Signal App : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇకపై సిగ్నల్ యాప్‌తో మెసేజ్ పంపలేరు.. ఎందుకో తెలుసా?
Signal App : మీరు సిగ్నల్ యాప్ వాడుతున్నారా? డిఫాల్ట్ SMS యాప్‌గా ఉపయోగిస్తున్న Android సిగ్నల్ యాప్ యూజర్లకు అలర్ట్. ఇకపై మీ SMS పంపే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే Android యూజర్ల కోసం SMS సర్వీసును నిలిపివేయాలని సిగ్నల్ యాప్ (Signal App) నిర్ణయించింది.

Signal app to soon end this feature on your Android phone
Signal App : మీరు సిగ్నల్ యాప్ వాడుతున్నారా? డిఫాల్ట్ SMS యాప్‌గా ఉపయోగిస్తున్న Android సిగ్నల్ యాప్ యూజర్లకు అలర్ట్. ఇకపై మీ SMS పంపే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే Android యూజర్ల కోసం SMS సర్వీసును నిలిపివేయాలని సిగ్నల్ యాప్ (Signal App) నిర్ణయించింది. ఈ మేరకు బ్లాగ్ పోస్ట్‌లో ‘SMS సపోర్టుపై పేర్కొంది. ఈ ఫీచర్ నిలిపివేయడానికి వెనుక గల కారణాలను వివరంగా తెలిపింది. అందులో ప్రధాన కారణాలలో ఒకటి ‘సెక్యూరిటీ రిస్క్’. నార్మల్ టెక్స్ట్ SMSలు అంతర్లీనంగా ముప్పు ఉందని, టెలికాం కంపెనీలు మెటాడేటాను లీక్ చేస్తాయని మెసేజింగ్ యాప్ పేర్కొంది. డేటా ప్లాన్‌లు ఖరీదైనవి కావడంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కంపెనీ ప్లెయిన్ టెక్స్ట్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.
రెండవది.. యూజర్లు పంపే SMS సిగ్నల్ యాప్ ద్వారానే టెలికాం కంపెనీలు భారీ మెసేజింగ్ రుసుమును వసూలు చేశాయి. మెసేజింగ్ యాప్ ఇంటర్‌ఫేస్‌లో సిగ్నల్ మెసేజ్‌లతో పాటు SMS టెక్స్ట్‌లను లైవ్‌లో ఇన్వైట్ చేసేందుకు ముఖ్యమైన UX, డిజైన్ ద్వారా ఉదహరించింది. సిగ్నల్ ఇంటర్‌ఫేస్ ద్వారా పంపిన లేదా స్వీకరించిన SMS మెసేజ్‌లను యూజర్లు సేఫ్, ప్రైవేట్‌గా భావించరాదు. సిగ్నల్‌లో SMS నుంచి మార్పు పొందాలంటే యూజర్లకు చాలా నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, టెక్స్ట్ మెసేజ్‌లను మరొక యాప్‌కి ఎక్స్ పోర్ట్ చేయవచ్చు.

Signal app to soon end this feature on your Android phone
ఒకవేళ సిగ్నల్ లేదా మరొక ఛానెల్‌కు మార్చుకోవచ్చు. డెవలపర్‌ల ప్రకారం.. ఆండ్రాయిడ్‌లో సిగ్నల్‌ని డిఫాల్ట్ SMS యాప్‌గా ఉపయోగించే యూజర్లకు మాత్రమే ఈ కొత్త మార్పు కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌లో సిగ్నల్‌ని డిఫాల్ట్ SMS యాప్‌గా ఉపయోగించని కస్టమర్‌లు తమ ఫోన్‌లలో SMS యాప్‌ని మార్చవలసి ఉంటుంది.
SMS మెసేజ్‌లను సిగ్నల్ నుంచి కొత్త యాప్‌కి ఎక్స్ పోర్ట్ చేయాలి. యూజర్లు తప్పనిసరిగా వారి సిగ్నల్ అకౌంట్లలో సెట్టింగ్‌లకు వెళ్లాలి. అక్కడే చాట్‌లను ఎంచుకుని, ఆపై SMS/MMS ఓపెన్ చేయాలి. ఆ తర్వాత తప్పనిసరిగా మెసేజ్‌లను Export చేయాలి. ఆ వెంటనే కొత్త డిఫాల్ట్ SMS యాప్‌ని ఎంచుకోవాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..