Chrome Users Risk : క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు హై-సెక్యూరిటీ రిస్క్.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో.. వెంటనే బ్రౌజర్ అప్‌‌డేట్ చేసుకోండి..!

Chrome Users Risk : గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ హెచ్చరిక.. హ్యాకర్లు మీ సిస్టమ్‌ను హ్యాక్ చేసే రిస్క్ ఎక్కువగా ఉంది. భద్రతాపరమైన లోపాలకు సంబంధించి హెచ్చరిస్తోంది.

Chrome Users Risk : క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు హై-సెక్యూరిటీ రిస్క్.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో.. వెంటనే బ్రౌజర్ అప్‌‌డేట్ చేసుకోండి..!

Chrome Users Risk

Updated On : June 23, 2025 / 1:19 PM IST

Chrome Users Risk : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ డేటా హైరిస్క్‌లో ఉంది.. భారతీయ గూగుల్ క్రోమ్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌లను అప్‌డేట్ (Chrome Users Risk) చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్‌లో మల్టీ సెక్యూరిటీ లోపాలను గుర్తించింది.

Read Also : iOS 26 Release : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. iOS 26 రిలీజ్ డేట్.. బీటా వెర్షన్ డౌన్‌లోడ్ ఇలా.. సపోర్టు చేసే ఐఫోన్లు.. ఫుల్ డిటెయిల్స్..!

వినియోగదారు డేటాను రిమోట్‌గా యాక్సెస్ లేదా మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేసేలా ఉన్నాయని హెచ్చరించింది. ఈ భద్రతా లోపాలతో క్రోమ్ ప్రత్యేకంగా V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్, ప్రొఫైలర్‌లో కనిపిస్తాయి. ఓవర్‌ఫ్లో లేదా వాడిన తర్వాత ఫ్రీ మెమరీ సమస్యలకు దారితీయవచ్చు. ఈ రెండూ హ్యాకర్లకు ఎంట్రీ పాయింట్లుగా మారుతాయి. క్రోమ్ హై సెక్యూరిటీ రిస్క్ నుంచి బయటపడాలంటే వెంటనే బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.

మీ క్రోమ్ బ్రౌజర్ హైరిస్క్‌లో ఉన్నట్టే.. :
మీరు విండోస్, macOSలో (137.0.7151.119/.120) కన్నా తక్కువ గూగుల్ క్రోమ్ వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే లేదా Linuxలో (137.0.7151.119) కన్నా తక్కువ వెర్షన్‌ వాడుతుంటే.. మీ బ్రౌజర్ బగ్ కలిగి ఉంటుంది. ఈ భద్రతా లోపాలతో వెబ్ పేజీలపై క్లిక్ చేసేలా హ్యాకర్లు ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిగత, ఆర్థిక లేదా బిజినెస్ డేటాను రిస్క్‌‌లో పడేస్తుంది. క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే సెక్యూర్ చేసుకోవాలి.

క్రోమ్ బ్రౌజర్‌ను ఎలా సెక్యూర్ చేయాలి? :
గూగుల్ స్టేబుల్ ఛానల్ అప్‌డేట్ ద్వారా అద్భుతమైన సొలుష్యన్ రిలీజ్ చేసింది. మీరు ఇప్పుడు మీ బ్రౌజర్‌ను ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవాలో తెలుసుకుందాం..

  • క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
  • త్రి డాట్స్ మెనుపై క్లిక్ చేయండి (రైట్ టాప్ కార్నర్‌లో)
  • Settings > About Chrome ఆప్షన్‌కు వెళ్లండి
  • క్రోమ్ ఆటోమాటిక్ అప్‌డేట్స్ కోసం చెక్ చేసి లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది.
  • అప్‌డేట్ ఇన్‌స్టాల్ తర్వాత మీ బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయండి.
  • క్రోమ్ వెర్షన్ ఇప్పుడు (137.0.7151.119) లేదా అంతకంటే హై వెర్షన్ తప్పక ఉండాలి.

బ్రౌజింగ్ సమయంలో సేఫ్‌గా ఉండేందుకు బెస్ట్ టిప్స్ ఇవే (Chrome Users Risk) :
క్రోమ్ అప్‌డేట్ చేయడంతో పాటు, మీ బ్రౌజర్ సెక్యూరిటీ కోసం ఈ అంశాలను తప్పక ప్రయత్నించండి.

  • క్రోమ్ సెట్టింగ్‌లలో సేఫ్ బ్రౌజింగ్‌ను ఎనేబుల్ చేయండి.
  • అనుమానాస్పద లింక్‌లు లేదా పాప్-అప్‌లపై క్లిక్ చేయొద్దు.
  • స్ట్రాంగ్, స్పెషల్ పాస్‌వర్డ్‌లను వాడండి. టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.
  • యాడ్ బ్లాకర్లు, యాంటీ-ట్రాకింగ్ టూల్స్ వంటి సెక్యూరిటీ ఎక్స్ టెన్షన్ ఇన్‌స్టాల్ చేయండి.
  • షేర్డ్ కంప్యూటర్లలో బ్రౌజింగ్ డేటాను క్రమం తప్పకుండా క్లియర్ చేయండి
  • వెరిఫై చేయని వెబ్‌సైట్‌ల నుంచి ఎలాంటి ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయొద్దు.

Read Also : PM Awas Yojana 2025 : కొత్త ఇల్లు కొనేవారికి గుడ్ న్యూస్ .. ఈ ప్రభుత్వ పథకంతో రూ. 2.5 లక్షల ఆర్థిక సాయం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

48 కోట్లకు పైగా భారతీయులు ప్రతిరోజూ ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. క్రోమ్ బ్రౌజర్ యాప్‌లో చిన్న బగ్ కూడా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. వ్యాపారాలకు, డేటా ఉల్లంఘనలకు లేదా రాన్సమ్‌వేర్ అటాక్స్ దారితీయవచ్చు. అంతేకాదు.. వ్యక్తిగత డేటా లేదా ఆర్థిక మోసాలు జరగొచ్చు. అందుకే మీ బ్రౌజర్‌ను ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. తద్వారా సైబర్ మోసాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.