Royal Enfield Scrambler: రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్క్రామ్ 411 వచ్చేసింది
స్క్రామ్ 411 బైకుకి సంబందించి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్పై షాట్స్ ను చూసిన యువత.. ఈ బైక్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు

Scram 411
Royal Enfield Scrambler: భారత మోటార్ సైకిల్ దిగ్గజం ఐకానిక్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో సరికొత్త బైక్ మార్కెట్లోకి విడుదలైంది. “హిమాలయన్ స్క్రామ్ 411″గా పిలిచే ఈ బైక్ ను మంగళవారం దేశీయ విఫణిలోకి విడుదల చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ. సంస్థలో ఇప్పటికే ఉన్న హిమాలయన్ అడ్వెంచర్ బైక్ కే చిన్నపాటి మార్పులు చేసి నగరాల్లోని యువతను ఆకట్టుకునేలా స్క్రాంబ్లర్ తరహాలో ఈ బైక్ ను రూపొందించారు. స్క్రామ్ 411 బైకుకి సంబందించి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్పై షాట్స్ ను చూసిన యువత.. ఈ బైక్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రూ.2.03 లక్షల ప్రారంభ ధర నుంచి “హిమాలయన్ స్క్రామ్ 411” వినియోగదారులకు అందుబాటులో ఉంది.
Also read: Mobile Phones: ఉద్యోగులు పని సమయాల్లో మొబైల్ ఫోన్లు వాడటానికి వీల్లేదు- మద్రాస్ హైకోర్టు
“హిమాలయన్ స్క్రామ్ 411” ప్రత్యేకతలు:
రాయల్ ఎన్ఫీల్డ్ లో ఇప్పటికే ఉన్న హిమాలయన్ బైక్ ప్లాట్ఫారమ్ ఆధారంగానే ఈ “స్క్రామ్ 411” బైక్ ను రూపొందించారు. అయితే చిన్న చిన్న మార్పులు చేశారు. ముందుగా చెప్పుకోవాల్సింది హెడ్ లాంప్ డిజైన్ గురించే. హిమాలయన్ కు, స్క్రామ్ 411కు మధ్య గుర్తించగల్గిన వ్యత్యాసం హెడ్ లాంప్. హిమాలయన్ లో బయటకు పొంగుకొచ్చినట్లుగా ఉండే హెడ్ లాంప్.. స్క్రామ్ 411లో హ్యాండిల్ బార్ లోకి చొప్పించారు. ఇక ముందు టైర్ లోనూ మార్పులు చేశారు. హిమాలయన్లో ముందు భాగంలో 21 అంగుళాల టైర్ ఉంటే..స్క్రామ్ 411లో 119 అంగుళాల టైర్ అమర్చారు. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా బిన్నంగా రౌండ్ LCD ప్యానల్ ఏర్పాటు చేశారు.
Also read: iPhone SE 5G : రూ.28,900లకే iPhone SE 5G ఫోన్.. కండీషన్స్ అప్లయ్..!
స్క్రామ్ 411లో వెనుక భాగంలో ఫెండర్ తీసేశారు. ముందున ఉండే విండ్‌స్క్రీన్, ర్యాప్‌రౌండ్ ఫ్రేమ్‌ను కూడా తొలగించారు. స్ప్లిట్ సీటు స్థానంలో సింగిల్-పీస్ సీటు ఏర్పాటు చేశారు. వెనుకన ఉండే లగేజి ర్యాక్ ను తొలగించి గ్రాబ్ రైల్ ఏర్పాటు చేశారు. ఇవి మినహా ఇంజిన్ పరంగా హిమాలయన్ కు.. స్క్రామ్ 411కు మధ్య పెద్దగా మార్పులు లేవు. స్క్రామ్ 411.. 411cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 24.3 bhp 32 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉన్నాయి. వైట్ – రెడ్, గ్రే – యెల్లో, గ్రే-రెడ్, బ్లాక్ – రెడ్ వంటి కలర్ల కాంబినేషన్లో ఈ హిమాలయన్ స్క్రామ్ 411 లభిస్తుంది.