Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఎలా మార్చుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ టిప్స్..!

Tech Tips in Telugu : మీరు గూగుల్ టీవీ యాప్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్ (Android Phone) లేదా ఐఫోన్ (iPhone) ద్వారా స్మార్ట్‌టీవీ రిమోట్‌గా మార్చవచ్చు.

Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఎలా మార్చుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ టిప్స్..!

Tech Tips in Telugu _ How to turn your smartphone into TV remote

Updated On : June 27, 2023 / 9:02 PM IST

Tech Tips in Telugu : మీ టీవీ రిమోట్ పాడైందా? అయితే మీ టీవీని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదా? అయితే, మీ స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. టీవీ రిమోట్‌గా మార్చుకోవచ్చు. కొన్నిసార్లు సోఫా లేదా మంచం కిందపడి రిమూట్ కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు మీ టీవీ రిమోట్ ఎక్కడో దాచిపెడతారు. రిమోట్‌ను పోగొట్టుకోవడం వల్ల టీవీని ఉపయోగించలేరు. అయితే, మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ టీవీ రిమోట్‌గా ఉపయోగించవచ్చు. మీరు విన్నది నిజమే. గూగుల్ యాప్‌(Google TV)తో మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ ఆధారిత టీవీని కంట్రోల్ చేయొచ్చు.

దీని అర్థం.. మీరు లేచి రిమోట్‌ని కనుగొనాల్సిన అవసరం లేకుండానే ఛానెల్‌లను మార్చవచ్చు. టీవీ వాల్యూమ్‌ను మార్చుకోవచ్చు. మీకు ఇష్టమైన యాప్‌లను కూడా ప్రయత్నించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ యాప్ పని చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్‌లో (Google TV) యాప్‌ని సెటప్ చేయడానికి మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఇలా మార్చుకోవచ్చు.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ లీక్.. భారత్‌లో వార్షిక సేల్ ఎప్పటినుంచంటే?

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఎలా మార్చాలి :
* Google Play స్టోర్‌ని ఓపెన్ చేసి (Google TV) యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* మీ టీవీ, ఫోన్ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి.
* మీ టీవీకి Wi-Fi లేకపోతే.. మీ ఫోన్, టీవీని కనెక్ట్ చేసేందుకు బ్లూటూత్‌ని కూడా ఉపయోగించవచ్చు.
* గూగుల్ టీవీ యాప్‌ను ఓపెన్ చేయండి.
* యాప్ ఓపెన్ చేసిన తర్వాత, దిగువ కుడి మూలలో ఉన్న రిమోట్ బటన్‌ను నొక్కండి.
* యాప్ డివైజ్‌ల కోసం స్కాన్ చేయొచ్చు. మీ టీవీని గుర్తించిన తర్వాత లిస్టు దాన్ని ఎంచుకోండి.
* మీ టీవీ స్క్రీన్‌పై కోడ్ కనిపిస్తుంది. యాప్‌లో కోడ్‌ని ఎంటర్ చేసి Tap చేయండి.
* మీ ఫోన్‌ను మీ టీవీతో పెయిర్ చేసిన తర్వాత సాధారణ రిమోట్‌తో టీవీని కంట్రోల్ చేసేందుకు ఉపయోగించవచ్చు.

Tech Tips in Telugu _ How to turn your smartphone into TV remote

Tech Tips in Telugu _ How to turn your smartphone into TV remote

మీ ఐఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఎలా మార్చాలి? :
* మీ ఐఫోన్ (iPhone) టీవీ (TV) ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతుంది.
* యాప్ స్టోర్ నుంచి (Google TV) యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
* మీ ఐఫోన్‌లో గూగుల్ టీవీ యాప్‌ను ఓపెన్ చేయండి.
* స్క్రీన్ కుడి దిగువ మూలన ఉన్న టీవీ రిమోట్ ఐకాన్ నొక్కండి.
* యాప్ ఆటోమేటిక్‌గా మీ టీవీ కోసం సెర్చ్ చేస్తుంది. మీ టీవీని గుర్తించలేకపోతే.. డివైజ్‌ల కోసం స్కాన్ బటన్‌పై Tap చేయండి.
* మీ టీవీ కనుగొన్న తర్వాత దాన్ని ఎంచుకుని, మీ టీవీ స్క్రీన్‌పై కనిపించే 6-అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి.
* మీ ఐఫోన్‌ను మీ టీవీకి కనెక్ట్ చేసేందుకు పెయిర్‌పై నొక్కండి.
* మీ ఐఫోన్‌ని మీ టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత సాధారణ రిమోట్ కంట్రోల్‌తో మీ టీవీని కంట్రోల్ చేసేందుకు యాప్ ఉపయోగించవచ్చు.
* మీరు ఛానెల్‌ని మార్చడానికి, వాల్యూమ్‌ను ఎడ్జెట్ చేయడానికి, ప్లేబ్యాక్‌ని కంట్రోల్ చేయడానికి యాప్‌ని ఉపయోగించవచ్చు.

Read Also : Reliance Jio Phone 5G : అతి చౌకైన ధరకే జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ డేట్ ఎప్పుడంటే?