Reliance Jio Prepaid Plans : జియో యూజర్లకు పండుగే.. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లతో ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్..!
Reliance Jio Prepaid Plans : జియో యూజర్ల కోసం బఫర్ లేకుండా హై-డెఫినిషన్ లైవ్ క్రికెట్ స్ట్రీమింగ్‌ను అందిస్తోంది. డేటా, వాయిస్ కాల్స్, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల రేంజ్ ప్రకటించింది.

Reliance Jio announces new prepaid plans with free Disney Plus Hotstar subscription in Telugu
Reliance Jio Prepaid Plans : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ+ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) తో కూడిన అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను జియో ఆవిష్కరించింది. క్రికెట్ ఔత్సాహికులు, జియో ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ క్రికెట్ సీజన్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
ఈ కొత్త ప్లాన్‌లతో, జియో సబ్‌స్క్రైబర్‌లు (Jio Subscribers) ఇప్పుడు ఇతర ఎంటర్‌టైన్మెంట్ ఆప్షన్లతో పాటు హై-డెఫినిషన్‌లో బఫర్ లేకుండా లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు. జియో ఆఫర్‌లలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ బండిల్స్ ఉన్నాయి. డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించడమే కాకుండా (Disney+ Hotstar) మొబైల్ కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
జియో ప్లాన్ రూ. 328 మాత్రమే :
ఈ భాగస్వామ్యంతో క్రీడలు, ఎంటర్‌టైన్మెంట్ ప్రియులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ లైనప్‌లోని అత్యంత సరసమైన ప్లాన్ ధర కేవలం రూ. 328 మాత్రమే.. ఈ ప్లాన్ ధర 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 28 రోజుల పాటు రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటాను వినియోగదారులు పొందవచ్చు.
84 రోజుల వ్యాలిడిటీతో రూ. 758 ప్లాన్ :
ఈ ప్లాన్ ప్రకారం.. క్రికెట్ ఔత్సాహికులు డేటా వినియోగంపై ఎలాంటి చింత లేకుండా నెలంతా కనెక్ట్ అయి ఉండవచ్చు. జియో అందించే మరొకటి రూ 758 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 84-రోజుల వ్యవధిలో రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. 3-నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. కేవలం క్రికెట్ సీజన్‌లోనే కాకుండా అంతకు మించి వినోదాన్ని పొందాలనుకునే వినియోగదారులకు ఇది సరైనదిగా చెప్పవచ్చు.
జియో ఆఫర్లను వినియోగదారులు రూ. 388 ప్లాన్‌ను 28 రోజుల పాటు ఎంచుకోవచ్చు. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ప్రత్యామ్నాయంగా, రూ. 808 ప్లాన్ ఉంది. అదే 2GB రోజువారీ డేటా అలవెన్స్‌ను అందిస్తుంది. అయితే, సబ్‌స్క్రిప్షన్ వ్యవధిని 84 రోజులకు పొడిగిస్తుంది.

Reliance Jio announces new prepaid plans
రోజుకు 2GB హై స్పీడ్ డేటా :
ఈ రేంజ్‌లో ప్రీమియం ప్లాన్‌లు 84 రోజుల రూ. 598 ప్లాన్, వార్షిక రూ. 3178 ప్లాన్ అందిస్తుంది. రూ.598 ప్లాన్ వినియోగదారులకు ఒక ఏడాదిలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 84 రోజుల పాటు రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అదే సమయంలో, వార్షిక ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రత్యేకతలు, జాతీయ, అంతర్జాతీయ కంటెంట్‌లపై లైబ్రరీని ఏడాది పొడవునా అదే 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్ నిరంతరాయంగా అందిస్తుంది.
ఈ బండిల్ ప్లాన్‌లతో డిస్నీ+ హాట్‌స్టార్‌ని యాక్టివేట్ చేయొచ్చు. వినియోగదారులు చేయాల్సిందల్లా.. అర్హత కలిగిన డిస్నీ+ హాట్‌స్టార్ బండిల్ ప్లాన్‌లలో దేనితోనైనా రీఛార్జ్ చేసుకోవడమే.. అదే జియో మొబైల్ నంబర్‌ని ఉపయోగించి Disney+ Hotstar యాప్‌కి సైన్ ఇన్ చేయండి.
ఒకసారి పూర్తి చేసిన తర్వాత ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్‌లు, డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న అనేక ఎంటర్‌టైన్మెంట్ ఆప్షన్లతో ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. ఈ క్రికెట్ సీజన్‌లో, జియో తన వినియోగదారులకు అన్నీ కలిసిన ఎంటర్‌టైన్మెంట్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి ముందుకు వచ్చింది. బఫర్ లేకుండా లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, జియో ప్రీపెయిడ్ వినియోగదారులు ప్రతి క్షణాన్ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.