Fake Malware Android App : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్‌లో ఈ ఫేక్ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. తస్మాత్ జాగ్రత్త!

Fake Malware Android App : ఆండ్రాయిడ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఈ మాల్‌వేర్ యాప్ ఉందేమో చెక్ చేసుకోండి.. లేదంటే మీ విలువైన డేటాను హ్యాకర్లు దొంగిలించే అవకాశం ఉంది.

Fake Malware Android App : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్‌లో ఈ ఫేక్ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. తస్మాత్ జాగ్రత్త!

This fake malware Android app can read SMS, record phone calls, access camera to steal user data

Updated On : October 17, 2023 / 11:10 PM IST

Fake Malware Android App : ఆండ్రాయిడ్ యూజర్లకు వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ మాల్‌వేర్ యాప్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే.. మీ పర్సనల్ డేటా (Hack you Personal Data)ను హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. సైబర్‌ సెక్యూరిటీ (Cyber Security) ప్రపంచంలో పరిశోధకులు స్పైనోట్ (SpyNote) అనే తప్పుడు ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్‌ (Android Banking Trojan) ను కనుగొన్నారు. ఈ మాల్వేర్ యాప్ మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సాధారణ అప్‌డేట్‌గా కనిపిస్తుంది. ఈ ఫేక్ యాప్ సైబర్ నేరగాళ్లకు ప్రత్యేక యాక్సెస్‌ను ఇచ్చేలా చేస్తుంది.

ఈ యాక్సెస్‌ను పొందిన తర్వాత టెక్స్ట్ మెసేజ్‌లు, ముఖ్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించడానికి అనుమతిస్తుంది. F-సెక్యూర్ అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ నిపుణులు స్పైనోట్ గురించి వివరాలను తెలియజేసే రిపోర్టును రిలీజ్ చేశారు. ఈ మాల్వేర్ ఎక్కువగా ఫేక్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా వ్యాపిస్తుందని, స్పెషల్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఇన్‌స్టాల్ చేసేలా ప్రేరేపిస్తుందని సైబర్ నిపుణులు కనుగొన్నారు.

Read Also : 2023 Tata Safari Harrier : కొత్త కారు కొంటున్నారా? 2023 టాటా సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు.. ఏ కారు ధర ఎంతంటే?

కనిపించకుండా మీ డేటాను తస్కరిస్తుంది :
స్పైనోట్ బోల్డ్‌గా ఉన్నందున కాల్ లాగ్‌లు, కెమెరా యాక్సెస్, టెక్స్ట్ మెసేజ్‌లు, మీ ఫోన్ స్టోరేజీ వంటి సమాచారాన్ని మాత్రమే తీసుకోదు. మీ ఫోన్‌లో హైడ్ చేసుకోవచ్చు. మీ హోమ్ స్క్రీన్‌పై ఇటీవలి యాప్‌లలో హైడ్ అయి ఉంటుంది. అంతేకాదు.. సెక్యూరిటీ సిస్టమ్‌లకు కనుగొనడం, ఆపడం కష్టతరం చేస్తుంది. స్పైనోట్ విషయాలలో ఒకటి.. ఫోన్ కాల్‌లతో సహా సౌండ్ రికార్డ్ చేయగలదు. మీ కన్వర్జేషన్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించడంతో వినియోగదారులకు పెద్ద సమస్యగా మారుతుంది.

స్పైనోట్ (F-Secure) అనేది ముప్పు కాదని పరిశోధకుడు అమిత్ తాంబే వివరించారు. మీ ఫోన్‌లోకి చొరబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్పైనోట్ మాల్వేర్ యాప్‌ను ఎనేబుల్ చేయొచ్చు. తద్వారా మాల్వేర్ యాప్ యాక్టివేట్ అయి.. మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో చొరబడే అవకాశాన్ని కలిగి ఇస్తుంది. స్పైనోట్ ప్రత్యేక అనుమతులను కూడా తీసుకుంటుంది.

This fake malware Android app can read SMS, record phone calls, access camera to steal user data

fake malware Android app can read SMS

మీ ఫోన్ కాల్స్, స్ర్కీన్ ఫొటోలను రికార్డు చేస్తుంది జాగ్రత్త.. :
మీ ఫోన్‌కి సౌండ్ రికార్డింగ్, ఫోన్ కాల్‌లు, మీ స్క్రీన్ ఫొటోలను క్యాప్చర్ చేయడం చేస్తుంది. దాంతో యూజర్లకు పెద్ద సమస్యగా మారుతుంది. మీ ఫోన్ సెట్టింగ్స్ ద్వారా ఫేక్ యాప్‌ను డిలీట్ చేయడం అంత సులభం కాదు. స్పైనోట్ సెట్టింగ్ మెనుని కనిపించకుండా చేస్తుందని అమిత్ తాంబే హెచ్చరించాడు.

స్పైనోట్ నమూనా అనేది స్పైవేర్, కీస్ట్రోక్‌లు, కాల్ లాగ్‌లు, ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌ల సమాచారం మరెన్నో సహా అనేక రకాల సమాచారాన్ని లాగ్ చేసి దొంగిలిస్తుంది. బాధితుడి డివైజ్‌లో దాగి ఉంటుంది. ఈ ఫేక్ యాప్ ఎక్కడ ఉందో గుర్తించలేరు. డిలీట్ చేయడం కూడా అంతే సవాలుతో కూడుకున్న పని. తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది.

ఫలితంగా, మీ ఫోన్ డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్స్‌తో వస్తుంటారని గమనించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ డివైజ్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రమాదకరమైన యాప్‌ల నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు రెగ్యులర్ అప్‌డేట్‌లు, భద్రతపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Whatsapp Passwordless Key : వాట్సాప్‌‌‌లో కొత్త ఫీచర్.. పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఎనేబుల్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!