Reliance Jio Celebrations : తెలంగాణలో రిలయన్స్ జియో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలు
Reliance Jio Celebrations : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తెలంగాణలోని తన ఆఫీసుల్లో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలను (52nd national safety week celebrations) నిర్వహిస్తోంది.

Reliance Jio Telangana Celebrates the 51st National Safety Week
Reliance Jio Celebrations : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తెలంగాణలోని తన ఆఫీసుల్లో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలను (52nd national safety week celebrations) నిర్వహిస్తోంది. రిలయన్స్ జియో ఉద్యోగులు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో మార్చి 4 నుంచి మార్చి 10 వరకు జియో ఈ భద్రత వారోత్సవాలను నిర్వహిస్తోంది. జియో ఉద్యోగులు సంవత్సరమంతా సేఫ్‌గా పని చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. అంతేకాదు, వృత్తిపరమైన ఆరోగ్యంతో పాటు భద్రతపై (OH&S) అవగాహన కల్పించడంలో భాగంగా ఈ సేఫ్టీ వీక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పనిజరిగే ప్రాంతాల్లో వివిధ భద్రతా అవగాహన కార్యక్రమాలను జరుపుతోంది. భద్రతకు సంబంధించిన పోటీలను కూడా నిర్వహిస్తోంది. జియో 52వ జాతీయ భద్రత వారోత్సవాల సందర్భంగా పనిచేసే ఉద్యోగులకు నిర్మాణ సామగ్రి, యంత్రాలు, డివైజ్‌లను సురక్షితంగా నిర్వహించడంపై స్పెషల్ షోలు, సెషన్‌లు, మాక్-డ్రిల్ ట్రైనింగ్ నిర్వహిస్తోంది. రిలయన్స్ జియో (Reliance Jio) తెలంగాణ బృందం సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పనిజరిగే ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించడానికి అనుసరించాల్సిన సెక్యూరిటీ ప్రోటోకాల్‌లపై అవగాహన కల్పించేందుకు ప్రతిజ్ఞ చేయించారు.

Reliance Jio Celebrations : Jio Telangana Celebrates the 51st National Safety Week
జియో ఉద్యోగులు పనిచేసే సమయాల్లో సెక్యూరిటీ నిబంధనలతో పాటు నియంత్రణ చర్యలను అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ 2023లోనూ సెక్యూరిటీ థీమ్ ‘OUR AIM- ZERO HARM’ని స్వాగతించేందుకు రిలయన్స్ జియో (Reliance Jio) తెలంగాణలో అత్యంత ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది.
రిలయన్స్ జియో కార్మికులను భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని క్రియేట్ చేయడమే ఉద్దేశం. అంతేకాదు.. జియో నెట్‌వర్క్, మెయింటెనెన్స్, ఆపరేషన్, HSE సభ్యుల ప్రసంగాలతో భద్రతా అవగాహన సెషన్‌లను నిర్వహిస్తోంది. అలాగే, జెండా వందనాలు, భద్రతా ప్రతిజ్ఞ, భద్రతా బ్యాడ్జ్, బ్యానర్ పోస్టర్ షో, భద్రతా అవగాహనపై ర్యాలీలను నిర్వహిస్తోంది.