Samsung Galaxy S26 Series : కొంటే శాంసంగ్ ఫోన్ కొనాలి.. ఈ గెలాక్సీ S26 సిరీస్పై ఏకంగా రూ. 19వేలు డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?
Samsung Galaxy S26 Series : శాంసంగ్ గెలాక్సీ సిరీస్ అదిరిపోయే డిస్కౌంట్తో లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి మొత్తంగా రూ. 19వేలు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S26 Series
- శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ ధర రూ. 10వేల వరకు తగ్గింపు
- ఈ శాంసంగ్ ఫోన్ బ్యాంకు ఆఫర్లతో రూ. 19వేలు డిస్కౌంట్
- గెలాక్సీ S26 అల్ట్రా ధర రూ.9వేల వరకు తగ్గింపు
Samsung Galaxy S26 Series : శాంసంగ్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్. శాంసంగ్ ఇండియా శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ధరను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ సిరీస్ లాంచ్ అయినప్పటినుంచి ఈ ఫోన్ ధర తగ్గలేదు. ఇప్పుడు, కంపెనీ ఈ సిరీస్ భారతీయ ధరలను తగ్గించింది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ సిరీస్ ధరను రూ. 19వేల వరకు తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్పై ఈ తగ్గింపును ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ధర భారీగా తగ్గింది. కంపెనీ ఈ ఫోన్ ధరలను తగ్గించింది. బ్యాంక్ కార్డు డిస్కౌంట్లతో కలిపి రూ. 19వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26+ ధర రూ. 10వేలు తగ్గింది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా కంపెనీ అదనంగా రూ. 9వేలు తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్ మొత్తం ధర రూ. 19వేలు తగ్గింది.
బ్యాంకు కార్డులతో రూ. 8వేల తగ్గింపు :
కంపెనీ శాంసంగ్ గెలాక్సీ S26 ధరను నేరుగా తగ్గించలేదు. బ్యాంక్ కార్డుల ద్వారా ఈ ఫోన్ను రూ. 8వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కూడా రూ. 9వేల వరకు తగ్గింపుతో పొందవచ్చు. అయితే, కంపెనీ ఎలాంటి అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించలేదు.
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 12GB + 256GB వేరియంట్ ఇప్పుడు రూ. 139,999 నుంచి రూ. 130,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 12GB + 512GB వేరియంట్ ధర రూ. 159,999 నుంచి రూ. 150,999కి కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, ఈ ఫోన్ 16GB + 1TB వేరియంట్ ధర రూ. 189,999 నుంచి రూ. 180,999కి కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ప్లస్ 12GB + 256GB వేరియంట్ అసలు ధర రూ. 1,19,999 ఉండగా రూ. 1,00,999కే సొంతం చేసుకోవచ్చు. 12GB + 512GB వేరియంట్ రూ. 1,39,999 నుంచి రూ. 1,20,999కు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 ఫోన్ 12GB + 256GB వేరియంట్ ఇప్పుడు రూ. 87,999 నుంచి రూ. 79,999కే కొనేసుకోవచ్చు. 12GB + 512GB వేరియంట్ ఇప్పుడు రూ. 107,999 నుంచి రూ. 99,999కే సొంతం చేసుకోవచ్చు.
