Relief for EPF members : ఈపీఎఫ్ సభ్యులకు రిలీఫ్.. ఇకపై డాక్యుమెంట్లతో పనిలేదు.. ఈ కొత్త రూల్‌తో ప్రొఫైల్ అప్డేట్ చాలా ఈజీ..!
Relief for EPF members : ఈ కొత్త రూల్ ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలను ఈజీగా రద్దు చేయవచ్చు. అవసరమైతే మళ్లీ దాఖలు చేయొచ్చు.

Relief for EPF members
Relief for EPF members : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మెంబర్ ప్రొఫైల్‌ల అప్డేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. తద్వారా పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలతో రూ.3.9 లక్షల సభ్యులు ప్రయోజనం పొందవచ్చు. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలను ఈజీగా రద్దు చేయవచ్చు. అవసరమైతే మళ్లీ దాఖలు చేయొచ్చు. జనవరి 19, 2025 నాటికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల ప్రకారం.. “ప్రస్తుతం, సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదులలో దాదాపు 27శాతం సభ్యుల ప్రొఫైల్/కేవైసీ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.
Read Also : Aadhaar Safe Tips : మీ ఆధార్ సురక్షితమేనా? మీ ఆధార్ నంబర్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో ఇలా చెక్ చేయండి!
సవరించిన నిబంధనలతో ఈపీఎఫ్ సభ్యులు దాఖలు చేసే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా. కొత్త అప్డేట్ ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు తమ యూఏఎన్ (UAN), ఆధార్‌తో వెరిఫికేషన్ పూర్తి అయితే ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేయొచ్చు. ఇందుకోసం, ఏ ఈపీఎఫ్ సభ్యులు డాక్యుమెంట్లు లేకుండా వివరాలను అప్డేట్ చేయవచ్చు.
ఏ ఈపీఎఫ్ వివరాలను అప్డేట్ చేయొచ్చు? :
కొత్త ప్రక్రియ ప్రకారం.. ఇప్పటికే ఆధార్ ద్వారా ధృవీకరించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ( UAN ) సభ్యులు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో అప్డేట్ చేసేందుకు వీలుంటుంది. ప్రొఫైల్ అప్డేట్ అనేది సభ్యుని పేరు, పుట్టిన తేదీ, నేషనాలిటీ, జెండర్, తండ్రి లేదా తల్లి పేరు, మ్యారేజ్ స్టేటస్, లైఫ్ పార్టనర్ పేరు వంటి వివరాలను ఏ విధమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట.
ఎంప్లాయర్ ధృవీకరణ అవసరమా? :
అక్టోబరు 1, 2017లోపు యూఏఎన్ జారీ చేయబడితే, నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే అప్డేట్ చేసేందుకు ఎంప్లాయర్ ధృవీకరణ అవసరమవుతుంది. గతంలో, ఈ ప్రొఫైల్ మార్పులకు ఎంప్లాయర్ నుంచి ధృవీకరణ అవసరం ఉండేది. దీని వల్ల క్లెయిమ్ ప్రక్రియకు 28 రోజుల వరకు ఆలస్యం జరిగింది. ఇప్పుడు, 45శాతం అభ్యర్థనలను సభ్యులు స్వయంగా ఆమోదించుకోవచ్చు. మరో 50శాతం ఈపీఎఫ్ఓప్రమేయం లేకుండా ఎంప్లాయర్ ఆమోదంతో పూర్తి చేయొచ్చు.
అయితే, గమనించదగ్గ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏదైనా అప్డేట్లు లేదా విత్‌డ్రాల కోసం సభ్యులు తమ ఆధార్, పాన్లను తమ ఈపీఎఫ్ అకౌంటుకు లింక్ చేశారని నిర్ధారించుకోవాలి. ఈపీఎఫ్ వివరాలు, మీ ఆధార్ మధ్య తేడాలు ఏంటే ఆమోద ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చు. ఎంప్లాయర్, ఈపీఎఫ్ఓ ప్రతిస్పందన సమయాలను బట్టి మార్పులను ప్రాసెస్ చేసేందుకు కొన్ని వారాలు పట్టవచ్చు.
ఈపీఎఫ్ ప్రొఫైల్ వివరాలను ఎలా అప్డేట్ చేయాలి? :
- యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/)ని విజిట్ చేయండి.
- లాగిన్ చేసేందుకు మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయండి.
- లాగిన్ చేసిన తర్వాత ఎగువ మెనులో ‘Manage’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- మీరు పేరు, పుట్టిన తేదీ లేదా లింగం వంటి వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే ‘Modify Basic Details’ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ ఆధార్ కార్డ్ ప్రకారం.. సరైన సమాచారంతో అవసరమైన ఫీల్డ్‌లను నింపండి. మీ ఈపీఎఫ్ అకౌంట్, ఆధార్ వివరాలను నిర్ధారించుకోండి.
- అవసరమైతే సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి (ఉదా.. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా బర్త్ సర్టిఫికేట్ వంటివి)
ఈ అప్డేట్ ప్రక్రియ ద్వారా తప్పులు, ఫిర్యాదులు తగ్గుతాయి. ఈపీఎఫ్ సభ్యులకు వేగంగా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంప్లాయర్ నుంచి ధృవీకరణ అవసరం లేదు. మీరు పోర్టల్‌లోని ‘Track Request’ సెక్షన్లో మీ రిక్వెస్ట్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.