Realme GT 7 Pro Launch : రియల్‌మి జీటీ 7 ప్రో కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?

Realme GT 7 Pro Leak : రియల్‌మి రాబోయే జీటీ 7 ప్రో స్పెషిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. త్వరలో భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT 7 Pro Launch : రియల్‌మి జీటీ 7 ప్రో కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?

Realme GT 7 Pro key specifications leak

Updated On : October 28, 2024 / 8:39 PM IST

Realme GT 7 Pro Leak : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి రియల్‌మి నుంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ వచ్చేందుకు రెడీగా ఉంది. వచ్చే నవంబర్‌లో రియల్‌మి ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో రానుంది. ఈ రియల్‌మి ఫోన్ డిజైన్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ముఖ్యంగా, రియల్‌మి జీటీ 7 ప్రో లాంచ్‌కు ముందే ఇతర రియల్‌మి జీటీ 6, రియల్‌మి జీటీ 6టీ వంటి ఫోన్‌లను రిలీజ్ చేసింది.

రియల్‌మి జీటీ 7ప్రో ఫోన్ ఫీచర్లు ( అంచనా) :
రియల్‌మి రాబోయే జీటీ 7 ప్రో స్పెషిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. త్వరలో భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లీక్‌ల ప్రకారం.. రియల్‌మి జీటీ 7ప్రో అద్భుతమైన 6.78-అంగుళాల ఓఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz మధ్య వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ముఖ్యంగా, 6000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. డిస్‌ప్లే డాల్బీ విజన్‌కి 100 శాతం డీసీఐ-పీ3 కలర్ సపోర్ట్ అందిస్తుంది. అయితే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఆప్షన్లను అందిస్తుంది.

హుడ్ కింద రియల్‌‌మి జీటీ 7 ప్రో క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3ఎన్ఎమ్ ప్రాసెసర్‌తో వస్తుంది. అడ్రినో 830 జీపీయూతో పనిచేయనుంది. టాప్-టైర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. స్టోరేజ్, మెమరీ కాన్ఫిగరేషన్‌లలో 12జీబీ, 16జీబీ లేదా 24జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఆప్షన్లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. స్టోరేజ్ ఆప్షన్‌లు 256జీబీ నుంచి భారీ 1టీబీ వరకు ఉంటాయి. డేటా యాక్సెస్ విషయానికి యూఎఫ్ఎస్ 4.0ని కలిగి ఉండవచ్చు. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ రియల్‌మి యూఐ 6.0తో ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుందని అంచనా.

ఫోటోగ్రఫీ పరంగా జీటీ 7 ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలతో అదనపు 50ఎంపీ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 16ఎంపీ కెమెరా ఉంటుంది. అదనంగా ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండవచ్చు. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6500mAh బ్యాటరీతో రానుంది.

తక్కువ సమయంలో ఛార్జింగ్.. రోజంతా వస్తుంది. అదనపు ఫీచర్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్-సి ఆడియో, హై-రెస్ ఆడియో సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ వారీగా, 5జీ ఎస్ఏ/ఎన్‌ఎస్ఏ, డ్యూయల్ 4జీ వోల్ట్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లకు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఈ స్పెషిఫికేషన్లతో రియల్‌మి జీటీ 7 ప్రో అత్యంత సామర్థ్యంతో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌గా రానుంది.

Read Also : iQOO Neo 10 Series : ఐక్యూ నియో 10 సిరీస్ లాంచ్ టైమ్‌ఫ్రేమ్ లీక్.. ఇతర ఫీచర్లు వివరాలివే!