Tecno Phantom V Flip : టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ మడతబెట్టే ఫోన్.. ఈ నెల 22న వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు మీకోసం..!

Tecno Phantom V Flip : టెక్నో నుంచి ఫస్ట్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఫోన్ కవర్‌పై ప్రత్యేకమైన రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Tecno Phantom V Flip : టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ మడతబెట్టే ఫోన్.. ఈ నెల 22న వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు మీకోసం..!

Tecno Phantom V Flip set to launch on September 22, everything you need to know

Updated On : September 22, 2023 / 10:42 PM IST

Tecno Phantom V Flip : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో(Tecno) మొట్టమొదటి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ అద్భుతమైన ఫోన్ సెప్టెంబర్ 22న సింగపూర్‌లో ఫ్లిప్ ఇన్ స్టైల్ టెక్నో ఫ్లాగ్‌షిప్ ప్రోడక్ట్ లాంచ్ 2023 ఈవెంట్‌ జరుగనుంది. అధికారిక లాంచ్‌కు ముందే.. ఈ ఫ్లిప్ ఫోన్ గురించిన కొన్ని వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి.

వాస్తవానికి (Alibaba.com) అనే చైనీస్ షాపింగ్ వెబ్‌సైట్‌లో దీని కవర్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ కవర్ ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. చాలా ఫ్లిప్ ఫోన్‌ల మాదిరిగా కాకుండా టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ బయటి కవర్‌లో రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

Read Also : Pixel Watch 2 Launch : గూగుల్ పిక్సెల్ వాచ్ 2 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ సేల్ ఎప్పుడంటే?

ప్రస్తుతం టెక్నో కంపెనీ ఫోన్ స్పెషిఫికేషన్లను అధికారికంగా రివీల్ చేయలేదు. 14-అంగుళాల ల్యాప్‌టాప్ (Tecno Megabook T1 2023) అనే మరో ప్రొడక్టుతో పాటుగా ప్రవేశపెట్టనుందని కంపెనీ ధృవీకరించింది. లీక్ అయిన ఇమేజ్‌లు, సమాచారం విషయానికి వస్తే.. Tecno Phantom V ఫ్లిప్ బయటి కవర్‌లో సర్కిల్ డిస్‌ప్లే కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సెకండరీ స్క్రీన్ చుట్టూ.. రెండు వెనుక కెమెరాలు, LED ఫ్లాష్‌ను గుర్తించవచ్చు. మీరు దాన్ని ఫ్లిప్ చేసి ఓపెన్ చేస్తే.. ముందు భాగంలో సెన్సార్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లే ఉంటుంది.

టెక్నో ఫాంటమ్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్ మోడల్ నంబర్ AD11తో Google Play కన్సోల్ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. ఈ జాబితా ప్రకారం.. 8GB RAMని కలిగి ఉండవచ్చు. బాక్స్ వెలుపల Android 13తో రావచ్చు. హుడ్ కింద, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌తో రన్ కావొచ్చు. ARM Mali G77 GPUతో కలిసి ఉండవచ్చు.

Tecno Phantom V Flip set to launch on September 22, everything you need to know

Tecno Phantom V Flip set to launch on September 22, everything you need to know

స్క్రీన్ విషయానికి వస్తే.. 1,080×2,640 పిక్సెల్‌ల రిజల్యూషన్ 480ppi పిక్సెల్ సాంద్రతతో ఫుల్-HD+ డిస్‌ప్లేను పొందవచ్చు. కెమెరా వారీగా వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 13MP సెకండరీ కెమెరా, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 4,000mAh బ్యాటరీ కావచ్చు. 45W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఇంతలో, శాంసంగ్ ఈ ఏడాదిలో ఆగస్టులో Galaxy Z ఫ్లిప్ 5ని లాంచ్ చేసింది. ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 3.4-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. 8GB RAM, 256GB స్టోరేజీని కలిగి ఉంది. వెనుక కెమెరా సిస్టమ్ 12MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 10MP సెన్సార్ కలిగి ఉండవచ్చు. Galaxy Z Flip 5 ఫోన్ 3,900mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : iQoo 12 Series Launch : ఐక్యూ 12 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక స్పెషిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడో తెలుసా?