Reliance Jio : జియో యూజర్లకు పండగే.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
Reliance Jio : సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏడాది మొత్తం రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త జియో వార్షిక ప్లాన్ ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి..

Reliance Jio
Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? ఇకపై సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. దేశంలోని అతిపెద్ద టెలికాం (Reliance Jio) కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జియో 48 కోట్లకు పైగా యూజర్ బేస్ కలిగి ఉంది.
జియో ఇటీవలే సరసమైన వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తరచూ రీఛార్జుల అవసరం ఉండదు. తక్కువ ధరలో దీర్ఘకాలిక ప్లాన్ కోసం చూసేవారికి, ఫాస్ట్ ఇంటర్నెట్ ప్లాన్ కోసం చూస్తున్న యూజర్లకు ఈ కొత్త ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.
నెలవారీ రీఛార్జ్ రేట్లు భారీగా పెరగడంతో చాలామంది వినియోగదారులు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లను ఎక్కువగా ఇష్టపడతారు. ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఒక ఏడాది పాటు రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండవచ్చు. యూజర్లను ఆకర్షించేందుకు జియో పోర్ట్‌ఫోలియోకు రూ. 3599 వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. ఫీచర్లు, ధర రెండింటి పరంగా బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.
రూ. 3599 వార్షిక ప్లాన్ పూర్తి వివరాలివే :
ఈ జియో ప్లాన్ (Reliance Jio) 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
• 365 రోజుల వ్యాలిడిటీ
• రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా (912GBకు పైగా )
• అన్ని నెట్‌వర్క్‌లలో అన్ లిమిటెడ్ కాలింగ్
• రోజుకు 100 SMS
• అన్ లిమిటెడ్ ట్రూ 5G డేటా
ఈ రీఛార్జ్ ప్లాన్ ముఖ్యంగా (Reliance Jio) ఎక్కువ డేటా వాడే వారికి బెస్ట్. విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ వినియోగదారులు లేదా వీడియో స్ట్రీమింగ్ ఇష్టపడే యూజర్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జియో ఇంటర్నెట్, కాలింగ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉచితంగా పొందవచ్చు.
• జియో సినిమా ప్రీమియం : 90 రోజులు ఉచితం
• జియో టీవీ : లైవ్ టీవీ ఛానెల్స్ చూసే సౌకర్యం
• జియోక్లౌడ్ ఏఐ : 50GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజీ
ఆల్-ఇన్-వన్ డిజిటల్ ప్యాకేజీగా పొందవచ్చు.
ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్? :
రెగ్యులర్ యూజర్, వర్కింగ్ ప్రొఫెషనల్ లేదా లిమిట్స్ లేకుండా 5G యాక్సెస్ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరైనది. ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాది మొత్తంలో బ్రేక్ లేకుండా స్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.