తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? టాప్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

నోకియా G60 5G 6.6-అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది.

తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? టాప్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Updated On : May 13, 2025 / 7:35 AM IST

మీకు నోకియా ఫోన్లంటే ఇష్టమా? ఆ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనాలనుకుంటే తక్కువ ధరకే మూడు టాప్‌ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. నోకియా జీ42 5జీ, నోకియా సీ 22, నోకియా జీ60 5జీ ఫోన్ల ఫీచర్లు, ధరల గురించి తెలుసుకుందాం..

నోకియా G42 5G
నోకియా నుంచి వచ్చిన టాప్ స్మార్ట్‌ఫోన్ G42 5G. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర కేవలం రూ.11,999 మాత్రమే. ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14లలో రన్‌ అవుతుంది. 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 GB RAMతో అందుబాటులో ఉంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో 5000 mAh బ్యాటరీతో సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చింది.

Also Read: త్వరలో మార్కెట్లోకి వస్తున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల గురించి తెలుసుకుంటే ఎగిరి గంతులేస్తారు..

నోకియా C22
ఈ నోకియా ఫోన్ ధర కేవలం రూ.7,499 మాత్రమే. అతి తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటే ఇదే మంచి ఆప్షన్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్)లో రన్ అవుతుంది. 13 MP ప్రైమరీ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ వచ్చింది. 6.5-అంగుళాల స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది.

నోకియా G60 5G
నోకియా G60 5G 6.6-అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది. ఇందులో 6 GB RAM, 128 GB స్టోరేజ్‌ ఉంటుంది. ఈ ఫోన్ Android OS 12పై రన్‌ అవుతుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో ఉంది. 4500 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. దీని ధర రూ. 29,999.