2025లో టాప్ 6 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఒక్క చేతితోనూ ఈజీగా వాడొచ్చు.. ఫీచర్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే?
ఈ స్మార్ట్‌ఫోన్‌లు పనితీరు, కెమెరా, బ్యాటరీ లైఫ్ వంటి అన్ని కీలక అంశాలలోనూ ముందుంటాయి. మీ అవసరాలకు తగిన కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోండి

పెద్ద స్క్రీన్‌లు ఉండే స్మార్ట్‌ఫోన్లంటే కొందరికి ఇష్టం ఉండదు. ఒక్క చేత్తో సులభంగా ఆపరేట్ చేసే చిన్న స్మార్ట్‌ఫోన్‌లను కొంటుంటారు. జేబులో ఇట్టే ఇమిడి, తేలికగా వాడగలిగే కాంపాక్ట్ ఫోన్‌లకు ఆదరణ బాగా ఉంది. 2025లో మార్కెట్లోకి వచ్చిన కొన్ని అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లు, చిన్న పరిమాణంలోనే శక్తిమంతమైన పనితీరుతో లభ్యమవుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లో ఉన్న టాప్ 6 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 15 Pro: కాంపాక్ట్ పవర్‌హౌస్

Apple iPhone 15 Pro
చిన్న పరిమాణంలోనూ శక్తిమంతమైన పనితీరు కోరుకునేవారికి ఐఫోన్ 15 ప్రో ఒక మంచి ఆప్షన్. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. అత్యాధునిక A17 ప్రో చిప్‌తో గేమింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి అన్ని పనుల్లోనూ అసాధారణమైన పనితీరును అందిస్తుంది.
Samsung Galaxy S24: ఆండ్రాయిడ్ లవర్స్ కోసం స్లీక్ ఛాయిస్

Samsung Galaxy S24
ఆండ్రాయిడ్ వినియోగదారులు, చిన్న డిజైన్‌ను ఇష్టపడేవారి కోసం గెలాక్సీ S24 అందుబాటు ఉంది. 6.2 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే, పలుచటి బాడీతో ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వేగవంతమైన ఎక్సినాస్ 2400 లేదా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది.
Asus Zenfone 11 Ultra Compact Edition: స్మార్ట్, సింపుల్, పవర్‌ఫుల్

ASUS Zenfone 11 Ultra Compact Edition
ఏసుస్ ఈసారి 5.9 అంగుళాల కాంపాక్ట్ OLED డిస్‌ప్లేతో ఒక ప్రత్యేక వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇది చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా, జేబులో తేలికగా ఇమిడిపోతుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, దీర్ఘకాలం ఉండే బ్యాటరీ బ్యాకప్‌తో, చిన్నగా ఉన్నా ఇది పూర్తిస్థాయి పవర్ ప్యాకేజ్.
Google Pixel 8: క్లీన్ ఆండ్రాయిడ్

Google Pixel 8
గూగుల్ పిక్సెల్ 8, 6.2 అంగుళాల డిస్‌ప్లేతో చాలా సింపుల్, స్టైలిష్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఒక్క చేత్తో ఆపరేట్ చేయడం చాలా సులభం. పిక్సెల్ ఫోన్‌లకు పేరుగాంచిన అద్భుతమైన కెమెరా పనితీరు, క్లీన్ అండ్ ఫాస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. కాంపాక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది టాప్ ఆప్షన్.
Sony Xperia 5 V: ప్రొఫెషనల్ కెమెరాతో కాంపాక్ట్ డిజైన్

Sony Xperia 5 V
ఫొటోగ్రఫీని సీరియస్‌గా తీసుకునే కాంపాక్ట్ ఫోన్ యూజర్ల కోసం సోనీ ఎక్స్‌పీరియా 5 V సిద్ధంగా ఉంది. 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే, DSLR-స్థాయి అనుభూతినిచ్చే ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇది వస్తుంది. దీని పొడవాటి, సన్నని డిజైన్ ఒక్క చేతితో పట్టుకోవడానికి, వాడటానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
iPhone SE 4 (2025): బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఐఫోన్

iPhone SE 4 2025
బడ్జెట్‌కు అనుకూలమైన, చిన్న ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐఫోన్ SE 4 (2025) ఒక బెస్ట్ ఆప్షన్. 6.1 అంగుళాల డిస్‌ప్లేతో, ఇది ఐఫోన్ 14 డిజైన్‌ను పోలి ఉంటుంది. పనితీరులో A16 బయోనిక్ చిప్ వేగంగా, సున్నితంగా పనిచేస్తుంది.
2025లో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లకు కొదవ లేదు. ఒక్క చేత్తో ఫోన్ వాడాలనుకునేవారికి, పైన పేర్కొన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు పనితీరు, కెమెరా, బ్యాటరీ లైఫ్ వంటి అన్ని కీలక అంశాలలోనూ ముందుంటాయి. మీ అవసరాలకు తగిన కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోండి.