SBI Account Balance : SBI కస్టమర్లు.. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

SBI Account Balance : మీరు SBI కస్టమర్లు అయితే... మీ బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం తెలుసా? మినీ స్టేట్‌మెంట్ ఎలా చూసుకోవాలో తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ప్రయత్నించండి.

SBI Account Balance : SBI కస్టమర్లు.. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

SBI Bank Account Balance : ( Photo : Google)

SBI Account Balance : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్ల సౌకర్యం కోసం ఫ్రీ మిస్డ్ కాల్, (SMS Banking Service) బ్యాంకింగ్ సర్వీసును అందిస్తుంది. బ్యాంకు అకౌంట్‌దారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ పొందవచ్చు. (SBI Quick) మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ఫీచర్‌గా అందిస్తోంది. బ్యాంకు కస్టమర్‌లు (SBI Bank Customers) ఈ సదుపాయాన్ని మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా ముందే రిజిస్టర్ చేసిన నంబర్‌లకు SMS పంపడం ద్వారా బ్యాంకింగ్ సర్వీసు (Banking Services)లను యాక్సెస్ చేయవచ్చు.

ముఖ్యంగా, బ్యాంక్‌లో నిర్దిష్ట అకౌంట్లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు మాత్రమే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుందని గమనించాలి. SBI క్విక్ అనేది మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీసుగా చెప్పవచ్చు. SBI ఖాతాదారులకు రిజిస్ట్రేషన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ATM కార్డ్ బ్లాకింగ్ (ATM Card Blocking), కార్ లోన్ ఫీచర్లు, PM సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌లతో సహా అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది.

కస్టమర్‌లు సర్వీస్ నుంచి డి-రిజిస్టర్ (De-Register) చేసుకోవచ్చు. ఈ-మెయిల్ ద్వారా వారి అకౌంట్ స్టేట్‌మెంట్‌ను కూడా పొందవచ్చు. అదనంగా, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ సర్టిఫికెట్లను ఈ-మెయిల్ ద్వారా పొందవచ్చు. ఇతర ఫీచర్లలో ATM కార్డ్ ON/OFF, గ్రీన్ పిన్ జనరేషన్. (YONO)ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also :  Forgot SBI YONO Password : SBI YONO పాస్‌వర్డ్, యూజర్‌నేమ్ మరిచిపోయారా? ఎలా రీసెట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

SBI క్విక్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీసును ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం..
SBI క్విక్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీసును పొందాలంటే.. SBI కస్టమర్‌లు వన్-టైమ్ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

సర్వీసు కోసం రిజిస్టర్ చేసుకోవాలంటే? :
– ‘REG’ అనే టెక్స్ట్‌తో SMS పంపండి. నిర్దిష్ట అకౌంట్ కోసం బ్యాంక్‌లో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుంచి 09223488888కి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు.. మీ అకౌంట్ నంబర్ 12345678901 అయితే, మీరు ‘REG 12345678901’ అనే మెసేజ్ పంపాల్సి ఉంటుంది.

SBI Bank Account Balance _ How to check SBI bank account balance, get mini statement through SMS or missed call_ step-by-step guide

SBI Bank Account Balance : ( Photo : Google)

బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, మరిన్నింటిని ఎలా చెక్ చేయాలంటే? :
SBI క్విక్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్‌లు తమ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, మరిన్నింటిని మిస్డ్ కాల్‌లు లేదా SMS ద్వారా ఈ కిందివిధంగా చెక్ చేసుకోవచ్చు.

బ్యాలెన్స్ చెక్ చేయండి :
మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసేందుకు మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా 09223766666కు ‘BAL’ అనే టెక్స్ట్‌తో SMS పంపండి.

మినీ స్టేట్‌మెంట్ :
మినీ స్టేట్‌మెంట్ పొందడానికి, మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా 9223866666కు ‘MSTMT’ అనే టెక్స్ట్‌తో SMS పంపండి.

ATM కార్డ్‌ని బ్లాక్ చేయండి :
మీ ATM కార్డ్‌ని బ్లాక్ చేయాలంటే.. ‘BlockXXXX’ అనే టెక్స్ట్‌తో 567676 SMS పంపవచ్చు. ఇక్కడ XXXX మీ కార్డ్ నంబర్‌లోని చివరి 4 అంకెలను నమోదు చేయాలి.

కారు లేదా గృహ రుణాలు :
కారు లేదా గృహ రుణాలపై సమాచారం పొందాలంటే.. 567676 లేదా 09223588888కి ‘Car’ లేదా ‘Home’ అనే టెక్స్ట్‌తో SMS పంపండి.

సర్వీసు ఫుల్ లిస్టు :
SBI క్విక్ మిస్డ్ (SBI Quick) కాల్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉన్న సర్వీసుల పూర్తి జాబితాను చూడాలంటే.. 09223588888కి ‘Help’ అనే టెక్స్ట్‌తో SMS పంపండి. ఈ సర్వీసులను ఉపయోగిస్తున్నప్పుడు.. మీ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌ను మాత్రమే వాడాలని గుర్తుంచుకోండి.

Read Also : Vivo T2 5G Series : భారత్‌కు వివో T2 5G సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!