Jio vs Airtel : జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. రూ. 500లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ మరెన్నో OTT బెనిఫిట్స్..!
Reliance Jio vs Airtel : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ యూజర్ల కోసం రూ. 500 లోపు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి..

Reliance Jio vs Airtel
Reliance Jio vs Airtel : మీరు వెబ్ సిరీస్ చూస్తుంటారా? ప్రత్యేకించి OTT సబ్‌స్క్రిప్షన్ కోసం చూస్తున్నారా? మీరు జియో, ఎయిర్ టెల్ యూజర్లు అయితే మీకో అద్భుతమైన అవకాశం. ఎయిర్‌టెల్, జియో రెండూ రూ. 500 లోపు మల్టీ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. డేటా, కాల్స్, SMS బెనిఫిట్స్‌తో పాటు పాపులర్ OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు యాక్సస్ పొందవచ్చు.
ఎంట్రీ-లెవల్ ప్లాన్‌లపై కొన్ని మిడ్-రేంజ్ ప్యాక్‌లు (Reliance Jio vs Airtel) అన్‌లిమిటెడ్ 5G డేటా, OTT స్ట్రీమింగ్, వాల్యూ ఆధారిత సర్వీసులను అందిస్తాయి. మీరు రూ. 500 లోపు OTT బెనిఫిట్స్‌తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటే.. ఎయిర్‌టెల్, జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. OTT బెనిఫిట్స్ అందించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి.
రూ. 500 లోపు OTT బెనిఫిట్స్‌తో ఎయిర్‌టెల్ ప్లాన్‌లు :
ఎయిర్‌టెల్ రూ.5వేల లోపు 5 రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. మరెన్నో OTT బెనిఫిట్స్ అందిస్తున్నాయి. రూ.181 నుంచి ప్రారంభమయ్యే ఈ కంటెంట్-ఓన్లీ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో 15GB డేటాతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం ద్వారా 22కి పైగా OTT ప్లాట్‌ఫామ్ యాక్సెస్ అందిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ పొందలేరు.
రూ.195 ప్లాన్ డేటాతో పాటు OTT బెనిఫిట్స్ అందించే మరో సరసమైన ప్లాన్. సబ్‌స్క్రైబర్‌లు 90 రోజుల వరకు 15GB డేటాతో జియోహాట్‌స్టార్ యాక్సెస్ పొందవచ్చు. రూ. 275 ప్లాన్‌తో 1GB డేటా, 1 నెల వ్యాలిడిటీతో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియోహాట్‌స్టార్ సూపర్, ZEE5, సోనీలైవ్ వంటి ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. ఇవన్నీ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే యాప్ ద్వారా యాక్సెస్ పొందవచ్చు.
రూ.398 ప్లాన్ అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్, రోజుకు 2GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఒక రూపాయి అదనంగా చెల్లించి వినియోగదారులు రూ.399కి అదే బెనిఫిట్స్‌తో పాటు 2.5GB డేటాను పొందవచ్చు. ఎక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లు రూ.440 ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 3GB రోజువారీ డేటా, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం ద్వారా 22కు పైగా OTT యాప్స్‌కు యాక్సెస్ పొందవచ్చు.
రూ. 500 లోపు OTT బెనిఫిట్స్‌తో జియో ప్లాన్లు :
జియో OTT బండిల్ ప్లాన్‌లు రూ.100 నుంచి లభ్యమవుతాయి. 5GB డేటా, 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తాయి. ముఖ్యంగా, ఈ ప్లాన్‌లో కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ ఉండవు. రూ.175 ధరకు మరో డేటా-ఓన్లీ ప్యాక్ కూడా ఉంది.
10GB డేటా, సోనీలైవ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్ కోసం 28 రోజుల పాటు OTT యాక్సెస్‌ను అందిస్తుంది. అంతేకాదు.. రూ.200 కన్నా తక్కువ ధరకు మరో ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ప్రత్యేకంగా రూ.195 ఇందులో 15GB డేటా, 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
కాలింగ్, ఇతర బెనిఫిట్స్ కోసం చూస్తున్న కస్టమర్లు రూ.445 ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటా, సోనీలైవ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు JioTV యాక్సస్ 28 రోజుల పాటు పొందవచ్చు.