SpaceX Launch : స్పేస్ఎక్స్ ఐదో స్టార్‌షిప్ ప్రయోగం సక్సెస్.. తిరిగొచ్చిన సూపర్ హెవీ బూస్టర్..!
SpaceX : స్టార్ షిప్ ఐదో ప్రయోగం విజయవంతం అయింది. నింగిలోకి దూసుకెళ్లిన సూపర్ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్‌కే చేరుకోవడం ఇదే మొదటిసారి.

SpaceX launches fifth Starship, catches Super Heavy booster ( Image Source : Google )
SpaceX Launch : టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ సొంత కంపెనీ స్పేస్ఎక్స్ చేపట్టిన అతిపెద్ద ప్రయోగం విజయవంతమైంది. స్పేస్ఎక్స్ ప్రయోగించిన ఐదో స్టార్‌షిప్ నింగిలోకి దూసుకెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం.. అక్టోబర్ 13 (ఆదివారం) ఉదయం టెక్సాస్ దక్షిణ తీరంలో ఈ రాకెట్‌ను ప్రయోగించారు. మొత్తం రెండు దశల్లో ఈ ప్రయోగం కొనసాగింది. నింగిలోకి వెళ్లిన బూస్టర్, స్పేస్‌క్రాప్ట్ విజయంతంగా భూమిని చేరాయి. అందులో ముందుగా బూస్టర్ భూ వాతావరణంలోకి ప్రవేశించి.. లాంచ్‌ప్యాడ్ వద్దకే తిరిగి చేరుకుంది.
Read Also : Honda Activa 7G Launch : హోండా యాక్టివా 7G స్కూటర్ వచ్చేస్తోంది.. 60కి.మీ మైలేజీ, ధర ఎంత ఉండొచ్చుంటే?
అంతరిక్షంలో గంటకు 17వేల మైళ్ల వేగంతో ప్రయాణించిన స్పేస్‌క్రాప్ట్.. పశ్చిమ ఆస్ట్రేలియాకు సమీపంలోని హిందూ మహాసముద్రంలో 90 నిమిషాల్లో విజయవంతంగా ల్యాండ్ అయింది. మొత్తం 71 మీటర్ల (233 అడుగులు) పొడవు ఉన్న భారీ బూస్టర్ వేగంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత అంతేవేగంగా తిరిగి లాంచ్ ప్యాడ్ వద్దకు చేరుకుంది.
The tower has caught the rocket!!
pic.twitter.com/CPXsHJBdUh— Elon Musk (@elonmusk) October 13, 2024
బూస్టర్ తిరిగి వచ్చే క్రమంలో లాంచ్ ప్యాడ్ వద్ద చాప్‌స్టిక్‌లు వెంటనే లోపలికి లాగేసుకున్నాయి. బూస్టర్ 12గా పిలిచే సూపర్ హెవీ బూస్టర్ ఈ ఘనతను సాధించింది. బూస్టర్ ప్యాడ్‌పైకి దిగింది. పై రెండు హ్యాండ్స్ బూస్టర్ పైభాగంలో మూసుకుపోయాయి. గ్రిడ్ దిగువన ఏడు నిమిషాల తర్వాత బూస్టర్ తన గమ్యాన్ని చేరుకుంది.
ఈ ప్రయోగం సక్సెస్ సాధించడంపై ఎలన్ మస్క్ స్పందించారు. ఇంజినీరింగ్ అద్భుతమని పేర్కొంటూ ఆయన వీడియోను వీడియోను పోస్ట్ చేశారు. స్పేస్‌క్రాఫ్ట్ నిర్దేశిత ప్రదేశంలో కచ్చితత్వంతో ల్యాండ్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో స్పేస్ఎక్స్ రెండు టార్గెట్స్ సాధించిందని మస్క్ వెల్లడించారు.
— Elon Musk (@elonmusk) October 13, 2024
ప్రయోగం సక్సెస్ కావడంతో స్పేస్‌ఎక్స్ కంట్రోల్ రూం సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. స్టార్‌షిప్ రాకెట్ పొడవు 121 మీటర్లు (400 అడుగులు) ఉంది. రెండు దశల్లో ప్రయోగించిన బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా అంగారకుడు, చందమామపై యాత్రల కోసం ‘స్పేస్‌ఎక్స్’ ప్రత్యేకంగా రూపొందించింది.
Read Also : Maruti Suzuki Fronx : మారుతి సుజుకి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు.. భారత్‌లోనే అత్యంత వేగవంతమైన కారు..!