Royal Enfield EV Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ఫ్లి బ్రాండ్ బైక్ వస్తోంది.. పూర్తివివరాలివే!
Royal Enfield Flying Flea EV : ఫ్లయింగ్ ఫ్లీ ఈవీ బ్రాండ్ కింద మొదటి మోడల్ 2026లో మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త మోడల్ బైకును (FF-C6) అని పిలుస్తారు.

Royal Enfield launches new electric vehicle brand
Royal Enfield Flying Flea EV : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ‘ఫ్లయింగ్ ఫ్లి’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ బ్రాండ్ ఆవిష్కరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ 123 ఏళ్ల చరిత్రలో కొత్త ఈవీ బ్రాండ్‌ను ప్రారంభించి మరోకొత్త శకంలోకి ప్రవేశించింది.
ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్‌లను అందించడంలో ఫ్లయింగ్ ఫ్లీ ఈవీ బ్రాండ్ కింద మొదటి మోడల్ 2026లో మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త మోడల్ బైకును (FF-C6) అని పిలుస్తారు. (RE)రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను (EICMA 2024)కి ముందు ప్రదర్శించింది. ఈ ఎఫ్ఎఫ్-సీ6 ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ మోడల్ అడ్వాన్స్‌డ్ వెర్షన్ అని చెప్పవచ్చు.
ఫ్రంట్ సస్పెన్షన్ ఫేక్ అల్యూమినియం ‘గిర్డర్’ ఫోర్క్‌తో కూడిన మడ్‌గార్డ్ కలిగి ఉంది. ఈ ఫోర్క్ స్టైల్ 1930 పూర్వపు మోటార్ సైకిళ్ల మాదిరిగా ఉంటుంది. అప్పుడు మెగ్నీషియం బ్యాటరీ కేసుతో నడిచే ఫేక్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. ఇవన్నీ ఎఫ్ఎఫ్-సి6 మొత్తం డిజైన్ థీమ్‌కు తగినట్టుగా ఉంటాయి. రౌండ్ హెడ్‌ల్యాంప్ హౌసింగ్, సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా క్లాసిక్ వైబ్‌లను అందిస్తాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గత 6 నెలల్లోనే 28 పేటెంట్‌లను దాఖలు చేసినట్లు పేర్కొంది. ఇవన్నీ అనేక దేశీయ టెక్నాలజీలకు సంబంధించినవి. ద్విచక్ర వాహన దిగ్గజం సెంట్రల్ ‘వెహికల్ కంట్రోల్ యూనిట్’ని కూడా అభివృద్ధి చేసింది. అన్ని ఫిజికల్, డిజిటల్ టచ్‌పాయింట్‌లను ఇంటిగ్రేట్ చేస్తుంది. ప్రత్యేకంగా ఎఫ్ఎఫ్ కోసం రూపొందించిన టైలర్-మేడ్ చిప్‌తో ఆధారితంగా పనిచేస్తుంది.
ఈ వీసీయూ 2లక్షల విభిన్న రైడ్ మోడ్ కాంబినేషన్‌లను ఎనేబుల్ చేస్తుంది. బైక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు, ఫీచర్ మరిన్ని అప్‌డేట్స్ అందుకోనుంది. సింగిల్-సీట్, డబుల్-సీట్ మోడల్స్ రెండింటిలోనూ కనిపించే ఎఫ్ఎఫ్-సి6, అదనపు సౌలభ్యం కోసం లీన్ యాంగిల్ సెన్సింగ్ ఏబీఎస్, దేశీయ 3-పిన్ ప్లగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ (C6) కాకుండా, (RE) ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ క్రింద స్క్రాంబ్లర్ వెర్షన్‌ను కూడా తీసుకువస్తుంది. దీనిని (S6) అని పిలుస్తారు. (C6) ఒక కాన్సెప్ట్ అయినందున, 2026 ప్రారంభంలో కన్నా ముందు తుది ఉత్పత్తికి కొన్ని మార్పులు ఉండవచ్చు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్ అందుబాటులోకి రానుంది.
Read Also : HYD Traffic Police : వాహనదారులకు అలర్ట్.. బండి బయటకు తీస్తే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే భారీ ఫైన్..!