో రియల్‌మి GT 7 ప్రో వచ్చేస్తోంది.. కీలక స్పెషిఫికేషన్లు లీక్..!

Realme GT 7 Pro Key Specifications Leak ( Image Source : Google )

Realme GT 7 Pro Specifications : భారత మార్కెట్లో రియల్‌మి జీటీ 7 ప్రో లాంచ్‌ను ఇటీవల రియల్‌మి వైస్ ప్రెసిడెంట్ చేజ్ జు ధృవీకరించారు. ఈ హ్యాండ్‌సెట్‌ను భారత్ సహా ఇతర మార్కెట్‌ల్లో ప్రవేశపెట్టే ముందు చైనాలో ఆవిష్కరించాలని భావిస్తున్నారు.

Read Also : Vivo X Fold 3 Pro Launch : శాంసంగ్, వన్‌ప్లస్‌‌కు పోటీగా.. వివో కొత్త మడతబెట్టే ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

రియల్‌మి జీటీ 7ప్రోకి సంబంధించి అనేక లీక్‌లు గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. కొత్త లీక్ ఫోన్ డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, స్టోరేజ్ వివరాలను సూచిస్తుంది. గత ఎస్ఓసీ-సంబంధిత రియల్‌మి జీటీ 5 ప్రో మాదిరిగా ఉండనుంది. అయితే, ఈ రియల్‌మి జీటీ 5ప్రో ఫోన్ భారత మార్కెట్లో ఇంకా లాంచ్ కాలేదు.

రియల్‌మి జీటీ 7ప్రో స్పెసిఫికేషన్‌లు (అంచనా) : 
రాబోయే రియల్‌మి జీటీ 7ప్రో 1.5కె 8టీ ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెయిబో పోస్ట్ ప్రకారం.. ప్యానెల్ దేశీయ డిస్‌ప్లే తయారీదారుచే అందించనుందని పేర్కొంది. రియల్‌మి జీటీ 7ప్రో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌కు సపోర్టుతో 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని కూడా పోస్ట్ సూచించింది. ఈ హ్యాండ్‌సెట్ “అల్ట్రా-లార్జ్” 6,000mAh బ్యాటరీతో రానుందని భావిస్తున్నారు.

రియల్‌మి జీటీ 7ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 ఎస్ఓసీని 16జీబీ ర్యామ్‌తో 1టీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పొందవచ్చని టిప్‌స్టర్ సూచిస్తుంది. చైనా వెలుపల గ్లోబల్ మార్కెట్‌లలో ఇంకా ప్రకటించని స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రానున్న మొదటి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదేనని లీక్ డేటా సూచిస్తోంది. రియల్‌మి జీటీ 7ప్రో సెక్యూరిటీకి అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రానుందని గత నివేదిక సూచించింది. ఆప్టికల్ స్కానర్‌లతో పోలిస్తే.. మరింత కచ్చితమైన ఫింగర్‌ప్రింట్ రీడింగ్‌లను అందిస్తుందని పేర్కొంది.

రియల్‌మి జీటీ 7 ప్రో లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
రియల్‌మి జీటీ 5ప్రో డిసెంబర్ 2023లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ సైకిల్‌ని అనుసరించి సంవత్సరం చివరిలో రియల్‌మి జీటీ 7 ప్రోని లాంచ్ చేయనుంది.

Read Also : Poco M6 4G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో M6 4జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 11నే లాంచ్!