Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, ఫీచర్లు లీక్!
Samsung Galaxy S25 Ultra Leak : రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ హ్యాండ్‌సెట్ నుంచి ఏయే ఫీచర్లు ఉండవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy S25 Ultra Leak
Samsung Galaxy S25 Ultra Leak : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? 2025 ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. గత జనవరిలో వచ్చిన కంపెనీ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుందని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
ఈ నేపథ్యంలో రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ హ్యాండ్‌సెట్ నుంచి ఏయే ఫీచర్లు ఉండవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌లోని టాప్-ఆఫ్-లైన్ మోడల్ కూడా లీక్ అయిన 4 కలర్ ఆప్షన్లలో వస్తుందని అంచనా.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా డిజైన్, కలర్ ఆప్షన్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా డిజైన్‌తో వస్తాయి. ప్రస్తుత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో కనిపించే ఫ్లాట్ ఎడ్జ్‌లకు బదులుగా గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొద్దిగా రౌండ్ కార్నర్‌లను కలిగి ఉంటుంది. రెండర్లు బ్యాక్ కెమెరా మాడ్యూల్ క్లోజ్-అప్ వ్యూతో సహా స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్‌ను చూపుతాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ప్రతి కెమెరా లెన్స్ చుట్టూ మందమైన రింగ్‌లను కలిగి ఉంటుంది.
డిజైన్ రెండర్‌లలో ఒకటి మాత్రమే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా డిస్‌ప్లేను చూపుతుంది. అది కూడా ఫ్లాట్ స్క్రీన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లకు సపోర్టుతో వస్తుందని కూడా భావిస్తున్నారు. అన్ని లీకైన ఫొటోలలో ఎస్ పెన్ను కూడా చూడవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా టైటానియం బ్లాక్, టైటానియం బ్లూ, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుందని పోస్ట్ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ అదే కలర్ ఆప్షన్లతో లాంచ్ అవుతుందని గత నెలలోనే నివేదిక తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాతో పోలిస్తే.. పర్ఫార్మెన్స్ హ్యాండ్‌సెట్ ఇటీవల గీక్‌బెంచ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా మరిన్ని వివరాలు మరికొద్దివారాల్లో వెలువడే అవకాశం ఉంది.