Tech Tips Telugu : కొత్త ఆపిల్ ఐఫోన్ కొన్నారా? రియల్ లేదా ఫేక్.. ఎలా చెక్ చేయాలంటే? ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!

Tech Tips Telugu : మీరు కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తున్నా లేదా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నా లేదా మీ ప్రస్తుత ఐఫోన్ రియల్ లేదా ఫేక్ ఐఫోన్ కాదా అని చెక్ చేసేందుకు కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి.

Tech Tips Telugu : కొత్త ఆపిల్ ఐఫోన్ కొన్నారా? రియల్ లేదా ఫేక్.. ఎలా చెక్ చేయాలంటే? ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!

Tech tips _ How to check if your new iPhone is real or fake

Updated On : September 25, 2024 / 11:34 PM IST

Tech Tips Telugu : ఆపిల్ కొత్త ఐఫోన్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అందులోనూ ఆన్‌లైన్‌లో ఐఫోన్లు ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఫేక్ ఐఫోన్లు అమ్ముతున్నారు.. అచ్చం ఐఫోన్ మాదిరిగా ఉండే ఫేక్ ఐఫోన్లను గుర్తుపట్టడం కొద్దిగా కష్టమే.

అయినప్పటికీ కొన్ని ఈ టెక్ టిప్స్ పాటించడం ద్వారా మీరు కొనుగోలు చేసిన ఐఫోన్ రియల్ లేదా ఫేక్ అనేది సులభంగా గుర్తించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లలో ఐఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు టాప్-టైర్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లతో మాత్రమే ప్యాక్ చేయదు. కానీ, కొన్నింటికి స్టేటస్ సింబల్‌ను కూడా సూచిస్తాయి.

Read Also : Airtel AI Spam Detection : స్పామ్ కాల్స్, ఫేక్ SMSలకు ఇక చెక్ పడినట్టే.. ఎయిర్‌టెల్ ఏఐ స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌.. ఇండియా ఫస్ట్ నెట్‌వర్క్..!

(Statista.com) ప్రకారం.. 2024 మూడవ త్రైమాసికంలో ఆపిల్ ఐఫోన్‌ల విక్రయాల ద్వారా దాదాపు 39 బిలియన్ అమెరికా డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. అయితే, ఐఫోన్లకు ఉన్న అధిక డిమాండ్ కారణంగా దాదాపు ఒకేలా ఉండే ఫేక్ ఐఫోన్ మోడల్‌ల పెరుగుదలకు దారితీసింది.

ఒకవేళ, మీరు ఆపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ స్టోర్ల నుంచి ఐఫోన్ కొనుగోలు చేస్తే చింతించాల్సిన అవసరం లేదు. కానీ, మీరు అనధికారిక థర్డ్-పార్టీ రిటైలర్ల నుంచి ఐఫోన్లు కొనుగోలు చేసినా లేదా ధృవీకరించని మార్కెట్‌లకు రిపేర్ కోసం ఇచ్చినా, ఫేక్ ఐఫోన్‌లను స్వీకరించినట్లు లేదా రిపేర్ల సమయంలో వారి రియల్ ఐఫోన్లను ఫేక్ వాటితో ఎక్స్ఛేంజ్ చేసినట్టుగా అనేక సందర్భాలు ఉన్నాయి.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్‌లలో పండుగ విక్రయాలు త్వరలో ప్రారంభం కానుంది. ఇలాంటి ఫెస్టివల్ సేల్ సమయంలోనే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తున్నా లేదా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నా లేదా మీ ప్రస్తుత ఐఫోన్ రియల్ లేదా ఫేక్ ఐఫోన్ కాదా అని మీరు చెక్ చేసేందుకు కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

ప్యాకేజింగ్, అప్లియన్సెస్ చెక్ చేయండి :
మీ ఐఫోన్ ప్రామాణికతను వెరిఫై చేసేందుకు మొదటి దశల్లో ఒకటి ప్యాకేజింగ్, మరొకటి అప్లియన్సెస్ పరిశీలించాలి. ఆపిల్ ప్యాకేజింగ్‌లో కూడా వివరాలను కచ్చితంగా ఉంటుంది. రియల్ ఐఫోన్ బాక్స్‌లు చాలా ధృడంగా ఉంటాయి. హై క్వాలిటీ ఫొటోలు, కచ్చితమైన టెక్స్ట్ కలిగి ఉంటాయి. కేబుల్ వంటి బాక్సులోని అప్లియన్సెస్ ఆపిల్ ప్రమాణానికి సరిపోలాలి. మీరు క్వాలిటీ లేని ప్రింటింగ్, వదులుగా ఉండే ప్యాకేజింగ్ లేదా సరిపోలని అప్లియన్సెస్ గమనించినట్లయితే.. అది ఫేక్ ఐఫోన్ అప్లియన్సెస్ అని గుర్తుపట్టవచ్చు.

సీరియల్ నెంబర్, IMEI వెరిఫై చేయండి :
ప్రతి స్మార్ట్‌ఫోన్‌లాగే, ఐఫోన్‌కు ప్రత్యేకమైన సీరియల్ నంబర్, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) నంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ కనుగొనేందుకు Settings > General > About ఆప్షన్ క్లిక్ చేయండి. ఆపై, ఆపిల్ చెక్ కవరేజ్ పేజీని విజిట్ చేసి సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి.

మీ ఐఫోన్ అథెంటికేషన్ అయితే వెబ్‌సైట్ మీ ఐఫోన్ మోడల్, వారంటీ స్టేటస్, ఇతర సంబంధిత సమాచారం గురించి వివరాలను ప్రదర్శిస్తుంది. IMEI చెక్ చేయడానికి, మీ ఐఫోన్‌లో *#06# డయల్ చేయండి. కనిపించే నెంబర్ బాక్స్, సిమ్ ట్రేలో లిస్టు అయిన IMEIతో సరిపోల్చండి. అన్ని సీరియల్ నెంబర్లు సరిపోలాలి.

ఐఫోన్ బుల్డ్ క్వాలిటీని చెక్ చేయండి :
ఆపిల్ ఐఫోన్‌లు ప్రీమియంతో చాలా ధృడంగా ఉంటాయి. మీరు ఒరిజినల్ ఐఫోన్‌ని పట్టుకున్నప్పుడు డివైజ్ చాలా పటిష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బటన్లు దృఢంగా క్లిక్ చేయాలి. బ్యాక్ సైడ్ ఆపిల్ లోగో కచ్చితంగా ఉండాలి. లోగో స్పర్శకు మృదువైన అనుభూతిని కలిగించాలి. మీ ఐఫోన్ మొత్తం డిజైన్, ఫిజికల్ ఫీచర్లపై కూడా శ్రద్ధగా పరిశీలించాలి.

స్క్రీన్ సైజు, డిస్‌ప్లే క్వాలిటీ, బరువు, మందం అధికారిక మోడల్ స్పెసిఫికేషన్‌లకు సరిపోలాలి. సిమ్ ట్రేని తీసివేసి, స్లాట్‌ని చెక్ చేయండి. ఫేక్ ఐఫోన్‌లు తరచుగా బిల్డ్‌లో గరుకు అంచులు, తప్పుగా అమర్చిన లోగోలు లేదా వదులుగా ఉండే బటన్‌లు వంటి లోపాలను కలిగి ఉంటాయి. వీటిని మీరు దగ్గరగా చూస్తే సులభంగా గుర్తించవచ్చు. మీరు మరింత దగ్గరగా పరిశీలించడానికి భూతద్దం ఉపయోగించవచ్చు.

సాఫ్ట్‌వేర్, ఫీచర్లను చెక్ చేయండి :
ఫేక్ ఐఫోన్‌ను గుర్తించే అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఇదొకటి. సాఫ్ట్‌వేర్ ద్వారా రియల్ ఐఫోన్లు ఆపిల్ యాజమాన్య iOSలో రన్ అవుతాయి. మీ ఐఫోన్ iOS లేటెస్ట్ వెర్షన్‌ను రన్ చేస్తుందో లేదో చెక్ చేయాలి. Settings > General > Software Update ఆప్షన్‌కు వెళ్లడం ద్వారా ఈజీగా చెక్ చేయవచ్చు.

సోషల్ మీడియాలో తరచుగా కనిపించే ఫేక్ ఐఫోన్‌ల మాదిరిగా కాకుండా ఐఓఎస్ లాగా కనిపించేలా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండవచ్చు. రియల్ ఐఫోన్ ఎల్లప్పుడూ iOSలోనే రన్ అవుతుంది. అలాగే, పవర్ బటన్‌ను పట్టుకోవడం ద్వారా లేదా “Hey Siri” అని చెప్పడం ద్వారా ప్రయత్నించండి. సిరి వెంటనే యాక్టివ్ చేయకపోతే మీ ఐఫోన్ ఫేక్ కావచ్చు.

ఆపిల్ సర్వీస్ సెంటర్‌ని సందర్శించండి :
మీ కొత్త ఐఫోన్‌లో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ గమనించారా? మీ ఐఫోన్ అథెంటిసిటీ గురించి కచ్చితంగా తెలియదా? 100శాతం కచ్చితత్వం తెలియాలంటే.. అధీకృత ఆపిల్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి నిపుణులతో చెక్ చేయించుకోవడం తప్పనిసరి.

Read Also : Airtel Xstream AirFiber Plans : ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండగే.. ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు.. ధర ఎంత? ఫీచర్లు, డేటా, ఓటీటీ బెనిఫిట్స్..!